Realme Narzo 80 Pro : గుడ్ న్యూస్.. రియల్‌మి నార్జో 80ప్రో వస్తోంది.. ఫుల్ ఫీచర్లు లీక్.. ధర కేవలం రూ. 20వేల లోపే..!

Realme Narzo 80 Pro : రియల్‌మి నుంచి సరికొత్త నార్జో 80 ప్రో మోడల్ వచ్చేస్తోంది. భారత మార్కెట్లో కేవలం రూ. 20వేల లోపు ధరలో అద్భుతమైన ఫీచర్లతో లాంచ్ కానుంది. పూర్తి వివరాల కోసం ఓసారి లుక్కేయండి.

Realme Narzo 80 Pro

Realme Narzo 80 Pro Launch : రియల్‌మి అభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి త్వరలో రియల్‌‌మి నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. రియల్‌మి నార్జో సిరీస్‌లో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది.

Read Also : Upcoming Phones : ఖతర్నాక్ ఫీచర్లతో వివో T4, ఐక్యూ Z10 వచ్చేస్తున్నాయి.. ఏప్రిల్‌లోనే లాంచ్.. డేట్ సేవ్ చేసి పెట్టకోండి..!

ఇటీవలే రియల్‌మి నార్జో 80 అల్ట్రా ఫోన్ గురించి అనేక పుకార్లు, లీక్‌లు వచ్చాయి. లీకుల ప్రకారం.. రాబోయే స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, లాంచ్ తేదీ అనేక అంచనాలు నెలకొన్నాయి. రూ. 20వేల లోపు ధరలో రియల్‌మి నార్జో 80 ప్రో ధర, ఫీచర్ల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రియల్‌మి నార్జో 80 అల్ట్రా ఫీచర్లు, స్పెషిఫికేషన్లు (అంచనా) :

ప్రాసెసర్ : కచ్చితమైన సమాచారం ఇంకా అందుబాటులో లేదు. ఈ ఫోన్ మిడ్-రేంజ్‌లో హై పర్ఫార్మెన్స్, పవర్‌ఫుల్ చిప్‌సెట్‌ను కలిగి ఉండొచ్చు.

డిస్‌ప్లే : 6.5-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.

కెమెరా : బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, 64MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2MP మాక్రో లెన్స్ ఉండవచ్చు. ఫ్రంట్ సైడ్ 16MP సెల్ఫీ కెమెరా ఉండొచ్చు.

బ్యాటరీ : 5000mAh బ్యాటరీ, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రావచ్చు. ఈ ఫోన్‌ను త్వరగా ఛార్జ్ చేయొచ్చు.

ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మి UI 3.0

ర్యామ్, స్టోరేజీ : 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో ఇతర వేరియంట్లు ఉండొచ్చు.

కలర్ ఆప్షన్లు : కనీసం ఒక “వైట్ గోల్డ్” కలర్ వేరియంట్‌లో ఉండొచ్చు.

Read Also : OnePlus 13T Launch : వారెవ్వా.. తగ్గేదేలే.. ఐఫోన్ 16 రేంజ్ ఫీచర్లతో వన్‌ప్లస్ 13T వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడో తెలుసా?

లాంచ్ డేట్, లభ్యత :
నివేదికల ప్రకారం.. రియల్‌మి నార్జో 80 అల్ట్రా ఫోన్ భారత మార్కెట్లో జనవరి 2025 చివరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, రియల్‌మి ఇంకా దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు.

ధర (అంచనా) :
రియల్‌మి నార్జో సిరీస్ బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. రియల్‌మి నార్జో 80 అల్ట్రా ధర భారత మార్కెట్లో దాదాపు రూ. 18వేల నుంచి రూ. 20వేల వరకు ఉంటుంది. అయితే, కచ్చితమైన ధర తెలియాలంటే లాంచ్ అయ్యే వరకు ఆగాల్సిందే.