Redmi Note 13 Pro, Note 13 Pro Plus Spotted on TENAA Listing, Specifications Revealed
Redmi Note 13 Pro Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమీ (Xiaomi) ఈ ఏడాది మార్చిలో లాంచ్ అయిన (Redmi Note 12 Pro 5G, Redmi Note 12 Pro+ 5Gలకు అప్‌గ్రేడ్ తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల, రెండు కొత్త రెడ్‌మి ఫోన్‌లు, రెడ్‌మి నోట్ 13 ప్రో, రెడ్‌మి నోట్ 13 ప్రో+ కీలక వివరాలను వెల్లడిస్తూ TENAA సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో గుర్తించారు. రెడ్‌మి నోట్ 13 ప్రో, రెడ్‌మి నోట్ 12 ప్రోకి సక్సెసర్‌గా లాంచ్ అవుతుంది. రాబోయే స్మార్ట్‌ఫోన్ 5020mAh బ్యాటరీతో ఆధారితమైనది. 6.67-అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుంది.
టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ (చైనీస్) TENAA సర్టిఫికేషన్ల సైట్‌లో గుర్తించిన 2 కొత్త Redmi ఫోన్ల వివరణాత్మక స్పెసిఫికేషన్‌ల స్క్రీన్‌గ్రాబ్‌లను షేర్ చేసింది. Redmi Note 13 Pro, Note 13 Pro+గా మార్కెట్లోకి రానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు TENAA సైట్‌లో మోడల్ నంబర్‌లు 2312DRA50C 2312DRA50Cతో లిస్టు అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 5G-సపోర్ట్‌తో ఉంటాయని, 6.67-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటాయని లిస్టింగ్ వెల్లడించింది.
Redmi Note 13 Pro, Note 13 Pro Plus Spotted on TENAA Listing, Specifications Revealed
Redmi Note 13 Pro ప్లస్ 1TB స్టోరేజ్ వరకు, 18GB RAM వరకు ప్యాక్ చేయొచ్చు. అయితే, Redmi Note 13 Pro గరిష్టంగా 16GB RAMతో లిస్టు అయింది. రాబోయే 2 స్మార్ట్‌ఫోన్‌లను 4 స్టోరేజ్, ర్యామ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంచవచ్చని TENAA లిస్టింగ్ వెల్లడించింది. అదనంగా, హ్యాండ్‌సెట్‌లు 200MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ సెన్సార్, 2MP మాక్రో కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి.
ముందు భాగంలో, 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటారు. ఇంకా, రెడ్‌మి నోట్ 13 ప్రో, నోట్ 13 Pro ప్లస్ వరుసగా 5,020mAh బ్యాటరీ, 4,880mAh బ్యాటరీతో పవర్ పొందుతాయి. గత వెర్షన్లలో Redmi Note 12 Pro+ 5G, Redmi Note 12 Pro 5G ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్‌లు 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్‌ప్లేలను కలిగి ఉంటాయి. MIUI 13 కస్టమ్ స్కిన్ అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతాయి.
ఈ స్మార్ట్‌ఫోన్‌లు MediaTek డైమెన్సిటీ 1080 SoCలను కలిగి ఉంటాయి. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. రెడ్‌మి నోట్ 12 Pro+ 5G 200MP Samsung HPX సెన్సార్, f/2.2 లెన్స్, 120-డిగ్రీ ఫీల్డ్ వ్యూతో కూడిన 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2MPతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంది.