రూ.4,000కే Jio 4G ఆండ్రాయిడ్ ఫోన్.. రిలీజ్ ఎప్పుడంటే?

Reliance Jio 4G Android phone : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో మరో కొత్త బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్ మార్కెట్లోకి దించుతోంది. జియో యూజర్ల కోసం చౌకైన ధరకే 4G స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టబోతోంది. కేవలం రూ.4 వేలకే జియో 4G స్మార్ట్ ఫోన్ అందించాలని అధినేత ముఖేశ్ అంబానీ కంపెనీ ప్లాన్ చేస్తోంది.
ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా 2021 ఆరంభంలో Reliance Jio 4G స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయవచ్చని ఒక నివేదిక వెల్లడించింది. చౌకైన ధరకే రాబోయే ఈ 4G జియో స్మార్ట్ ఫోన్ Jio Orbic phone (RC545L) అనే మోడల్ పేరుతో రిలయన్స్ జియో ప్రకటించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. రూ.5 వేల లోపు ఉండే ఈ చౌకైన 4G ఫోన్ స్పెషిఫికేషన్ల గురించి రుమర్లు, లీక్‌లు బయటకు వస్తున్నాయి.
Google Play Console రిలీజ్ చేసిన జాబితాలో జియో ఫోన్ కోడ్ నేమ్ Orbic (RC545L) మోడల్ పేరుతో ప్రవేశపెట్టనుంది. రిలయన్స్ జియో ఇటీవలే గూగుల్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఫోన్‌ను గూగుల్ ద్వారా లాంచ్ చేయనున్నారు. Qualcomm Snapdragon QM215, Adreno 306 GPU, Android Go క్వాల్ కామ్ ప్రాసెసర్ తో పనిచేయనుంది. ఈ ఫోన్‌ను Android Go తో లాంచ్ చేయనుంది.
ఈ Jio Android phone లో 1GB RAM లేదా 2GB RAM కెపాసిటీ ఉండేలా అవకాశం ఉంది. ఇక ఫోన్ డిస్‌ప్లే విషయానికి వస్తే.. HD+ స్ర్కీన్ రిజల్యూషన్‌తో రానుంది. స్క్రీన్ డెన్సిటీ 320dpi ఉండనుంది. ఆండ్రాయిడ్ 10 లేదా 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో జియో 4G ఆండ్రాయిడ్ ఫోన్ లాంచ్ కానుంది.