Redmi Note 12 : ఈ నెలలోనే రెడ్‌మి నోట్ 12 వస్తోంది.. ఇండియా లాంచ్ ఎప్పుడు? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Redmi Note 12 : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్‌మి (Redmi) చివరకు రెడ్‌మి నోట్ 11 సిరీస్ (Redmi Note 11 Series) అప్‌గ్రేడ్ వెర్షన్‌ను లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఇప్పటివరకు ఇదే సిరీస్‌లో 15 కంటే ఎక్కువ ఫోన్‌లను లాంచ్ చేసింది.

Redmi Note 12 : ఈ నెలలోనే రెడ్‌మి నోట్ 12 వస్తోంది.. ఇండియా లాంచ్ ఎప్పుడు? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Redmi Note 12 launching this month, company confirms

Updated On : October 20, 2022 / 10:42 PM IST

Redmi Note 12 : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్‌మి (Redmi) చివరకు రెడ్‌మి నోట్ 11 సిరీస్ (Redmi Note 11 Series) అప్‌గ్రేడ్ వెర్షన్‌ను లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఇప్పటివరకు ఇదే సిరీస్‌లో 15 కంటే ఎక్కువ ఫోన్‌లను లాంచ్ చేసింది. ఇప్పుడు చైనాలో రెడ్‌మి నోట్ 12 (Redmi Note 12)ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ లాంచ్ ఈవెంట్ కచ్చితమైన తేదీని కంపెనీ వెల్లడించలేదు. Redmi Note 12 ఫోన్ లాంచ్ ఈ నెలలో ఉంటుందని ధృవీకరించే పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ డివైజ్ రెండు ప్రధాన టెక్నాలజీతో వస్తుంది.

అందులో ప్రపంచంలో మొదటిదిగా పోస్టర్ వెల్లడించింది. ఈ ఈవెంట్‌లో రెడ్‌మీ ఎన్ని స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనుంది అనేది ప్రస్తుతానికి తెలియదు. Redmi Note 12, Redmi Note 12 Pro, Redmi Note 12, Redmi Note 12 Pro+ లాంచ్‌ చేసే అవకాశం ఉంది.

Redmi Note 12 launching this month, company confirms

Redmi Note 12 launching this month, company confirms

ఈ డివైజ్‌లు గతంలో అధికారిక సైట్‌లలో కనిపించాయి. 67W, 120W, 210W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో రావచ్చు. ప్రో మోడల్‌లు MediaTek సరికొత్త డైమెన్సిటీ 1080 SoCని ప్యాక్ అవుతాయి. డైమెన్సిటీ 920 చిప్‌సెట్‌పై అప్‌గ్రేడ్ అవుతుంది. హుడ్ కింద డైమెన్సిటీ 1300 చిప్ ఉండవచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.

మూడు స్మార్ట్‌ఫోన్‌లు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తాయని భావిస్తున్నారు. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. కంపెనీ డిజైన్ విభాగంలో మార్పులు చేయాలని భావిస్తున్నారు. అయినప్పటికీ, కొత్త రెడ్‌మి నోట్ సిరీస్ ఫోన్‌లు చాలా వరకు ఆండ్రాయిడ్ హ్యాండ్‌సెట్‌లలో అదే పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌ను ముందు భాగంలో అందించే అవకాశం ఉంది.

మిగిలిన వివరాలు తెలియరాలేదు. రెడ్‌మి నోట్ 12 సిరీస్ భారత మార్కెట్లో ఎప్పుడు వస్తుందనే దానిపై సమాచారం లేదు. కానీ, బ్రాండ్‌కు కీలకమైన మార్కెట్‌లలో భారత్ ఒకటిగా చెప్పవచ్చు. ఇది ఇప్పటివరకు దేశంలోని అన్ని ఓల్డ్ వెర్షన్‌లను లాంచ్ చేసింది. భారతీయ మార్కెట్లోనూ Redmi Note 12 సిరీస్ లాంచ్ చేసే అవకాశం ఉంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Flipkart Big Diwali Sale : బిగ్ దీపావళి సేల్.. ఈ ఫెస్టివల్ సీజన్‌లో 5 కార్పొరేట్ గిఫ్ట్ ప్రొడక్టులు.. భారీ డిస్కౌంట్లు.. త్వరపడండి!