Paytm Booking Trains : ట్రైన్ టిక్కెట్ బుకింగ్‌కు పేటీఎంలో కొత్త ఫీచర్.. ఎలా సీటు బుక్ చేసుకోవాలంటే? ఇదిగో సింపుల్ ప్రాసెస్!
Paytm Booking Trains : పేటీఎం రైలు టిక్కెట్ బుకింగ్‌ల కోసం ‘గ్యారంటీడ్ సీట్ అసిస్టెన్స్’ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ యూజర్లు ధృవీకరించిన సీటును పొందే అవకాశాలను పెంచుకోవడానికి మల్టీ రైలు ఆప్షన్లను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది.

New Paytm feature will ensure confirmed seat bookings on trains
Paytm Booking Trains : పేటీఎంలో ట్రైన్ బుక్ చేస్తున్నారా? పండుగ సీజన్‌లో టూర్ ప్లాన్ చేసుకునే లేదా ఇళ్లకు వెళ్లే వినియోగదారుల కోసం పేటీఎం సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. సాధారణంగా పండుగ సీజన్‌లో రైలు ప్రయాణాలకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. రైలు టిక్కెట్లను పొందేందుకు ఆరాటపడుతుంటారు. గరిష్ట ప్రయాణ తేదీల కోసం ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్‌లు ఉన్నాయి. దాంతో వినియోగదారులకు సాయం చేసేందుకు పేటీఎం (Paytm) రైలు టిక్కెట్ బుకింగ్‌ల కోసం ‘గ్యారంటీడ్ సీట్ అసిస్టెన్స్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకునేటప్పుడు ధృవీకరించిన సీటును పొందవచ్చు. వినియోగదారులు వారి ప్రాధాన్య రైళ్లలో ధృవీకరించిన బుకింగ్‌ను నిర్ధారించడానికి మల్టీ రైలు ఆప్షన్లను అందిస్తుంది. అదనంగా, ఈ ఫీచర్ ప్రయాణికులకు, ముఖ్యంగా పండుగ సమయాల్లో, టిక్కెట్ లభ్యత, లాంగ్ వెయిట్‌లిస్ట్‌లకు సంబంధించిన ఆందోళనలను కూడా తగ్గిస్తుంది. పేటీఎం ప్రకారం.. ఈ ఫీచర్ సమీపంలోని వివిధ బోర్డింగ్ స్టేషన్‌ల నుంచి ప్రత్యామ్నాయ రైలు బుకింగ్ ఆప్షన్లను సిఫార్సు చేస్తోంది. తద్వారా ధృవీకరించిన టిక్కెట్‌ను పొందే అవకాశాలను పెంచుతుంది.
పేటీఎంలో కన్ఫర్మడ్ టిక్కెట్‌ను ఎలా ఉపయోగించాలంటే? :
ధృవీకరించిన రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకోవడానికి పేటీఎం ‘గ్యారంటీడ్ సీట్ అసిస్టెన్స్’ ఎలా ఉపయోగించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.
* పేటీఎం యాప్‌ని ఓపెన్ చేయండి.
* మీ ప్రయాణ గమ్యస్థానానికి వెళ్లే రైళ్ల కోసం సెర్చ్ చేయండి.
* ఎంచుకున్న రైలు టిక్కెట్ వెయిట్‌లిస్ట్‌లో ఉంటే.. మీరు ‘ప్రత్యామ్నాయ స్టేషన్’ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
* సమీపంలోని ప్రత్యామ్నాయ స్టేషన్ల నుంచి అందుబాటులో ఉన్న టిక్కెట్ ఆప్షన్లను ఎంచుకోండి.
* మీరు ఇష్టపడే బోర్డింగ్ స్టేషన్ నుంచి మీ ప్రయాణ గమ్యస్థానానికి టిక్కెట్‌లను ఎంచుకుని, బుక్ చేసుకోండి.
యూపీఐతో రైలు టికెట్ బుకింగ్ పేమెంట్ :
రైలు టిక్కెట్ బుకింగ్‌ల కోసం వినియోగదారులు ఎలాంటి పేమెంట్ గేట్‌వే రుసుము చెల్లించకుండా యూపీఐతో చెల్లించవచ్చని పేటీఎం పేర్కొంది. అదనంగా, యూజర్లు పేటీఎం యాప్‌లో లైవ్ రైలు రన్నింగ్ స్టేటస్, PNR స్టేటస్ చెక్ చేయవచ్చు. ఇంతలో, పేటీఎం ట్రావెల్ కార్నివాల్ సేల్‌లో భాగంగా ట్రావెల్ బుకింగ్‌లపై మల్టీ డిస్కౌంట్లను అందిస్తోంది. అక్టోబర్ 27, నవంబర్ 5 మధ్య నడుస్తుంది.

New Paytm feature seat bookings on trains
ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, స్పైస్‌జెట్, స్టార్ ఎయిర్, అకాసా వంటి ప్రధాన విమానయాన సంస్థలను కలిగిన ట్రావెల్ కార్నివాల్ సేల్ (Travel Carnival Sale) సమయంలో బడ్జెట్‌లో ప్రయాణికులు దేశీయ విమానాల్లో 15 శాతం, అంతర్జాతీయ విమానాల్లో 10 శాతం ఆదా చేసుకోవచ్చు. ఈ ఎక్స్‌క్లూజివ్ సేల్ ఆఫర్‌లు సేల్ వ్యవధిలో చేసిన బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తాయని గమనించాలి.
బ్యాంకు ఆఫర్లు, మరెన్నో స్పెషల్ డిస్కౌంట్లు :
కస్టమర్‌లు ICICI బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, RBL బ్యాంక్, HSBC బ్యాంక్ నుంచి ఎలాంటి సౌకర్య రుసుము లేకుండా బ్యాంక్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, సాయుధ దళాల సిబ్బందికి ప్రత్యేక తగ్గింపు ఛార్జీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రయాణ బుకింగ్‌ల కోసం టాప్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లుగా, యూజర్ల అనుభవాన్ని మెరుగుపరచడానికి వినూత్నమైన ఫీచర్‌లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పేటీఎం ప్రతినిధి తెలిపారు.
Read Also : Paytm UPI Lite Payments : పేటీఎంలో సరికొత్త ఫీచర్.. ఇకపై పిన్ లేకుండానే ఈజీగా పేమెంట్లు చేసుకోవచ్చు..!