Redmi 15C 5G : కొత్త రెడ్‌మి 15C 5G వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. జస్ట్ రూ.12,499కే.. ఫస్ట్ సేల్ ఎప్పుడంటే?
Redmi 15C 5G : రెడ్‌మి 15C 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. డిసెంబర్ 11 నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఈ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ అనేక ముఖ్యమైన ఫీచర్లతో ఆకర్షణీయంగా ఉంది.
Redmi 15C 5G
Redmi 15C 5G : రెడ్‌మి లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి రెడ్‌మి నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. సరసమైన ధరలో ఈ 5G ఫోన్ భారీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 6,000mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ 50MP ప్రైమరీ రియర్ కెమెరా కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ (Redmi 15C 5G) సిస్టమ్‌తో HyperOS2పై రన్ అవుతుంది. రెడ్‌మి ఫోన్ ప్రారంభ ధర రూ. 12,499 ఉండవచ్చు. డిసెంబర్ 11 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ధర ఎంతంటే? :
రెడ్‌మి 15C 5G ఫోన్ డస్క్ పర్పుల్, మూన్‌లైట్ బ్లూ మిడ్‌నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. 4GB + 128GB మోడల్ ధర రూ.12,499, 6GB + 128GB మోడల్ ధర రూ. 13,999, 8GB + 128GB స్టోరేజ్‌తో కూడిన టాప్-ఆఫ్-ది-లైన్ వేరియంట్ ధర రూ. 15,499కు పొందవచ్చు. డిసెంబర్ 11 నుంచి అమెజాన్, కంపెనీ వెబ్‌సైట్ ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది.
రెడ్‌మి 15C 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
రెడ్‌మి 15C 5G ఫోన్ 1600 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.9-అంగుళాల HD+ డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 810 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ డిస్‌ప్లే TÜV రీన్‌ల్యాండ్ సర్టిఫైడ్ కలిగి ఉంది. అలాగే, ఈ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. 6nm ప్రాసెస్ కలిగి ఉంది. ఈ రెడ్‌మి ఫోన్ LPDDR4X ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2తో సహా 4GB నుంచి 8GB ర్యామ్ కలిగి ఉంది. SD కార్డ్ ద్వారా ఫోన్ స్టోరేజీని 1TB వరకు విస్తరించవచ్చు.
రెడ్‌మి 15C 5G బ్యాటరీ, కెమెరా ఫీచర్లు :
రెడ్‌మి 15C 5G ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా HyperOS2తో రన్ అవుతుంది. డ్యూయల్ సిమ్‌లకు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా ఉంది. సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీ కెమెరా 8MP సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. 3.5mm ఆడియో జాక్ ఎఫ్ఎం రేడియో కలిగి ఉంది. ఈ రెడ్‌మి ఫోన్‌లో 6,000 mAhబ్యాటరీ కలిగి ఉంది. 33-వాట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. రెడ్‌మి ఫోన్ బరువు 211 గ్రాములు ఉంటుంది. IP64-రేటెడ్ కలిగి ఉంది.
