Redmi Note 13 Series : రెడ్‌మి నోట్ 13 సిరీస్ కీలక స్పెషిఫికేషన్లు లీక్.. 4 వేరియంట్లలో వస్తోంది.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Redmi Note 13 Series : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? రెడ్‌మి నోట్ 13 సిరీస్ కీలక స్పెషిఫికేషన్లు లీకయ్యాయి. రాబోయే ఈ ఫోన్ మొత్తం 4 వేరియంట్లలో వస్తోంది. ధర ఎంత ఉండొచ్చుంటే?

Redmi Note 13 Series Availability, Specifications Leaked

Redmi Note 13 Series : రెడ్‌మి అభిమానులకు అదిరే న్యూస్.. అతి త్వరలో రెడ్‌మి నుంచి సరికొత్త రెడ్‌మి 13 సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది. ఇప్పటికే భారత మార్కెట్లో Redmi Note 12 4G, Redmi Note 12 5G, Redmi Note 12 Pro 5G , Redmi Note 12 Pro+ 5G , Redmi Note 12 Turboలను కలిగిన రెడ్‌మి కంపెనీ Redmi Note 12 లైనప్‌లో Redmi Note 13 సిరీస్ త్వరలో లాంచ్ కానుందని భావిస్తున్నారు.

రాబోయే సిరీస్‌లోని కొన్ని మోడల్‌లు ఇటీవల వెరిఫైడ్ సైట్‌లలో కనిపించాయి. గత కొన్ని వారాలుగా రెడ్‌మి నోట్ 13 ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు లీకైన వివరాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పుడు, ఈ ఫోన్ల మోడల్‌లు, కొన్ని కీలక ఫీచర్లను సూచిస్తూ కొత్త నివేదిక రివీల్ చేసింది.

Read Also : Redmi 9A Sport Price : రెడ్‌మి 9A స్పోర్ట్ ఫోన్ ధర తగ్గిందోచ్.. కేవలం రూ.7,488కే సొంతం చేసుకోండి!

Xiaomiui నివేదిక ప్రకారం.. Redmi Note 13 సిరీస్‌లో Redmi Note 13 4G, Note 13 5G, Note 13 Pro లేదా Pro+ Note 13 Turbo వేరియంట్ ఉంటాయి. రెడ్‌మి నోట్ 13 4G మోడల్ నంబర్ N7తో ‘sapphire’ అనే కోడ్‌నేమ్‌తో NFC, NFC యేతర వేరియంట్‌లలో Qualcomm Snapdragon చిప్‌సెట్‌తో లాంచ్ అవుతుందని సూచిస్తోంది. ఈ మోడల్ యూరప్, టర్కీ ఇండోనేషియాలో లభ్యమవుతుంది.

అయితే, భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం లేదు. ‘గోల్డ్’ అనే మోడల్ నంబర్ N17 కోడ్‌నేమ్‌తో Redmi Note 13 5G వేరియంట్ Mediatek డైమెన్సిటీ SoC ద్వారా అందిస్తుంది. ఈ ఫోన్ 108MP ప్రైమరీ రియర్ సెన్సార్‌తో పాటు సెకండరీ అల్ట్రా-వైడ్ లెన్స్, మాక్రో లెన్స్‌తో వస్తుందని భావిస్తున్నారు. యూరప్, భారత్‌లో విక్రయించే ఎంపిక చేసిన మార్కెట్‌లలో Poco హ్యాండ్‌సెట్‌గా రీబ్రాండ్ చేయొచ్చునని భావిస్తున్నారు.

Redmi Note 13 Series Availability, Specifications Leaked

రెడ్‌మి నోట్ 13ప్రో లేదా రెడ్‌మి నోట్ 13 ప్రో+ మోడల్ నంబర్ N16Uని ‘zicron,’ అనే కోడ్‌నేమ్‌తో తీసుకురావచ్చు. 200MP Samsung ISOCELL HP3 ప్రైమరీ రియర్ సెన్సార్‌తో పాటు అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో కూడిన 8MP సెన్సార్, 2MP మాక్రో సెన్సార్‌తో అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ Mediatek డైమెన్సిటీ SoC ద్వారా పవర్ అందిస్తుంది. 16MP ఫ్రంట్ కెమెరా సెన్సార్‌తో వస్తుందని భావిస్తున్నారు.

భారత్, ఇతర ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రెడ్‌మి నోట్ 13 మోడల్‌లలో ఒకటి ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 9200+ SoC ద్వారా అందిస్తుందని గత నివేదిక సూచించింది. చివరగా, టాప్-ఆఫ్-ది-లైన్ రెడ్‌మి నోట్ 13 టర్బో కోడ్ నేమ్ ‘గార్నెట్’ కూడా 200MP శాంసంగ్ ISOCELL HP3 ప్రైమరీ రియర్ సెన్సార్‌ను అందిస్తుంది. Qualcomm Snapdragon చిప్‌సెట్‌ను అందిస్తుంది. ఎలాంటి రీబ్రాండింగ్ లేకుండా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయిన ఫస్ట్ రెడ్‌మి నోట్ టర్బో మోడల్ ఇదే అని చెప్పవచ్చు.

Read Also : Hyundai i20 Facelift Launch : ఈ పండక్కి కొత్త కారు కొంటున్నారా? ఫేస్‌లిఫ్టెడ్ హ్యుందాయ్ i20 హ్యాచ్‌బ్యాక్ ఇదిగో.. ధర ఎంతో తెలుసా?