Redmi Note 12 Pro Plus : రెడ్‌మి నోట్ 12ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ జనవరి 5న వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Redmi Note 12 Pro Plus : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం (Xiaomi) భారత మార్కెట్లో రెడ్‌మి నోట్ 12 ప్రో ప్లస్ (Redmi Note 12 Pro+) లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ డివైజ్ 2023 జనవరి 5 దేశంలో లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది.

Redmi Note 12 Pro Plus : రెడ్‌మి నోట్ 12ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ జనవరి 5న వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Redmi Note 12 Pro Plus launching in India on January 5

Updated On : December 16, 2022 / 3:09 PM IST

Redmi Note 12 Pro Plus : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం (Xiaomi) భారత మార్కెట్లో రెడ్‌మి నోట్ 12 ప్రో ప్లస్ (Redmi Note 12 Pro+) లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ డివైజ్ 2023 జనవరి 5 దేశంలో లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. బ్రాండ్ రెడ్‌మి నోట్ 12 సిరీస్‌లోని 4 మోడళ్లను చైనాలో లాంచ్ చేసింది. అయితే, రెడ్‌మి ఈ మోడల్ ఫోన్లను భారత మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోందో లేదో తెలియదు. ఇప్పటివరకు, Xiaomi Pro+ మోడల్ గురించిన వివరాలను షేర్ చేసింది. 200-MP ప్రైమరీ రియర్ కెమెరా, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. రాబోయే Redmi Note 12 Pro+ 5G ఫోన్ గురించి ఏయే ఫీచర్లు ఉండనున్నాయో ఓసారి పరిశీలిద్దాం..

డిస్‌ప్లే, డిజైన్ (Design) :
కొత్త రెడ్‌మి నోట్ సిరీస్ ఫోన్ బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ డివైజ్ ఫ్రంట్ సైడ్ చాలా చిన్న పంచ్-హోల్ కెమెరాను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్‌మి Note 12 Pro+ 120Hz రిఫ్రెష్ రేటుతో పెద్ద 6.67-అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్యానెల్ 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. డాల్బీ విజన్‌తో పాటు HDR10+కి సపోర్టు అందిస్తుంది. గరిష్టంగా 900నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్టు అందిస్తుంది. ఈ డివైజ్ బ్రైట్ స్క్రీన్‌తో డిస్‌ప్లేతో కనిపిస్తోంది.

Read Also : Redmi Note 12 5G India : ఇండియాకు రెడ్‌మి నోట్ 12 5G సిరీస్ వచ్చేస్తోంది.. ఫీచర్లు అదుర్స్.. లాంచ్ ఎప్పుడు? ధర ఎంత ఉండొచ్చుంటే?

చిప్‌సెట్ (Chipset) :
చైనాలో, కొత్త Redmi Note ఫోన్ MediaTek డైమెన్సిటీ 1080 SoCతో రానుంది. ఇటీవల Realme 10 Pro+ స్మార్ట్‌ఫోన్‌కు కూడా పవర్ అందిస్తోంది. Redmi Note 12 Pro+ ధర రూ. 24,999లకు అందుబాటులో ఉండనుంది. సెక్యూరిటీ పరంగా సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ (Fingerprint Sensor)ను కలిగి ఉంది. స్టీరియో స్పీకర్‌లతో రానుంది.

Redmi Note 12 Pro Plus launching in India on January 5

Redmi Note 12 Pro Plus launching in India on January 5

రెడ్‌మి నోట్ 12 ప్రో+లో మెరుగైన హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటార్ ఉంది. హుడ్ కింద సాధారణ 5,000mAh బ్యాటరీ యూనిట్ ఉంది. కంపెనీ బాక్స్‌లో 120W ఫాస్ట్ ఛార్జర్‌ను అందిస్తుంది. దాదాపు 19 నిమిషాల్లో బ్యాటరీ యూనిట్‌లో సున్నా నుంచి 100 శాతం వరకు టాప్ ఛార్జ్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

కెమెరా (Camera) :
రెడ్‌మి నోట్ ఫోన్ f/1.65 ఎపర్చరు, 7P లెన్స్, ALD కోటింగ్, OIS సపోర్ట్‌తో 200-MP కెమెరాలు, Samsung HPX ప్రైమరీ సెన్సార్‌తో రానుంది. రెడ్‌మి నోట్ 12 Pro+లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో రెండు సెన్సార్లు 8-MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెకండరీ కెమెరా, 2-MP మాక్రో యూనిట్ అందిస్తోంది. ఫ్రంట్ సైడ్‌లో 16-MP కెమెరా కూడా ఉండనుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Redmi K60 Series : వచ్చే జనవరిలో రెడ్‌మి K60 సిరీస్ వస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!