డేటా ఆఫర్లు అదుర్స్ : ఏప్రిల్ 4 నుంచి జియోఫోన్ 2 ఫ్లాష్ సేల్
రిలయన్స్ జియో లవర్స్ కు గుడ్ న్యూస్. ప్రముఖ మొబైల్ డేటా నెట్ వర్క్ సంచలనం రిలయన్స్ జియో మరోసారి జియో ఫోన్2పై ఫ్లాష్ సేల్ ప్రవేశపెట్టనుంది.

రిలయన్స్ జియో లవర్స్ కు గుడ్ న్యూస్. ప్రముఖ మొబైల్ డేటా నెట్ వర్క్ సంచలనం రిలయన్స్ జియో మరోసారి జియో ఫోన్2పై ఫ్లాష్ సేల్ ప్రవేశపెట్టనుంది.
సమ్మర్ మొబైల్స్ సేల్ సందడి మొదలైంది. మొబైల్ నెట్ వర్క్ కంపెనీలు ఫ్లాష్ సేల్స్ తో ముందుకు వస్తున్నాయి. ప్రత్యేకించి రిలయన్స్ జియో లవర్స్ కు గుడ్ న్యూస్. ప్రముఖ మొబైల్ డేటా నెట్ వర్క్ సంచలనం రిలయన్స్ జియో మరోసారి జియో ఫోన్2పై ఫ్లాష్ సేల్ ప్రవేశపెట్టనుంది. ఏప్రిల్ 4 మధ్యాహ్నం 12 గంటల నుంచి రిలయన్స్ జియో ఫోన్2 ఫ్లాష్ సేల్ ప్రారంభం కానుంది. jio.com వెబ్ సైట్లో సేల్ జియో యూజర్లకు అందుబాటులో ఉండనుంది. జియోఫోన్ మొబైల్ ను 2018 ఆగస్టులో రిలయన్స్ జియో విడుదల చేసింది. రిలయన్స్ జియో నుంచి విడుదలైన తొలి 4G ఫీచర్ ఫోన్ కూడా ఇదే.
Read Also : పేటీఎంలోకి స్టాక్ మార్కెట్ : బ్రోకింగ్ సర్వీసుకు సెబీ ఆమోదం
Jio ఫోన్, Jio Phone2 ఫీచర్ ఫోన్ల ధర రూ.2వేల 999 ప్రైస్ ట్యాగ్ నిర్ణయించారు. రిలయన్స్ జియోఫోన్ 2 ఫీచర్లు యూజర్లను ఎట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. జియోఫోన్ 2లో హైలెట్ ఫీచర్ QWERTY కీబోర్డు. ఈ ఫోన్ 24 ఇండియన్ లాంగ్వేజీలను సపోర్ట్ చేసేలా వాయిస్ కమాండ్స్, వాయిస్ అసిస్టెంట్ బటన్ ఆప్షన్లు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. రూ.3 వేల లోపు తక్కువ ధరకే లభించే ఈ జియోఫోన్ సొంతం చేసుకోవాలంటే యూజర్లు ముందుగా జియో వెబ్ సైట్లో లాగిన్ కావాల్సి ఉంటుంది.
ఈ జియోఫోన్2 ఫీచర్ ఫోన్ కొనుగొలు చేస్తే.. ఫ్రీ వాయిస్ కాల్స్, డేటా ఆఫర్లు పొందొచ్చు. ఈ ఫోన్ సొంతం చేసుకునే యూజర్లు రూ.49, రూ.99, రూ.153 రీఛార్జ్ ప్లాన్లతో యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్స్ అన్నీ 28 రోజుల వ్యాలెడిటీ వర్తిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్లలోనూ ఫ్రీ వాయిస్ కాలింగ్ ఆఫర్ కామన్. ఈ ఫోన్ లో వాట్సాప్, యూట్యూబ్, ఫేస్ బుక్, గూగుల్ మ్యాప్స్, FM, బ్లూటూత్, Wi-Fi, NPS, GPS కనెక్ట్ విటీ ఆప్షన్లు యూజర్లను మరింత ఎట్రాక్ట్ చేయనున్నాయి.
జియో రీఛార్జ్ డేటా ఆఫర్లు :
* రూ. 49తో రీఛార్జ్ : జియో ఫోన్ యూజర్లు రోజుకు 50 SMSతో పాటు 1GB డేటా పొందవచ్చు.
* రూ. 99తో రీఛార్జ్ : ఈ ప్లాన్ పై 14GB మొబైల్ డేటా, 300 SMS పొందొచ్చు.
* రూ.153 రీఛార్జ్ : ఈ ప్లాన్ పై అన్ లిమిటెడ్ SMS డేటా, 42GB డేటా పొందొచ్చు.
జియోఫోన్ 2 : స్పెషిఫికేషన్లు ఇవే
* 2.4 అంగుళాల QWGA డిసిప్లే
* డ్యుయల్ నానో SIM సపోర్ట్
* 2000mAh బ్యాటరీ
* 512MB RAM, 4GB ఇంటర్నల్ స్టోరేజీ
* మైక్రో SD కార్డుతో 128GB వరకు ఎక్స్ పాండబుల్
* 2MP రియర్ కెమెరా, VGA ఫ్రంట్ కెమెరా
* KaiOS ఆపరేటింగ్ సిస్టమ్
Read Also : వాట్సాప్‌లో Tipline సర్వీసు : ఎన్నికల వేళ.. Fake News చెక్ పాయింట్