Redmi 13 5G Launch : భారత్‌కు కొత్త రెడ్‌మి 13 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. పోకో M7 ప్రో 5జీ పేరుతో రీబ్రాండ్ వెర్షన్..!

Redmi 13 5G Launch : కొత్త రెడ్‌మి 5జీ ఫోన్ వచ్చేస్తోంది. పోకో M7ప్రో 5జీ రీబ్రాండ్ వెర్షన్‌గా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Redmi 13 5G Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌‌మి నుంచి సరికొత్త రెడ్‌మి 13 5జీ ఫోన్ వచ్చేస్తోంది. నివేదిక ప్రకారం.. ప్రస్తుతానికి షావోమీ రెడ్‌‌మి 13 5జీ స్మార్ట్‌ఫోన్‌పై పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో వచ్చే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ నివేదిక ప్రకారం.. రెడ్‌మి 13 5జీ ఫోన్.. పోకో ఎమ్7ప్రో 5జీగా రీబ్రాండ్ అయి భారత్‌కు రానుంది.

ఈ జాబితా ప్రకారం.. రెడ్‌మి 13 5జీ మాదిరి పోకో ఎమ్7ప్రో 5జీ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. గత ఏడాదిలో రెడ్‌మి 12 5జీ ఫోన్ అదే చిప్‌సెట్ కలిగి ఉంది. వాస్తవానికి.. రెడ్‌మి 12 5జీ కన్నా రెడ్‌మి 13 5జీ అప్‌గ్రేడ్ వెర్షన్లతో రానుందని నివేదికలు సూచిస్తున్నాయి.

Read Also : Netflix Subscribers : నెట్‌ఫ్లిక్స్‌లో పాస్‌వర్డ్ షేరింగ్‌ బ్యాన్ వర్కౌట్ అయింది.. కొత్తగా చేరిన 9.33 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు..!

భారత్‌లో పోకో బ్రాండ్‌గా రీఎంట్రీ :
నివేదిక ప్రకారం.. రెడ్‌మి 13 5జీ ఫోన్ 2406ఈఆర్ఎన్9సిఐ, 2406ఈఆర్ఎన్9సీసీ, 24066పీసీ95ఐ వంటి విభిన్న మోడల్ నంబర్‌లతో వస్తుంది. ఈ ఫోన్ ఎక్కడ విక్రయించనుందో ఈ నంబర్లు తెలియజేస్తాయి. ‘RN’ అంటే.. రెడ్‌మి బ్రాండ్ కింద ‘PC’ అంటే.. POCO బ్రాండ్. ఉదాహరణకు, భారత్ మార్కెట్లో ‘2406ERN9CI’, చైనా ‘2406ERN9CC’ మోడల్ కాగా.. ‘24066PC95I’ అనే మోడల్ నంబర్ రెడ్‌మి 13 5జీ ఫోన్ అని సూచిస్తుంది.

భారత్‌లో పోకో బ్రాండ్‌లో భాగంగా విక్రయానికి రానుంది. గత మోడల్‌ విధానాన్ని అనుసరించి పోకో ఎమ్7ప్రో 5జీ అని సూచిస్తుంది. అయితే, ఈ పేరు ఇంకా అధికారికం కాదని గమనించాలి. రెడ్‌మి 13 5జీ ఫోన్ కొన్ని చిన్నమార్పులతో రెడ్‌మి 12 5జీ పోలి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్‌ఓఎస్‌తో రన్ అవుతుందని భావిస్తున్నారు.

మరిన్ని అప్‌గ్రేడ్ ఫీచర్లతో :
రెడ్‌మి 12 5జీ కన్నా రెడ్‌మి 13 5జీ అప్‌గ్రేడ్ ఫీచర్లను కలిగి ఉండనుందని నివేదిక సూచిస్తోంది. రాబోయే రెడ్‌మి 13 5జీ ఫోన్ రెడ్‌మి 12 5జీ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 5జీ కనెక్టివిటీని అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దాంతో పాటు 2ఎంపీ డెప్త్ సెన్సార్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీల విషయానికి వస్తే.. 8ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. రెడ్‌మి 12 5జీ ఫోన్ 5,000ఎంఎహెచ్ బ్యాటరీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ద్వారా 18డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

ఈ స్పెషిఫికేషన్లతో రెడ్‌మి 12 5జీ అద్భుతమైన పర్ఫార్మెన్స్, మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. బడ్జెట్ విభాగంలో ఇదో బెస్ట్ ఆప్షన్. రెడ్‌మి 13 5జీ ఎంట్రీ-లెవల్ మార్కెట్‌లో ఆ స్థానాన్ని నిలబెట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ధర విషయానికొస్తే.. రెడ్‌‌‌‌మి 12 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 10,999, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్‌కు రూ. 12,499కి లాంచ్ చేసింది.

Read Also : OnePlus 11R 5G Launch : సోలార్ రెడ్ వేరియంట్‌తో వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు