Trai Data : మొబైల్ యూజర్లను భారీగా కోల్పోయిన జియో.. ఎయిర్‌టెల్ యూజర్లు పెరిగారు.. ఎంతంటే?

రిలయన్స్ జియో భారీగా మొబైల్ యూజర్లను కోల్పోయింది. దేశంలో డేటా ఛార్జీలను అత్యంత తక్కువ ఖరీదుకే అందించిన జియో క్రమంగా మొబైల్ యూజర్లను కోల్పోతోంది.

Trai Data : మొబైల్ యూజర్లను భారీగా కోల్పోయిన జియో.. ఎయిర్‌టెల్ యూజర్లు పెరిగారు.. ఎంతంటే?

Reliance Jio Loses 1.29 Cr Mobile Subscribers, Airtel Adds 4.75 Lakh In December 2021 Trai

Updated On : February 17, 2022 / 2:45 PM IST

Trai Data : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం, డేటా సంచలనం రిలయన్స్ జియో భారీగా మొబైల్ యూజర్లను కోల్పోయింది. దేశంలో డేటా ఛార్జీలను అత్యంత తక్కువ ఖరీదుకే అందించిన జియో క్రమంగా మొబైల్ యూజర్లను కోల్పోతోంది. సరికొత్త డేటా ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకున్న జియో.. టారిఫ్ ఛార్జీలు పెంచిన తర్వాత నుంచి మొబైల్ సబ్‌స్ర్కైబర్లు భారీగా తగ్గుతూ వచ్చినట్టు ట్రాయ్ నివేదిక వెల్లడించింది. రిలయన్స్ జియోతో పాటు ఇతర టెలికం పోటీదారులైన వోడాఫోన్ ఐడియా కూడా మొబైల్ యూజర్లను కోల్పోయాయి. కానీ, భారతీ ఎయిర్ టెల్ మొబైల్ సబ్ స్ర్కైబర్లు మాత్రం పెరగడం విశేషం.. ఈ మేరకు గురువారం (ఫిబ్రవరి 17)న ట్రాయ్ డేటాను రిలీజ్ చేసింది.

ఈ నివేదికలో రిలయన్స్ జియో మొబైల్ యూజర్ల సంఖ్య గత నెలతో పోలిస్తే.. 1.28 కోట్లకు పడిపోయిందని తెలిపింది. అది కూడా ఒక్క డిసెంబర్ 2021 నెలలోనే.. ఆ తర్వాత వోడాఫోన్ ఐడియా (Vodafone Idea) కూడా భారీగా మొబైల్ సబ్ స్ర్కైబర్లను కోల్పోయింది. భారతీ ఎయిర్ టెల్ మాత్రమే కొత్త మొబైల్ యూజర్లను సంపాదించుకుంది. రిలయన్స్ జియో దాదాపు 1.29 కోట్ల వైర్ లెస్ సబ్ స్ర్కైబర్లను కోల్పోయింది. దాంతో జియో మొబైల్ యూజర్ల సంఖ్య డిసెంబర్ 2021లో 41.57 కోట్లకు పడిపోయిందని నివేదిక వెల్లడించింది.

Reliance Jio Loses 1.29 Cr Mobile Subscribers, Airtel Adds 4.75 Lakh In December 2021 Trai (1)

వోడాఫోన్ ఐడియా కూడా 16.14 లక్షల మొబైల్ యూజర్లను కోల్పోయింది. దాంతో డిసెంబర్ 2021లో తన యూజర్ల బేస్ 26.55 కోట్లతో స్థిరంగా ఉంది. కానీ, ఎయిర్ టెల్ మాత్రం తమ వైర్ లెస్ యూజర్ల బేస్ 35.57 కోట్లకు పెరగడంతో మొబైల్ యూజర్ల సంఖ్య 4.75 లక్షలకు పెరిగారని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) డేటాలో వెల్లడించింది. జియో ప్రీపెయిడ్ ప్లాన్ల ధరల పెంపుతో యూజర్ల కౌంట్ భారీగా తగ్గినట్టు కనిపిస్తోంది.

ఇటీలే కొత్తగా సవరించిన జియో ప్రీపెయిడ్ ధరల్లో మార్పులు చేసింది. రిలయన్స్ జియో డిసెంబర్ 1, 2021లోనే ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచింది. భారతీ ఎయిర్ టెల్ (Airtel Prepiad Tariffs), వోడాఫోన్ ఐడియా (Vodafone Idea) ప్రీపెయిడ్ ధరలను పెంచుతున్నట్టు ప్రకటించిన తర్వాత జియో కూడా ప్రీపెయిడ్ టారిఫ్ ధరలను పెంచింది. జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను దాదాపు 20 శాతం వరకు సవరించింది. జియో యూజర్లు తమ రీఛార్జ్ ప్లాన్లపై అధిక మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది.

కంపెనీ నెలవారీ/వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు, డేటా యాడ్ ఆన్ ప్లాన్‌ల ధరలను కూడా జియో పెంచేసింది. చాలామంది జియో యూజర్లకు పెరిగిన కొత్త ప్రీపెయిడ్ ధరలపై గందరగోళం నెలకొంది. జియో యూజర్లు ఏదైనా రీఛార్జ్ చేయడానికి ముందు Jio ప్రీపెయిడ్ ఛార్జ్ ప్లాన్‌ల కొత్త ధరలను ఓసారి చెక్ చేసుకోండి. Reliance Jio ఇప్పటికే అందిస్తున్న అన్ని ప్యాక్‌ల రేట్లను 28 రోజుల నుంచి 365 రోజుల చెల్లుబాటుతో సవరించింది.

Read Also : Reliance Jio New Plans : జియో యూజర్లకు అలర్ట్.. ప్రీపెయిడ్ ప్లాన్ ధరలు మారాయి.. చెక్ చేసుకోండి..!