AI Risk to Humans : ఏఐతో మానవాళికి ముప్పు.. మరో 10ఏళ్లలో వినాశనం తప్పదు.. టాప్ టెక్ సీఈఓల ఆందోళన..!

AI Risk to Humans : ఏఐ టెక్నాలజీపై ట్విటర్ టెస్లా హెడ్ ఎలన్ మస్క్‌ (Elon Musk) సహా టాప్ టెక్ సీఈఓలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేటెస్ట్ సర్వేలో 42 శాతం మంది సీఈఓలు రాబోయే కొద్ది సంవత్సరాల్లో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మానవజాతిని నాశనం చేయగలదని అభిప్రాయపడ్డారు.

AI Risk to Humans : ఏఐతో మానవాళికి ముప్పు.. మరో 10ఏళ్లలో వినాశనం తప్పదు.. టాప్ టెక్ సీఈఓల ఆందోళన..!

Humans at grave risk, 42 per cent CEOs believe AI can destroy humanity in 5-10 years

AI Risk to Humans : ప్రపంచమంతా ఏఐ టెక్నాలజీ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఏఐ (AI) లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ రోజుల్లో టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది. ఏఐ టెక్నాలజీతో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ అందులో అనేక లోపాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోని టాప్ టెక్ లీడర్లు సైతం ఇదే నమ్ముతున్నారు. ఏఐ అభివృద్ధితో, ట్విటర్ (Twitter), టెస్లా హెడ్ ఎలన్ మస్క్‌ (Elon Musk)తో సహా టాప్ టెక్ సీఈఓలు, కృత్రిమ మేధస్సు మానవాళిని నాశనం చేయగలదని ఆందోళన చెందుతున్నారు. ఈ వారం ప్రారంభంలో యేల్ సీఈఓ సమ్మిట్‌లో లేటెస్ట్ సర్వే ప్రకారం.. 42 శాతం సీఈఓలు ఏఐ రాబోయే కొన్ని ఏళ్లలో మానవాళి మనుగడకు ముప్పు తప్పదని నమ్ముతున్నారు.

దాదాపు 42 శాతం మంది సీఈఓలు, టాప్ బిజినెస్ దిగ్గజాలు ఏఐ విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి నుంచి 5 ఏళ్ల నుంచి 10ఏళ్ల తర్వాత మానవాళిని నాశనం చేసే సామర్థ్యం ఉందని నమ్ముతున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ సర్వేలో వాల్‌మార్ట్, కోకా-కోలా, జిరాక్స్, జూమ్ వంటి మరెన్నో వ్యాపారాల క్రాస్-సెక్షన్ నుంచి 119 మంది సీఈఓలు హాజరయ్యారని నివేదిక తెలిపింది.

Read Also : Samsung Galaxy S23 Ultra : శాంసంగ్ కొత్త బిగ్ టీవీ సేల్.. ఉచితంగా గెలాక్సీ S23 అల్ట్రా ఫోన్, స్మార్ట్‌టీవీలపై రూ. 20వేల వరకు క్యాష్‌బ్యాక్..!

ఏఐ టెక్నాలజీతో మానవాళి మనుగడ చీకటిగా, భయంకరంగా ఉంటుందని యేల్ ప్రొఫెసర్ జెఫ్రీ సోన్నెన్‌ఫెల్డ్ చెప్పారు. నివేదిక ప్రకారం.. దాదాపు 34 శాతం మంది సీఈఓలు ఏఐ పదేళ్లలో మానవాళిని నాశనం చేయగలదని భావిస్తున్నారు. వారిలో 8 శాతం మంది కేవలం ఐదేళ్లలో విధ్వంసం జరగవచ్చని చెప్పారు. దాదాపు 58 శాతం మంది సీఈఓలు ఏఐ టెక్నాలజీతో మానవులకు ఎలాంటి ముప్పు ఉండదని, చింతించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Humans at grave risk, 42 per cent CEOs believe AI can destroy humanity in 5-10 years

Humans at grave risk, 42 per cent CEOs believe AI can destroy humanity in 5-10 years

ఏఐ ముప్పును ముందుగానే హెచ్చరించిన టెక్ దిగ్గజాలు :
ఎలన్ మస్క్ వంటి అగ్రశ్రేణి టెక్ దిగ్గజాల సీఈఓలు (OpenAI) వ్యవస్థాపకుడు కూడా AI ప్రమాదాన్ని ముందుగానే హెచ్చరించారు. కొన్ని వారాల తర్వాత ఇప్పుడు సర్వేలో బయటపడ్డ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని వారాల క్రితమే డజన్ల కొద్దీ ఏఐ ఇండస్ట్రీ, నేతలు, మరికొందరు ఏఐ నుంచి ప్రమాదంపై హెచ్చరించే ప్రకటనపై సంతకం చేశారు. ఈ ప్రకటనపై (ChatGPT) క్రియేటర్ సామ్ ఆల్ట్‌మాన్, ఏఐ గాడ్‌ఫాదర్ అనే జియోఫ్రీ హింటన్, మస్క్, గూగుల్, (Microsoft) నుంచి అనేక ఇతర ఉన్నతాధికారులు సంతకం చేశారు. AI ప్రమాదాల నుంచి మానవాళిని రక్షించడానికి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రపంచం (ChatGPT) వినియోగంతో త్వరలో అంతమయ్యే అవకాశం ఉందని మస్క్ సూచించాడు. ఈ విషయంలో మస్క్ తమాషా చేయలేదని తెలుస్తోంది. కనీసం 6 నెలల పాటు ఏఐ సిస్టమ్‌ల అభివృద్ధిని నిలిపివేయాలంటూ బహిరంగ లేఖపై కూడా సంతకం చేసింది.

భారత పర్యటన సందర్భంగా (OpenAI CEO) సీఈఓ ఆల్ట్‌మాన్ మాట్లాడుతూ.. ఏఐ టెక్నాలజీతో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయగలదని చెప్పారు. ఏఐ టెక్నాలజీతో కొత్త ఉద్యోగాలు కూడా క్రియేట్ చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఏఐ వల్ల ఉద్యోగ నష్టం జరుగుతుందా అంటే.. ప్రతి సాంకేతిక విప్లవం ఉద్యోగ మార్పుకు దారి తీస్తుందని ఆల్ట్‌మాన్ అభిప్రాయపడ్డారు. చాలా మంది వ్యాపారవేత్తలు ఏఐ ప్రమాదాలపై ముందుగానే చర్చిస్తున్నప్పటికీ.. కొంతమంది ఏకీభవించలేదు. కృత్రిమ మేధస్సు ఆఫీసులో పనితీరు సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని నమ్ముతున్నారు. హెల్త్‌కేర్, ప్రొఫెషనల్ సర్వీసెస్/ఐటీ, మీడియా/డిజిటల్ అనే 3 కీలక పరిశ్రమలపై AI అత్యంత ప్రభావాన్ని చూపుతుందని సర్వే సందర్భంగా సీఈఓలు సూచించారు.

Read Also : Apple iPhone 14 Price : అమెజాన్‌లో తక్కువ ధరకే ఐఫోన్ 14 సిరీస్.. ఇదే సరైన సమయం.. వెంటనే కొనేసుకోండి..!