Credit Card Payments : పేటీఎంలో యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు పేమెంట్లు చేయొచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

Credit Card Payments : పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు పేమెంట్లు ఈజీగాచేసుకోవచ్చు. మీ క్రెడిట్ కార్డును పేటీఎంలో ఎలా లింక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Credit Card Payments : పేటీఎంలో యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు పేమెంట్లు చేయొచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

How to make Credit Card payments through UPI on Paytm

Paytm Credit Card Payments : మీరు పేటీఎం వాడుతున్నారా? అయితే, పేటీఎంలో మీ క్రెడిట్ కార్డును యూపీఐతో లింక్ చేసుకున్నారా? లేదంటే, ఇప్పుడే చేసుకోండి.. ఎందుకంటే.. పేటీఎంలో యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు పేమెంట్లు చేసుకోవచ్చు. ఇప్పటికే రోజువారీ లావాదేవీల కోసం క్యూఆర్ స్కానర్‌లను విస్తృతంగా వినియోగిస్తున్నారు.

దేశవ్యాప్తంగా క్యూఆర్ కోడ్‌లను స్థానిక పండ్ల విక్రయదారుల నుంచి దుకాణదారుల వరకు, మారుమూల గ్రామాల నుంచి మెట్రోపాలిటన్ నగరాల్లో మొబైల్ పేమెంట్ల విధానం గణనీయంగా పెరిగింది. దేశీయ ఫిన్‌టెక్ స్టార్టప్ పేటీఎం కూడా తమ వ్యాపారుల కోసం క్యూఆర్ కోడ్‌లు, సౌండ్‌బాక్స్‌లను కూడా అందిస్తుంది. చిన్న వ్యాపారులకు వారి కస్టమర్‌లకు డిజిటల్ పేమెంట్లను చేసుకునేందుకు వీలు కల్పిస్తోంది.

Read Also : Paytm Booking Trains : ట్రైన్ టిక్కెట్ బుకింగ్‌కు పేటీఎంలో కొత్త ఫీచర్.. ఎలా సీటు బుక్ చేసుకోవాలంటే? ఇదిగో సింపుల్ ప్రాసెస్!

క్యూఆర్ కోడ్ స్కానింగ్‌తో పేమెంట్లు ఈజీ :
ఇటీవల, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తమ కస్టమర్‌లకు పేమెంట్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి భారత్‌లో క్రెడిట్ కార్డ్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు యూపీఐ సిస్టమ్‌లో క్రెడిట్ కార్డ్‌ను ప్రవేశపెట్టింది. యూపీఐతో క్రెడిట్ కార్డ్‌ల అనుసంధానం కార్డ్ హోల్డర్‌లకు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుంది.

కార్డుదారులు కేవలం క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా సులభంగా పేమెంట్లను చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి పేమెంట్ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. ఈ ప్రక్రియ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. యూపీఐ లావాదేవీలతో క్రెడిట్ వినియోగాన్ని మరింత సౌకర్యవంతంగా అందిస్తుంది. యూపీఐతో క్రెడిట్ పేమెంట్లు చేసే ముందు, మీ క్రెడిట్ కార్డ్‌ని పేటీఎంతో లింక్ చేయడం చాలా అవసరం. పేటీఎంలో మీ క్రెడిట్ కార్డ్‌ని ఎలా లింక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పేటీఎం యాప్ ఓపెన్ చేసి.. హోమ్‌పేజీ నుంచి ‘రూపే కార్డ్‌ యూపీఐ లింక్‘పై క్లిక్ చేయండి
2. మీ కార్డ్‌ని లింక్ చేసే ఎంపికల జాబితా నుంచి మీ క్రెడిట్ కార్డ్ బ్యాంక్‌ని ఎంచుకోండి
3. మీ కార్డ్ కోసం యూపీఐ పిన్‌ని సెట్ చేసి, పేమెంట్లు చేసుకోవచ్చు.

How to make Credit Card payments through UPI on Paytm

Credit Card payments UPI on Paytm

పేటీఎం యూపీఐ ద్వారా మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి పేమెంట్లు చేయండిలా :
1. మర్చంట్ స్టోర్ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి, పేమెంట్ మొత్తాన్ని ఎంటర్ చేయండి.
2. పేమెంట్ పేజీలో మీ లింక్ చేసిన క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోండి.
3. మీ యూపీఐ పిన్‌ని ఎంటర్ చేసి, లావాదేవీని సురక్షితంగా పూర్తి చేయండి.

మీ క్రెడిట్ కార్డ్ ద్వారా ఎవరైనా సురక్షితమైన యూపీఐ పేమెంట్లను ఇలా చేయవచ్చు :
పేటీఎంలో క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్ పేమెంట్లను వేగంగా పూర్తి చేయొచ్చు.
1. చెక్అవుట్ పేజీలో మీ యూపీఐ ఐడీని ఎంటర్ చేయండి లేదా పేమెంట్ మెథడ్‌గా పేటీఎం యూపీఐని ఎంచుకోండి.
2. పేటీఎం యాప్‌ని ఓపెన్ చేసి.. పేమెంట్ పేజీలో మీ లింక్ చేసిన క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోండి.
3. మీ యూపీఐ పిన్‌ని ఎంటర్ చేయడం ద్వారా లావాదేవీని పూర్తి చేయండి.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) జూన్ 2022లో యూపీఐ ప్లాట్‌ఫారమ్‌కు రూపే క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేసేందుకు అనుమతించింది. అలాంటి చెల్లింపులు చేసే ముందు వినియోగదారులు తమ (RuPay) క్రెడిట్ కార్డ్‌ని యూపీఐకి లింక్ చేయాలి. ఇప్పటివరకు ఎస్‌బీఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యెస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, సీఎస్‌ ‌బ్యాంక్ వంటివి రూపే లింక్‌ చేసిన బ్యాంకుల జాబితాలో ఉన్నాయి.

Read Also : Mobile Bonanza Sale : ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్.. ఆపిల్ ఐఫోన్ 12, ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు.. ఈ డీల్ మిస్ చేసుకోవద్దు!