Redmi First Fast Charging : రెడ్‌మి వరల్డ్ ఫస్ట్ 300W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్ ఇదిగో.. కేవలం 5 నిమిషాల్లోపే మీ ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయొచ్చు!

Redmi First 300W Fast Charging : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్‌మి (Redmi) ఫోన్లలో ఛార్జింగ్ టెక్నాలజీని అందిస్తోంది. రియల్‌మి (Realme) 240W ఛార్జింగ్ వేగాన్ని ప్రదర్శించింది. తొమ్మిదిన్నర నిమిషాల్లో 4,600mAh బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసింది.

Redmi unveils worlds first 300W fast charging technology, claims to fully charge smartphone in just 5 minutes

Redmi First 300W Fast Charging : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్‌మి (Redmi) ఫోన్లలో ఛార్జింగ్ టెక్నాలజీని అందిస్తోంది. రియల్‌మి (Realme) 240W ఛార్జింగ్ వేగాన్ని ప్రదర్శించింది. తొమ్మిదిన్నర నిమిషాల్లో 4,600mAh బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసింది. Realme పోటీదారు (Xiaomi) కూడా సబ్-బ్రాండ్ Redmi ఇలాంటి టెక్నాలజీపై పనిచేస్తోందని ప్రకటించింది. అయితే, ఛార్జింగ్-స్పీడ్ గేమ్‌ను పెంచడానికి కంపెనీ 5 నిమిషాలలోపు 4,100mAh బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసేందుకు ఛార్జింగ్ స్పీడ్ 300Wకి పెంచింది.

ఆండ్రాయిడ్ అథారిటీ ప్రకారం.. (Redmi) చైనీస్ సోషల్ మీడియా యాప్ Weiboలో వీడియోలో ఛార్జింగ్ టెక్నాలజీని ప్రదర్శించింది. అలాగే, 300W ఛార్జింగ్ టెక్నాలజీ కోసం 4,100mAh బ్యాటరీతో Redmi Note 12 డిస్కవరీ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించింది. ఒరిజినల్ Note 12 డిస్కవరీ ఎడిషన్ 4,300mAh బ్యాటరీని టెస్టింగ్ చేసేందుకు ఫోన్‌లో కొన్ని మార్పులు చేసింది. ఛార్జింగ్ వేగాన్ని కూడా సపోర్ట్ చేస్తుంది. సవరించిన Redmi Note 12 డిస్కవరీ ఎడిషన్ దాదాపు 3 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్‌ని కేవలం 5 నిమిషాల్లో ఫుల్ బ్యాటరీని పొందింది. ఛార్జింగ్ స్పీడ్ 290.6W వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంది. అంటే.. 300W కన్నా తక్కువగానే ఉందని చెప్పవచ్చు.

Read Also : OnePlus Nord 3 Launch : అత్యంత సరసమైన ధరకే వన్‌ప్లస్ నార్డ్ 3 సిరీస్ వచ్చేస్తోంది.. కెమెరా ఫీచర్లు హైలెట్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Redmi ఫోన్ వినియోగించిన 300W ఇమ్మోర్టల్ సెకండ్ ఛార్జర్.. ఇప్పటికే కొన్ని Xiaomi, Redmi స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులో ఉన్న 120W హైపర్‌ఛార్జ్ టెక్నాలజీకి భిన్నంగా కనిపిస్తుంది. ఆసక్తికరంగా, ఒరిజినల్ రెడ్‌మి నోట్ 12 డిస్కవరీ ఎడిషన్ 210W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,300mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 10 నిమిషాల కన్నా తక్కువ వ్యవధిలో పూర్తి ఛార్జ్‌ని పొందడానికి ఫోన్ హ్యాండ్‌సెట్ లోపల మూడు 100W ఫాస్ట్ ఛార్జింగ్ చిప్‌లను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ అక్టోబర్ 2022లో చైనాలో లాంచ్ అయింది.

Redmi unveils worlds first 300W fast charging technology

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారులలో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అందిస్తున్నాయి. Apple, Samsung స్మార్ట్‌ఫోన్‌లు ఇంకా 65W ఛార్జింగ్‌ను అందించలేదు. OnePlus, iQOO, Xiaomi, Realme వంటి బ్రాండ్‌లు తమ మధ్య బడ్జెట్ ఆఫర్‌లకు కనీసం 80W ఛార్జింగ్‌ను అందిస్తున్నాయి. రూ. 40వేల కన్నా ఎక్కువ ధర ఉన్న ప్రీమియం ఫోన్‌లలో చాలా ఫోన్‌లు కనీసం 100W ఛార్జింగ్‌తో వచ్చాయి. 30 నిమిషాల్లో ఫోన్‌ను (4,500mAh బ్యాటరీతో) పూర్తిగా ఛార్జ్ చేయగలవు.

Realme ఫోన్ MWC 2023లో 240W ఛార్జింగ్ టెక్‌ని ప్రదర్శించింది. 4,600mAh బ్యాటరీని ప్యాక్ చేసే కొత్త Realme GT 3లో అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌కు సపోర్టు అందిస్తుంది. రియల్‌మి ఈ డివైజ్ తొమ్మిదిన్నర నిమిషాల్లో పూర్తి ఛార్జ్‌ని పొందగలదని పేర్కొంది. రియల్‌మి Realme GT 3 ఇండియా లాంచ్ వివరాలు అస్పష్టంగానే ఉన్నాయి. మరోవైపు, 300W ఫాస్ట్ ఛార్జింగ్ ఏదైనా కమర్షియల్ మోడల్‌కు త్వరలో అందుబాటులోకి వస్తుందా అనే దానిపై Xiaomi క్లారిటీ ఇవ్వలేదు. కొన్ని ఛార్జింగ్ టెక్నాలజీని (Mi ఎయిర్ ఛార్జ్) కూడా ప్రదర్శించింది. సాధారణ వినియోగదారులకు ఇంకా అందుబాటులో రాలేదు.

Read Also : OnePlus 11R Sale in India : వన్‌ప్లస్ 11R ఫోన్ సేల్ ఆఫర్లు.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!