Redmi 13R 5G With MediaTek Dimensity 6100 Plus SoC, 50-Megapixel Dual Cameras Launched
Redmi 13R 5G Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి నుంచి సరికొత్త రెడ్‌మి 13ఆర్ 5జీ ఫోన్ వచ్చేసింది. ఈ 5జీ ఫోన్ చైనాలో నిశ్శబ్దంగా లాంచ్ అయింది. ఇటీవల భారత మార్కెట్లో ఆవిష్కరించిన రెడ్‌మి 13సీ 5జీతో ఫోన్ స్పెసిఫికేషన్‌లను షేర్ చేసింది.
Read Also : WhatsApp Voice Notes Feature : వాట్సాప్‌లో సరికొత్త ప్రైవసీ ఫీచర్.. మీ వాయిస్ నోట్స్ వినగానే మాయమైపోతాయి..!
5జీ కనెక్టివిటీతో కూడిన బడ్జెట్ ఆఫర్, మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఎస్ఓసీతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 5,000ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది. రెడ్‌మి 13సీ 5జీ మోడల్ మాదిరిగానే కొత్త ఫోన్ కూడా 6.74-అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ ప్యానెల్, 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. రెండు మోడళ్ల మధ్య ఉన్న సింగిల్ ఫీచర్ బ్యాక్ ప్యానెల్ కలిగి ఉంది.
రెడ్‌మి 13ఆర్ 5జీ ధర, లభ్యత :
రెడ్‌మి 13ఆర్ 5జీ సింగిల్ 4జీబీ + 128జీబీ వేరియంట్ స్టార్ రాక్ బ్లాక్, ఫాంటసీ పర్పుల్, వేవ్ వాటర్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. చైనాలో సీఎన్‌వై 999 (దాదాపు రూ. 11,700) వద్ద జాబితా చేసింది.
రెడ్‌మి 13ఆర్ 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
రెడ్‌మి 13ఆర్ 5జీ ఫోన్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల హెచ్‌డీప్లస్ (1,600 x 720 పిక్సెల్‌లు) ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ, 4జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జీబీ యూఎఫ్ఎస్ 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఎస్ఓసీ ద్వారా ఫోన్ పవర్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 13-ఆధారిత ఎంఐయూఐ 14తో వస్తుంది.
Redmi 13R 5G Dual Cameras Launch
కెమెరా విభాగంలో రెడ్‌మి 13ఆర్ 5జీలో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, బ్యాక్ సైడ్ సెకండరీ కెమెరా ఉన్నాయి. డిస్‌ప్లే ఎగువన కేంద్రీకృత వాటర్‌డ్రాప్ నాచ్‌లో 5ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను అందిస్తుంది. షావోమీ రెడ్‌మి 13ఆర్ 5జీలో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ద్వారా 18డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
భద్రత విషయానికి వస్తే.. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ మైక్రో-ఎస్‌డీ కార్డ్ స్లాట్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్‌తో వస్తుంది. ఈ ఫోన్ బరువు 192 గ్రాములు, 168ఎమ్ఎమ్x78ఎమ్ఎమ్ x 8.09ఎమ్ఎమ్ పరిమాణం ఉంటుంది.