Reliance Jio
Reliance Jio : దేశంలోనే నంబర్ వన్ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తమ దాదాపు 46 కోట్ల మంది కస్టమర్ల కోసం అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ఈ సంఖ్య త్వరలో 50 కోట్లు దాటవచ్చు. జియో కస్టమర్ల కోసం జాబితాలో అనేక రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. కంపెనీ చౌకైన, ఖరీదైన ప్లాన్‌లను ఎక్కువగా ఆఫర్ చేస్తోంది. జియో కస్టమర్లు రీఛార్జ్ ప్లాన్‌ను ఎంచుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. జియో పోర్ట్‌ఫోలియోను అనేక కేటగిరీలుగా విభజించింది.
ఖరీదైన రీఛార్జ్ ప్లాన్లకు బదులుగా మీరు చౌకైన, లాంగ్ టైమ్ వ్యాలిడిటీ ప్లాన్ కోసం చూస్తుంటే.. ఈ ప్లాన్ మీకోసమే. జియో జాబితాలో లాంగ్ టైమ్ వ్యాలిడిటీతో అనేక రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. మీ బడ్జెట్ ప్రకారం ఏదైనా ప్లాన్ ఎంచుకోవచ్చు.
కంపెనీ పోర్ట్‌ఫోలియోలో రూ. వెయ్యి కన్నా తక్కువ ధరకే 336 రోజులు అందించే పొందే ప్లాన్ కూడా ఉంది. మీరు ఒకేసారి రీఛార్జ్ చేసుకుంటే చాలు.. ఏడాదింతా ఎంజాయ్ చేయొచ్చు. జియో అందించే లాంగ్ టైమ్ వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
రూ. 895 రీఛార్జ్ ప్లాన్ వివరాలు :
రిలయన్స్ జియో రీఛార్జ్ ప్లాన్ ధర కేవలం రూ. 895 మాత్రమే. జియో ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా 11 నెలల అంటే.. 336 రోజుల లాంగ్ టైమ్ వ్యాలిడిటీని అందిస్తోంది. ఈ ప్లాన్‌లో కస్టమర్లు పూర్తి 336 రోజుల పాటు అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ పొందవచ్చు. మీరు అన్ని నెట్‌వర్క్‌లలో ఫ్రీ కాల్స్ కూడా చేయవచ్చు.
జియో డేటా బెనిఫిట్స్ విషయంలో మొత్తం వ్యాలిడిటీతో పాటు వినియోగదారులకు 24GB హై స్పీడ్ డేటాను అందిస్తోంది. మీరు ప్రతి నెలా 2GB డేటాను మాత్రమే వాడగలరు. 2GB డేటా లిమిట్ దాటాక 64kbps స్పీడ్ ఇంటర్నెట్‌ను వాడగలరు. ఫ్రీ SMS, 28 రోజుల పాటు 50 ఫ్రీ ఎస్ఎంఎస్ అందుబాటులో ఉంటాయి.
ఈ జియో రీఛార్జ్ ప్లాన్ జియో యూజర్లందరికి కాదని గమనించాలి. కంపెనీ జియో ఫోన్ కస్టమర్ల కోసం మాత్రమే ప్రవేశపెట్టింది. మీకు జియో ఫోన్ ఉంటే.. ఈ సరసమైన ధరతో మీరు 11 నెలలు రీఛార్జ్ చేయాల్సిన పనిలేదు. కానీ, మీకు స్మార్ట్‌ఫోన్ ఉంటే.. మీరు మరో రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకోవాల్సిందే. జియో ఇందులో కస్టమర్లకు జియో టీవీతో పాటు జియో ఏఐ క్లౌడ్ స్టోరేజీని కూడా అందిస్తోంది.