40శాతం పెరగనున్న జియో టారిఫ్‌లు

వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ తర్వాత రిలయన్స్ జియో కొత్త టారిఫ్ ప్లాన్‌లను ఆదివారం ప్రకటించింది. కొత్త టారిఫ్ ప్లాన్‌లను బట్టి 40శాతం ధరలు పెరగనున్నాయి. డిసెంబరు 6 నుంచి రిలయన్స్ జియో అందిస్తున్న ఆల్ ఇన్ వన్ ప్యాక్‌లలోనూ మార్పులు ఉంటాయని ప్రకటించింది జియో.
ఇటీవల ఐయూసీ ఛార్జీలు అంటూ ప్యాక్‌లలో మార్పులు తెచ్చిన జియో మరోసారి ధరలు పెంచింది. కొత్తగా రానున్న ప్యాక్ లతో ఆల్ ఇన్ వన్ ప్లాన్‌లలో అన్ లిమిటెడ్ వాయీస్ కాలింగ్, అన్ లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. ఏ ఇతర నెట్‌వర్క్‌లకైనా ఉచితంగా ఎంతసేపటి వరకైనా మాట్లాడుకోవచ్చు’
‘దీంతో ఆల్ ఇన్ వన్ ప్యాక్ లు 40శాతం పెరిగాయి. పైగా కస్టమర్ సంతృప్తి ముఖ్యమని ఈ ప్యాక్ లతో 300శాతం ఎక్కువ బెనిఫిట్ లు పొందుతారని’ చెప్పుకొచ్చింది జియో. అంతకంటే ముందు టారిఫ్ రేట్లు పెంచిన వొడాఫోన్ ఐడియా ప్లాన్‌లు డిసెంబరు 3నుంచి అమల్లోకి రానున్నాయి.