Jio Cloud Laptop : రిలయన్స్ జియో ‘క్లౌడ్’ ల్యాప్‌టాప్ వస్తోంది.. ధర ఎంత ఉండొచ్చుంటే?
Jio Cloud Laptop : రిలయన్స్ జియో నుంచి కొత్త ల్యాప్‌టాప్ రాబోతోంది. కేవలం రూ. 15వేల ధరలో క్లౌడ్ ల్యాప్‌టాప్ ప్రవేశపెట్టేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Reliance Jio Plans to Bring ‘Cloud’ Laptop Soon
Jio Cloud Laptop : ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో హార్డ్‌వేర్ ఆఫర్లు, బడ్జెట్ సెగ్మెంట్‌లో ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేయడంపైనే దృష్టిపెడుతోంది. ఇప్పటికే, కంపెనీ రెండో ల్యాప్‌టాప్ అయిన JioBook (2023)ను ఈ ఏడాది జూలైలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ జియోబుక్ ధర రూ. 16,499కు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు జియో పీసీ లైనప్‌ను విస్తరించే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది, కొత్త నివేదిక ప్రకారం.. కంపెనీ క్లౌడ్ ల్యాప్‌టాప్‌ను మార్కెట్‌కి సుమారు రూ. 15వేల ధరలో అందించనుంది. జియో క్లౌడ్‌తో పనిచేయడం ద్వారా అధిక ఖర్చులను తగ్గించుకోనుంది. రాబోయే నెలల్లో భారత మార్కెట్లో క్లౌడ్ ల్యాప్‌టాప్ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.
క్లౌడ్ ఆధారిత ల్యాప్‌టాప్ ఎలా పనిచేస్తుందంటే? :
ముకేశ్ అంబానీకి చెందిన టెలికమ్యూనికేషన్స్ సంస్థ కొన్ని నెలల్లో దేశంలో ల్యాప్‌టాప్‌ను ప్రవేశపెట్టేందుకు HP, Acer, Lenovo వంటి అగ్రశ్రేణి తయారీదారులతో చర్చలు జరుపుతోందని నివేదిక తెలిపింది. దీని ప్రకారం.. ల్యాప్‌టాప్ జియో క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో అన్ని ప్రాసెసింగ్, స్టోరేజ్ ఫంక్షన్‌లతో రానుంది. తద్వారా ఖరీదైన హార్డ్‌వేర్ అవసరం తగ్గుతుంది. తత్ఫలితంగా యాజమాన్యం ఖర్చు తగ్గుతుంది. అయితే, సాధారణ ల్యాప్‌టాప్ స్థానికంగా నిర్వహించగలిగే క్లౌడ్ నుంచి స్టోరేజీ, ప్రాసెసింగ్, ఇతర యాక్టివిటీలను యాక్సెస్ చేసుకోవచ్చు. క్లౌడ్-ఆధారిత కంప్యూటర్‌కు ఎల్లప్పుడూ ఆన్‌లైన్ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం పడుతుందని గమనించాలి.
ల్యాప్‌టాప్ ధర మెమరీ, ప్రాసెసింగ్ పవర్, చిప్‌సెట్ మొదలైనవి హార్డ్‌వేర్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ హార్డ్‌వేర్ బ్యాటరీ శక్తిని పెంచుతుంది. ల్యాప్‌టాప్ మొత్తం ప్రాసెసింగ్ జియో క్లౌడ్‌లో వెనుక భాగంలో జరుగుతుందని నివేదిక పేర్కొంది. ఆపిల్ ఐక్లౌడ్ లేదా గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ మాదిరిగా నెలవారీ క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్‌తో ల్యాప్‌టాప్‌ను అందించాలని జియో యోచిస్తోందని నివేదిక పేర్కొంది. క్లౌడ్ మెంబర్‌షిప్ ధర, తర్వాత తేదీలో ఖరారు చేయనుంది. క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ హై రేంజ్ ప్లాన్‌లో ప్రత్యేక ఫీచర్‌లతో అనేక జియో సర్వీసులను అందించనుంది.

Reliance Jio Cloud Laptop Soon
స్మార్ట్‌టీవీ, డెస్క్‌టాప్‌లోనూ క్లౌడ్ పీసీ సాఫ్ట్‌వేర్ :
జియో క్లౌడ్ ల్యాప్‌టాప్ ప్రస్తుతం (HP Chromebook)లో ట్రయల్స్‌లో ఉందని నివేదిక తెలిపింది. అదనంగా, క్లౌడ్-ఆధారిత డివైజ్ కొనుగోలు చేయకుండానే డెస్క్‌టాప్ లేదా స్మార్ట్‌టీవీ వంటి ఇప్పటికే ఉన్న డివైజ్‌ల్లో కూడా క్లౌడ్ పీసీ సాఫ్ట్‌వేర్‌ని యాక్సెస్ చేయవచ్చు. సెప్టెంబర్‌లో జియోలో ఎయిర్‌ఫైబర్ డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్, వై-ఫై సర్వీసును ప్రారంభించింది. 16 ఓటీటీ యాప్‌లకు సభ్యత్వాలతో పాటు 550కి పైగా డిజిటల్ టీవీ ఛానెల్‌లకు యాక్సెస్‌ను అందిస్తోంది. వారి స్థానంలో పరిమిత ఫైబర్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న యూజర్లకు అందించనుంది. జియో ఎయిర్‌ఫైబర్ సర్వీసుల్లో 5జీ FWA (ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్) ఆధారంగా వై-ఫై లాంటి ఇంటర్నెట్ కనెక్షన్‌ను అందిస్తాయి. జియో ఎయిర్‌ఫైబర్ సర్వీసులు ఇప్పుడు భారత్‌లో 262 పట్టణాలలో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌లు నెలకు రూ. 599తో ప్రారంభమవుతాయి.
రూ.2,599 ధరకే జియోఫోన్ ప్రైమా 4జీ :
జూలైలో, కంపెనీ జియోబుక్ (2023)ని ప్రారంభించింది. గత ఏడాదిలో ప్రవేశపెట్టిన మొదటి జియోబుక్ కు అప్‌గ్రేడ్ వెర్షన్. లేటెస్ట్ జియోబుక్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ8788 ప్రాసెసర్‌తో ఆధారితమైనది. ఆండ్రాయిడ్ ఆధారిత జియోఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఈ నెల ప్రారంభంలో జియో కూడా జియోఫోన్ ప్రైమా 4జీ ఫీచర్ ఫోన్‌ను రూ. 2,599కు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ KaiOS ప్లాట్‌ఫారమ్‌లో రన్ అవుతుంది. వాట్సాప్, యూట్యూబ్, గూగుల్ సెర్చ్, ఫేస్‌బుక్, అనేక జియో సర్వీసుల వంటి ప్రముఖ యాప్‌లకు సపోర్టు ఇస్తుంది. కంపెనీ 5జీ హ్యాండ్‌సెట్‌పై కూడా పని చేస్తుందని భావిస్తున్నారు.