Redmi 12 With MediaTek Helio G88 SoC, Triple Rear Cameras Launched_ Price, Specifications
Redmi 12 Launch in India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రెడ్‌మి (Redmi) నుంచి కొత్త రెడ్‌మి (Redmi 12) సిరీస్ వచ్చేస్తోంది. ఇప్పటికే Redmi 12 ఫోన్ ఎంపిక చేసిన దేశాలలో లాంచ్ అయింది. చైనా (Xiaomi) యాజమాన్యంలోని బ్రాండ్ ద్వారా లేటెస్ట్ హ్యాండ్‌సెట్‌గా గ్లోబల్ మార్కెట్లోకి వచ్చింది. కొత్త ఆఫర్ 3 ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లతో పాటు 3 కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. రెడ్‌మి 12 ఫోన్ MediaTek G88 SoC ద్వారా ఆధారితమైనది. 50MP ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. 90Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో హోల్-పంచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. కొత్త 4G స్మార్ట్‌ఫోన్‌లో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ కలిగి ఉంది.
రెడ్‌మి 12 సిరీస్ ధర (అంచనా) :
రెడ్‌మి 12 ఫోన్ ధర 4GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ యూరోప్‌లో EUR 199 (దాదాపు రూ. 17వేల) నుంచి ప్రారంభమవుతుంది. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ హ్యాండ్‌సెట్ థాయిలాండ్ (Shopee) వెబ్‌సైట్‌లో THB 5,299 (దాదాపు రూ. 12,500) ధర ట్యాగ్‌తో వచ్చింది. 8GB RAM +256GB స్టోరేజీతో టాప్-ఎండ్ వేరియంట్ ధర ఇంకా వెల్లడి కాలేదు. హ్యాండ్‌సెట్ మిడ్‌నైట్ బ్లాక్, పోలార్ సిల్వర్, స్కై బ్లూ షేడ్స్‌లో అందిస్తుంది. భారత్ సహా ఇతర మార్కెట్‌లలో Redmi 12 ధర గురించి వివరాలు రివీల్ చేయలేదు.
Read Also : AI Risk to Humans : ఏఐతో మానవాళికి ముప్పు.. మరో 10ఏళ్లలో వినాశనం తప్పదు.. టాప్ టెక్ సీఈఓల ఆందోళన..!
రెడ్‌మి 12 స్పెసిఫికేషన్స్ ఇవే :
డ్యూయల్-సిమ్ (నానో+మైక్రో SD స్లాట్) Redmi 12, Android 13 ఆధారిత MIUI 14పై రన్ అవుతుంది. 1500: 1 కాంట్రాస్ట్ రేషియోతో 6.79 ఫుల్-HD+ (1,080X2,460 పిక్సెల్‌లు) డిస్‌ప్లే, వేరియబుల్ రిఫ్రెష్ రేట్ 90Hz వరకు ఉంటుంది. SGS తక్కువ బ్లూ లైట్ సర్టిఫికేట్ కలిగిన ప్యానెల్ NTSC కలర్‌తో 70 శాతం కవరేజీని అందిస్తుంది. గరిష్ట ప్రకాశాన్ని 550 నిట్‌ల వరకు అందించేందుకు రేట్ కలిగి ఉంది. మిడ్-లెవల్ స్మార్ట్‌ఫోన్ MediaTek Helio G88 SoCతో పాటు 8GB వరకు LPDDR4X RAMతో పనిచేస్తుంది. వినియోగదారులు డివైజ్ స్పీడ్ కోసం అదనపు ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ని ఉపయోగించి ఇన్‌బిల్ట్ ర్యామ్‌ను వర్చువల్‌గా 16GB వరకు విస్తరించవచ్చు.
Redmi 12 With MediaTek Helio G88 SoC, Triple Rear Cameras Launched_ Price, Specifications
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. (Redmi 12) AI-సపోర్టెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్ 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో, హ్యాండ్‌సెట్‌లో 8MP సెల్ఫీ సెన్సార్ ఉంది. Redmi 12 సిరీస్ ఫోన్ 256GB వరకు eMMC 5.1 ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. అయితే, స్టోరేజీని మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించుకోవచ్చు. ఈ కొత్త ఫోన్‌లోని కనెక్టివిటీ ఆప్షన్లలో 4G, Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS, గ్లోనాస్, గెలీలియో, బీడౌ, NFC, FM రేడియో, IR బ్లాస్టర్, USB టైప్-C పోర్ట్, GPS, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి.
ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, ఇ-కంపాస్ ఉన్నాయి. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం స్మార్ట్‌ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. AI ఫేస్ అన్‌లాక్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. ఇంకా, రెడ్‌మి 12 ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే బ్యాటరీ గరిష్టంగా 37 గంటల టాక్‌టైమ్‌ను, 23 రోజుల స్టాండ్‌బై టైమ్‌ను, 26 గంటల వరకు రీడింగ్ టైమ్‌ను అందిస్తుంది. డెస్ట్, నీటి నిరోధకతకు IP53 వద్ద రేట్ అయింది. అంతేకాకుండా, 168.60 x 76.28 x 8.17 మిమీ, 198.5 గ్రాముల బరువు కలిగి ఉంటుంది.