Redmi Note 12 Launch : మార్చి 30న రెడ్మి నోట్ 12 ఫోన్ వచ్చేస్తోంది.. అద్భుతమైన ఫీచర్లు, భారత్‌లో ధర ఎంత ఉండొచ్చుంటే?
Redmi Note 12 Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్మి (Redmi) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. ఈ 4G డివైస్ మార్చి 30న భారత మార్కెట్లోకి రానుందని రెడ్మి ట్విట్టర్లో ధృవీకరించింది.

Redmi Note 12 launched globally, coming to India on March 30 _ Check out details
Redmi Note 12 Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్మి (Redmi) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. అదే (Redmi Note 12) స్మార్ట్‌ఫోన్. ఈ 4G డివైస్ మార్చి 30న భారత మార్కెట్లోకి రానుందని రెడ్మి ట్విట్టర్లో ధృవీకరించింది. లాంచ్‌కు ముందు, రెడ్మి గ్లోబల్ మోడల్‌కు సమానమైన కొన్ని ముఖ్య ఫీచర్లను ఇప్పటికే ధృవీకరించింది. గ్లోబల్, భారతీయ మోడల్స్ రెండూ ఒకేలా ఉంటాయని కంపెనీ సూచిస్తుంది. రాబోయే రెడ్మి 12 ఫోన్ లాంచ్ పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
రెడ్మి నోట్ 12 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
(Redmi) కొత్త డివైజ్ స్లిమ్ ప్రొఫైల్, అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంది. (Xiaomi India) వెబ్సైట్లో పోస్ట్ చేసిన టీజర్లు, హ్యాండ్సెట్ గ్రేడియంట్ ఫినిషింగ్‌తో మెరిసే గోల్డెన్ కలర్ మోడల్లో రానుందని తెలిపింది. ఈ ఫోన్ ఏయే కలర్ వేరియంట్లలో లాంచ్ చేస్తుందో లేదో తెలియదు. బాక్సీ డిజైన్ ఇప్పటికే రివీల్ చేయగా, వాల్యూమ్, పవర్ బటన్లు డివైజ్ కుడి వైపున ఉన్నట్టు కనిపిస్తోంది.
రాబోయే Redmi ఫోన్ పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్‌ను కలిగి ఉంది. ప్యానెల్‌కు 120Hz సపోర్టు కూడా అందిస్తుంది. ప్రస్తుతం భారతీయ మోడల్‌కు డిస్ప్లే సైజు ఎంత ఉండొచ్చు అనేది తెలియదు. గ్లోబల్ వెర్షన్ 6.67-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. హెడ్‌ఫోన్ జాక్‌ను కూడా కలిగి ఉంది. ఇప్పటికే ప్రీమియం ఫోన్లను నిలిపివేసాయి.

Redmi Note 12 launched globally, coming to India on March 30
చాలా మిడ్-రేంజ్ డివైజ్‌లలో కూడా అందించడం లేదు. కంపెనీ అధికారిక వెబ్సైట్లో రెడ్మి నోట్ 12 ముఖ్య స్పెసిఫికేషన్లను ధృవీకరించింది. బడ్జెట్ ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 685 SoC ద్వారా పవర్ అందిస్తుంది. 4G చిప్ కలిగి ఉండి, గరిష్టంగా 11GB RAMకి సపోర్టు అందిస్తుంది.
Redmi Note 12 స్మార్ట్‌ఫోన్‌లో 50-MP ప్రైమరీ కెమెరాతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. భారతీయ మోడల్‌కు సంబంధించిన ఇతర సెన్సార్ల వివరాలు ఇంకా రివీల్ కాలేదు. గ్లోబల్ వేరియంట్ వెనుక భాగంలో మరో సెటప్ ఉంది. ఇందులో 48-MP సెన్సార్, 8-MP అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్, 2-MP డెప్త్ కెమెరా ఉన్నాయి. (Redmi Note 12) హుడ్ కింద 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. కంపెనీ రిటైల్ బాక్స్‌లో 33W ఫాస్ట్ ఛార్జర్‌ను అందిస్తుంది.
రెడ్మి నోట్ 12 ధర ఎంత ఉండొచ్చుంటే? :
Redmi Note 12 ధర (EUR 199). భారత మార్కెట్లో దాదాపు రూ. 17,720గా ఉంది. కానీ, రెడ్మి నోట్ 12 భారత మార్కెట్లో చాలా తక్కువ ధరకు లాంచ్ చేయనుంది. ఎందుకంటే, 4G ఫోన్ తక్కువ ధరలో ఫీచర్లను కలిగి ఉంది. Redmi Note 11 భారత మార్కెట్లో రూ. 14,499 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. కొత్త వెర్షన్ ఇదే ధరల రేంజ్లో ఉండవచ్చని భావిస్తున్నారు. కచ్చితమైన ధర తెలియాలంటే.. వచ్చేవారం మార్చి 30 నాటికి భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.