Realme P4 Lite 5G : 7000mAh బ్యాటరీ, VC కూలింగ్‌తో కొత్త రియల్‌మి 5G ఫోన్.. ధర జస్ట్ రూ. 12,999కే
Realme P4 Lite 5G : రియల్‌మి P4 లైట్ 5G అనే కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది. రూ. 15,000 లోపు ధరలో ఈ ఫోన్, హై రిఫ్రెష్ రేట్, పవర్ ఫుల్ బ్యాటరీ ఫీచర్లతో అందుబాటులో ఉంది. వీసీ కూలింగ్ సిస్టమ్ స్పెషల్ అట్రాక్షన్.. పూర్తి వివరాలివే..
Realme P4 Lite 5G
- రూ. 15వేల బడ్జెట్ ధరలో రియల్‌మి P4 లైట్ ఫోన్
- VC కూలింగ్ సిస్టమ్‌తో మీ ఫోన్ ఎంత వాడినా హీటెక్కదు
- మార్చి 25 నుంచి ఫస్ట్ సేల్ ప్రారంభం, ధర ఎంతంటే?
Realme P4 Lite 5G : మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీరు రియల్‌మి లవర్స్ అయితే ఇది మీకోసమే. రియల్‌మి కంపెనీ రియల్‌మి P4 లైట్ 5G కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసింది.
రూ.15,000 లోపు ధరలో ఈ ఫోన్, హై రిఫ్రెష్ రేట్, పవర్ ఫుల్ బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుంది. VC కూలింగ్ సిస్టమ్, పవర్ ఫుల్ డైమెన్సిటీ ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్ ధర, లభ్యతతో పాటు స్పెసిఫికేషన్లు, ఫీచర్లను ఓసారి పరిశీలిద్దాం.
రియల్‌మి P4 లైట్ ధర ఎంతంటే? :
రియల్‌మి P4 లైట్ 5G ఫోన్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో 4GB ర్యామ్ వేరియంట్ ధర రూ. 12,999కు లభిస్తుంది. అదే ర్యామ్‌తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,999కు లభిస్తుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో 6GB ర్యామ్ వేరియంట్ ధర రూ. 15,999కు లభిస్తుంది.
Read Also : Samsung Galaxy A35 : బిగ్ డిస్కౌంట్ బ్రో.. రూ. 33వేల ఈ శాంసంగ్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ రూ. 19వేల లోపే..!
ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద రూ. 1,000 తగ్గింపు, అన్ని వేరియంట్లపై రూ. 5,000 బ్యాంక్ ఆఫర్ పొందవచ్చు. ఈ రియల్‌మి ఫోన్ మార్చి 25, 2025న మధ్యాహ్నం 12:00 గంటలకు సేల్ ప్రారంభం కానుంది.
రియల్‌మి P4 లైట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
144Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో 6.8-అంగుళాల HD+ IPS LCD డిస్ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 6nm ప్రాసెసర్, ARM మాలి-G57 MC2 జీపీయూతో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్, రియల్‌మి UI 7.0 స్కిన్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ స్టోరేజ్‌ను మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు పెంచుకోవచ్చు.
రియల్‌మి P4 లైట్లో 30fps వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో 13MP సింగిల్ రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ సెన్సార్ ఉంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7000mAh బ్యాటరీ ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది.
