Remove 8 Apps : మీ ఫోన్లో ఈ 8 యాప్‌లు ఉంటే.. తక్షణమే డిలీట్ చేసేయండి!

Remove These Eight Apps From Your Android Devices Immediately (1)
Remove Eight Apps : మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? ఆండ్రాయిడ్ ఫోన్ అయితే జర భద్రం.. పొరపాటున కూడా ఈ 8 యాప్స్ మీ ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకోవద్దు.. లేదంటే మాల్ వేర్ ఎటాక్ ముప్పు ఎదుర్కోవాల్సిందే.. సైబర్ నేరగాళ్లకు మీ విలువైన డేటా చిక్కుతుంది జాగ్రత్త.. ఇంతకీ మీరు ఇన్ స్టాల్ చేసిన యాప్స్ లో ఈ 8 మాల్ వేర్ యాప్స్ ఉన్నాయో లేదో ఓసారి చెక్ చేసుకోండి.. వీటిలో కొత్త రకం మాల్ వేర్ దాగి ఉన్నట్టు McAfee Mobile Research హెచ్చరిస్తోంది.
సౌత్ ఈస్ట్ ఏసియా, అరేబియన్ పెనిన్ సూలా యూజర్లే లక్ష్యంగా ఈ యాప్స్ రన్ అవుతున్నాయని అంటోంది. ఇప్పటివరకూ ఈ మాల్ వేర్ యాప్స్ ను 7లక్షల మంది యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. చూడటానికి అచ్చం ఫొటో ఎడిటర్, వాల్ పేపర్స్, పజిల్స్, కీబోర్డ్ స్కిన్స్ ఇతర కెమెరా యాప్‌ల పేరుతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంటాయని సంస్థ తమ రిపోర్టులో వెల్లడించింది. ఈ 8 యాప్‌లు మీ మొబైల్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయాలని సూచిస్తోంది. ఏదైనా ఒక యాప్‌ను గూగుల్ సమీక్షించి ఎలాంటి హానికర మాల్‌వేర్స్ లేవని నిర్ధరణకు వచ్చిన తర్వాతే వాటికి అప్రూవల్ ఇస్తుంది. అప్పుడు మాత్రమే ఆయా యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లోకి వస్తాయి.
ఈ 8 యాప్‌లు రివ్యూ సమయంలో క్లీన్ వర్షన్‌ను గూగుల్ ప్లే స్టోర్‌కు సమర్పిస్తున్నాయి. అప్రూవల్ తర్వాత అప్‌డేట్స్ ద్వారా మాల్‌వేర్‌ను ప్రవేశపెట్టినట్లు మెకాఫీ మొబైల్ రీసెర్చ్ సంస్థ రీసెర్చ్‌లో గుర్తించింది. వీలైనంత తొందరగా ఈ 8 యాప్‌లను ఆండ్రాయిడ్ ఫోన్లో నుంచి అన్ స్టిల్ చేసుకోవాలని పేర్కొంది. cache.bin, settings.bin, data.droid, or innoc వంటి .png ఫైల్స్ తో కలిగిన మాల్ వేర్ కోడ్ యాప్స్ లోకి కనిపించకుండా ఉండేలా సెట్ చేసి ఉంటాయని అంటోంది. ఇలాంటి యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవద్దని హెచ్చరిస్తోంది. ఒకవేళ ఇన్ స్టాల్ చేసిన వెంటనే డిలీట్ చేసుకోవాలని సూచిస్తోంది. మీ ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా ఈ 8 మాల్ వేర్ యాప్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి..
com.studio.keypaper2021
com.pip.editor.camera
org.my.favourites.up.keypaper
com.super,color.hairdryer
com.celab3.app.photo.editor
com.hit.camera.pip
com.daynight.keyboard.wallpaper
com.super.star.ringtones