Redmi 9A Sport price drops with a 11 percent discount
Redmi 9A Sport Price : కొత్త ఫోన్ కొంటున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి (Redmi) కొత్త మోడల్ Redmi 9A Sport ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో Redmi 9A స్పోర్ట్ ఫోన్ ప్రస్తుతం రూ.8,499కి బదులుగా రూ.7,488గా అందుబాటులో ఉంది. ఈ అద్భుతమైన ఆఫర్ పొందడానికి ఇదే సరైన సమయం. Redmi 9A స్పోర్ట్ ఫోన్ 11శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఈ Redmi ఫోన్‌పై మీరు బ్యాంక్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు.
రెడ్‌మి 9A స్పోర్ట్ స్పెసిఫికేషన్స్ :
షావోమీ Redmi 9A స్పోర్ట్ ఫోన్ 6.53-అంగుళాల IPS LCD డిస్ప్లే 20:9 యాస్పెక్ట్ రేషియోతో పాటు 720 x 1600 పిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్-టు-బాడీ రేషియో దాదాపు 81.08శాతం కలిగి ఉంటుంది. షావోమీ రెడ్‌మి 9A స్పోర్ట్ ప్రధాన కెమెరా సింగిల్ 13MP f/2.2 వైడ్ యాంగిల్ కెమెరా, కెమెరా AI సీన్ డిటెక్షన్ ఫీచర్ పోర్ట్రెయిట్‌లు, అద్భుతమైన దృశ్యాలను క్యాప్చర్ చేయొచ్చు. ఈ ఫోన్ ప్రధాన కెమెరా ఫీచర్లలో LED ఫ్లాష్, డిజిటల్ జూమ్, టచ్-టు-ఫోకస్ ఫేషియల్ రికగ్నిషన్ ఉన్నాయి. ఫ్రంట్ ఫేసింగ్ 5MP కెమెరా f/2.2 ఎపర్చరుతో మంచి సెల్ఫీలు తీసుకోవచ్చు.
Redmi 9A Sport Price drops with a 11 percent discount
షావోమీ రెడ్‌మి 9A స్పోర్ట్‌లో MediaTek Helio G25 CPU, 2GB LPDDR4X RAM ఉన్నాయి. 2GHz (మాక్స్) వద్ద పనిచేసే ఆక్టా-కోర్ డ్యూయల్ కార్టెక్స్ A53 లేఅవుట్‌తో ఆక్టా-కోర్ CPUని కలిగి ఉంది. పవర్VR GE8320 GPU ద్వారా అద్భుతమైన విజువల్స్ కూడా పొందవచ్చు. షావోమీ Redmi 9A స్పోర్ట్ 5000mAh, Li-Polymer నాన్-రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే ఈ రెడ్‌మి ఫోన్ ఆర్డర్ పెట్టుకోండి.