Redmi K70 Series Launch : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, 50ఎంపీ కెమెరాతో రెడ్‌మి కె70 సిరీస్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

Redmi K70 Series Launch : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అద్భుతమైన కెమెరాలతో రెడ్‌మి కె70 సిరీస్ లాంచ్ అయింది. రెడ్‌మి కె70, రెడ్‌మి కె70 ప్రో సిరీస్ ధర, ఫీచర్ల వివరాలను ఓసారి లుక్కేయండి.

Redmi K70 Series Launch : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, 50ఎంపీ కెమెరాతో రెడ్‌మి కె70 సిరీస్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

Redmi K70, Redmi K70 Pro with 120W fast charging support and 50MP main camera launched

Updated On : December 2, 2023 / 7:22 PM IST

Redmi K70 Series Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమీ (Xiaomi) తన కె-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విస్తరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ తయారీదారు చైనాలో జరిగిన ఈవెంట్‌లో రెడ్‌మి కె70 సిరీస్ రెడ్‌మి కె70, రెడ్‌మి 70 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తాయి. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తాయి.

Read Also : Mobile Bonanza Sale : ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్.. ఆపిల్ ఐఫోన్ 12, ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు.. ఈ డీల్ మిస్ చేసుకోవద్దు!

రెడ్‌మి కె70 ప్రో ప్రారంభ ధర 3299 యువాన్ (రూ. 39,435)తో వస్తుంది. మరోవైపు, రెడ్‌మి కె70 ధర 2,499 యువాన్ (రూ. 29,865) వద్ద ప్రారంభమవుతుంది. డిసెంబర్ 1 నుంచి చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు ప్రారంభం కానున్నాయి. అయితే, భారత మార్కెట్లో రెడ్‌మి కె సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

Redmi K70, Redmi K70 Pro with 120W fast charging support and 50MP main camera launched

Redmi K70, Redmi K70 Pro launched

రెడ్‌మి కె70, కె70 ప్రో స్పెసిఫికేషన్‌లు :
రెడ్‌మి కె70, కె70 ప్రో మోడల్ 1440×3200 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తాయి. రెడ్‌మి కె70 ప్రో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. అయితే, రెడ్‌మి కె70 స్పాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీని కలిగి ఉంది. ఈ కె-సిరీస్ ఫోన్లలో షావోమీ కొత్త హైపర్ఓఎస్ రన్ అవుతుంది. 16ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. అంతేకాదు.. స్మార్ట్‌ఫోన్‌లు ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌తో వస్తాయి.

రెడ్‌మి కె70 ప్రో 24జీబీ వరకు ర్యామ్ 1టీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. రెడ్‌మి కె70 16జీబీ వరకు ర్యామ్ 1టీబీ ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. రెడ్‌మి కె70 ప్రో మోడల్ 50ఎంపీ ప్రధాన కెమెరా, 12ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 50ఎంపీ టెలిఫోటో లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. మరోవైపు, రెడ్‌‌మి కె70లో 50ఎంపీ ప్రధాన సెన్సార్, 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 2ఎంపీ మాక్రో షూటర్ ఉన్నాయి. రెండు స్మార్ట్‌ఫోన్‌లు 120డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉన్నాయి.

రెడ్‌మి కె70 ధర 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర సీఎన్ఐ 2,499 (దాదాపు రూ. 29వేలు) నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ ధర 16జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వెర్షన్ సీఎన్‌వై 2,699 (దాదాపు రూ. 31వేలు), 16జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర సీఎన్‌వై 2,999 (దాదాపు రూ. 35వేలు), 16జీబీ ర్యామ్ + 1టీబీ స్టోరేజ్ కలిగిన టాప్-ఎండ్ వేరియంట్ ధర సీఎన్‌వై 3,399 (దాదాపు రూ. 40వేలు) ఉంటుంది.

రెడ్‌మి కె70 ప్రో స్పెసిఫికేషన్స్ : 

రెడ్‌మి కె70 ప్రో మోడల్ ధరలు వరుసగా 12జీబీ ర్యామ్ + 256జీబీ మోడల్‌కి సీఎన్‌వై 3,299 (దాదాపు రూ. 38,600), 16జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు సీఎన్‌వై 3,599 (సుమారు రూ. 42వేలు), సీఎన్‌వై 3,819 రూ. 512జీబీ ఆప్షన్, టాప్-ఎండ్ 24జీబీ ర్యామ్ + 1టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సీఎన్‌వై 4,399 (దాదాపు రూ. 51వేలు) ఉంటుంది.

మరోవైపు, రెడ్‌మి కె70ఈ 12జీబీ ర్యామ్ + 256జీబీ మోడల్‌కు సీఎన్‌వై 1,999 (దాదాపు రూ. 23వేలు), 12జీబీ ర్యామ్ + 512జీబీ మోడల్ ధర సీఎన్‌వై 2,199 (సుమారు రూ. 25వేలు)గా ఉంది. 16జీబీ ర్యామ్ + 1టీబీ స్టోరేజ్ ఉన్న టాప్-ఎండ్ మోడల్ ధర సీఎన్‌వై 2,599 (దాదాపు రూ. 30వేలు) ఉంటుంది. రెడ్‌మి కె70 ప్రో ఇంక్ బ్లాక్, స్నో వైట్, బ్యాంబో మూన్ బ్లూ షేడ్స్‌లో వస్తుంది. అయితే, రెడ్‌మి కె70 ఇంక్ బ్లాక్, స్నో వైట్, బాంబూ మూన్ బ్లూ, ఎగ్‌ప్లాంట్ పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. చివరగా, రెడ్‌మి కె70ఈ ఇంక్ బ్లాక్, స్నో వైట్, బ్యాంబూ మూన్ బ్లూ ఫినిషింగ్‌లలో వస్తుంది.

డ్యూయల్ సిమ్ (నానో) రెడ్‌మి కె70 ప్రో కంపెనీ కొత్త హైపర్‌ఓఎస్ ఇంటర్‌ఫేస్‌పై రన్ అవుతుంది. 6.67-అంగుళాల హుక్సాంగ్ సీ8 ఓఎల్ఈడీ 2కె రిజల్యూషన్ (1,440×3,200 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను గరిష్టంగా 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో, 3840హెచ్‌జెడ్ వరకు, పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ వరకు కలిగి ఉంటుంది. సరికొత్త 4ఎన్ఎమ్ ​​స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో నడుస్తుంది. గరిష్టంగా 24జీబీ వరకు ఎల్ పీడీడీఆర్‌5ఎక్స్ ర్యామ్ యూఎఫ్ఎస్ 4.0 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ 1టీబీ వరకు వస్తుంది. గత రెడ్‌మి కె60 ప్రో స్పాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీని కలిగి ఉంది.

Read Also : Credit Card Payments : పేటీఎంలో యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు పేమెంట్లు చేయొచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!