Redmi Note 12 series launching in India on Jan 5 _ Livestream details, expected price and other details
Redmi Note 12 5G Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్‌మి (Redmi) నుంచి Redmi Note 12 సిరీస్ జనవరి 5న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ కొత్త Redmi Note సిరీస్ 2022 ఫిబ్రవరిలో Redmi Note 11 సిరీస్‌తో లాంచ్ అయింది. 2023 మొదటి వారంలో నెక్స్ట్ జనరేషన్ డివైజ్ లాంచ్ చేయనుంది. ఈసారి షావోమీ (Xiaomi) స్టాండర్డ్, ప్రో, రెడ్‌మి నోట్ 12 ప్రో+ ఫోన్ Redmi Note 12 సిరీస్ మూడు ఫోన్‌లను ఆవిష్కరించనుంది. జనవరి 5న ఈ లాంచ్ ఈవెంట్ మధ్యాహ్నం 12:00 గంటలకు ప్రారంభమవుతుంది.
లైవ్ స్ట్రీమింగ్ ఈవెంట్‌ను వీక్షించాలంటే ఆసక్తి కలిగిన వినియోగదారులు Mi.com ప్లాట్‌ఫారమ్, కంపెనీ అధికారిక YouTube ఛానెల్ చూడవచ్చు. అంతేకాదు.. ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ డివైజ్‌లు ఇప్పటికే చైనాలో అందుబాటులోకి వచ్చేశాయి. రాబోయే 12 సిరీస్ ఫోన్లలో ఏయే ఫీచర్లు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
రెడ్‌మి నోట్ 12 ప్రో+ (Redmi Note 12Pro+) సిరీస్‌లోని హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్. 6.67-అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ వద్ద రిఫ్రెష్ అవుతుంది. ప్యానెల్ 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. డాల్బీ విజన్‌తో పాటు HDR10+కి సపోర్టు ఇస్తుంది. గరిష్టంగా 900నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్టు అందిస్తుంది.
Redmi Note 12 series launching in India on Jan 5 _ Livestream details, expected price
ఈ Redmi డివైజ్ బెస్ట్ స్క్రీన్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. చైనాలో Redmi Note 12 Pro+ MediaTek Dimensity 1080 ప్రాసెసర్‌తో ఆధారితమైనదిగా చెప్పవచ్చు. Realme 10 Pro+ స్మార్ట్‌ఫోన్‌కు ధర రూ. 24,999గా ఉండనుంది. Redmi Note 12 Pro+ ఇదే ధరతో వచ్చే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉండనుంది. 200 MP Samsung HPX ప్రైమరీ సెన్సార్‌తో రానున్న ఫస్ట్ ఫోన్ ఇదే కానుంది.
సెక్యూరిటీ విషయానికి వస్తే.. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. డాల్బీ అట్మోస్‌కు సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కూడా కలిగి ఉంది. రెడ్‌మి నోట్ 12 ప్రో+లో మెరుగైన హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటార్ ఉంది. హుడ్ కింద, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో సాధారణ 5,000mAh బ్యాటరీ యూనిట్ ఉంది.
Redmi Note 12 series launching in India on Jan 5
రెడ్‌మి నోట్ 12 ప్రో+ భారత మార్కెట్లో ధర రూ. 24,999 నుంచి ప్రారంభం కానుందని టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ తెలిపారు. బ్యాంక్ ఆఫర్‌ల ప్రకారం.. 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్, 8GB RAM + 256 స్టోరేజ్ మోడల్ రూ. 26,999గా ఉండనుంది. అయితే 12GB + 256GB వేరియంట్ ధర రూ. 28,999గా ఉండనుంది. టిప్‌స్టర్ ప్రకారం.. Redmi Note 12 భారత మార్కెట్లో రూ. 15వేల పరిధిలో అందుబాటులో ఉండనున్నాయి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..