Redmi Note 14 likely to launch in India soon
Redmi Note 14 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? షావోమీ ఎట్టకేలకు నెక్స్ట్ జనరేషన్ రెడ్‌మి నోట్ సిరీస్ ఫోన్ టీజర్‌ను రిలీజ్ చేసింది. రెడ్‌మి నోట్ 14 సిరీస్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ టీజర్‌లో ఫోన్ పేరును రివీల్ చేయలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భారత్‌లో రెడ్‌మి నోట్ 14 సిరీస్ లాంచ్? :
భారత మార్కెట్లోకి కొత్త రెడ్‌మి నోట్ సిరీస్ రాబోతోంది. రెడ్‌మి నోట్ 14 ఫోన్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రెడ్‌మి నోట్ 14 సిరీస్‌లో కనిపించే ఫొటో ఓవల్ ఆకారపు కెమెరా మాడ్యూల్ కూడా ఉంది. కొత్త రెడ్‌మి నోట్ సిరీస్ ఇటీవల చైనాలో లాంచ్ అయింది. గత ఏడాది రెడ్‌మి నోట్ 13 సిరీస్ జనవరి ప్రారంభంలో అదే సమయంలో వచ్చింది. నెక్స్ట్ జనరేషన్ రెడ్‌మి నోట్ 14 లైనప్ రాబోతోందని సూచిస్తున్నాయి. షావోమీ కొత్త రెడ్‌మి ఫోన్‌ల లాంచ్ వచ్చే నెలలో వచ్చే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో లాంచ్ ఈవెంట్‌పై క్లారిటీ రానుంది.
రెడ్‌మి నోట్ 14 సిరీస్ స్పెషిఫికేషన్లు :
ఈ రెడ్‌మి నోట్ 14 సిరీస్ స్పెసిఫికేషన్‌లు చైనీస్ రెడ్‌మి నోట్ 14 మోడల్‌ల మాదిరిగానే ఉంటాయి. రెడ్‌మి నోట్ 14ప్రో ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్‌ప్లేను అందిస్తుంది. అదనపు మన్నికకు ఈ స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా విక్టస్ 2 గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.
బ్యాటరీ విషయానికొస్తే.. రెడ్‌మి నోట్ 14 ప్రో+ భారీ 6200mAh బ్యాటరీని కలిగి ఉంది. 90డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కెమెరా సెటప్‌లో ట్రిపుల్-లెన్స్ కాన్ఫిగరేషన్, 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, మరో 50ఎంపీ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.
రెడ్‌మి నోట్ 14 కొన్ని ఫీచర్లతో సరసమైన ఆప్షన్ అందిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ ఫోన్ డెప్త్ సెన్సింగ్ కోసం 2ఎంపీ సెకండరీ లెన్స్‌తో 50ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపీ కెమెరా ఉంది. ఈ ఫోన్ 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5110mAh బ్యాటరీతో వస్తుంది.
రెడ్‌మి నోట్ 14ప్రో ప్లస్ ప్రామాణిక మోడల్‌తో వస్తుంది. ప్రో ప్లస్ మాదిరిగానే 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో 6.67-అంగుళాల ఓఎల్ఈడీ కర్వ్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ మోడల్ మీడియాటెక్ డైమన్షిటీ 7300-అల్ట్రా ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. రెడ్‌మి ప్రో వెర్షన్ 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కెమెరా సిస్టమ్ 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ600 సెన్సార్‌ను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 8ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపీ మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 20ఎంపీ సెన్సార్‌ను అందిస్తుంది.
Read Also : iQOO Neo 10 Series : ఐక్యూ నియో 10 సిరీస్ వచ్చేస్తోంది.. ఈ నెల 29నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?