Samsung Galaxy S24 Ultra Available On Flipkart
Republic Day Sale 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. భారత మార్కెట్లో ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) గెలాక్సీ S25 అల్ట్రాను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ 256జీబీ వేరియంట్ ధర రూ. 1,29,999 నుంచి ప్రారంభమవుతుంది. మొత్తం గెలాక్సీ ఎస్25 లైనప్ ముందస్తు ఆర్డర్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
శాంసంగ్ ప్రారంభ కొనుగోలుదారుల కోసం స్టోరేజ్ అప్‌గ్రేడ్ డీల్‌లను కూడా అందిస్తోంది. మీరు డబ్బు ఇంకా ఆదా చేయాలని చూస్తున్నట్లయితే.. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా (Galaxy S24 Ultra) ఫోన్ భారీ తగ్గింపును పొందింది. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మోడల్ రూ. 62వేల కన్నా తక్కువ ధరకే పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రాపై ఫ్లిప్‌కార్ట్ డీల్ :
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్ (టైటానియం బ్లాక్, 256GB) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో రూ. 1,21,999గా భారీ తగ్గింపుతో అందిస్తోంది. వాస్తవానికి ఈ ఫోన్ అసలు లాంచ్ ధర రూ. 1,29,999 నుంచి తగ్గింది. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా అందిస్తోంది.
మీరు పాత ఐఫోన్ 14 ప్రోలో ట్రేడింగ్ చేసినప్పుడు రూ. 48,550 వరకు ఆదా చేసుకోవచ్చు. తద్వారా ఈ ఫోన్ ధరను రూ.73,449కి తగ్గించవచ్చు. మరిన్ని సేవింగ్స్ పొందాలంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి రూ. 12వేల వరకు తగ్గింపులను పొందవచ్చు. తద్వారా శాంసంగ్ ఫోన్ ధర రూ. 61,449కి తగ్గుతుంది. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అత్యంత ఆకర్షణీయమైన డీల్స్‌లో ఒకటిగా నిలిచింది.
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ 6.8-అంగుళాల డైనమిక్ ఎల్‌టీపీఓ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 2600నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 1440×3120 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది. అసాధారణమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 12జీబీ ర్యామ్, 1టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీకి సపోర్టు ఇస్తుంది.
క్వాడ్-కెమెరా సెటప్‌లో 200ఎంపీ మెయిన్ సెన్సార్, 5ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 12ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, మల్టీఫేస్ ఫోటోగ్రఫీ ఆప్షన్లను అందిస్తోంది. 8K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
అయితే, 12ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఆకర్షణీయమైన సెల్ఫీలను తీసుకోవచ్చు. 5000mAh బ్యాటరీ 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, 15డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్, 4.5డబ్ల్యూ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ టైటానియం ఫ్రేమ్, ఐపీ68 రేటింగ్‌తో వస్తుంది. ఏడు ఏళ్ల అప్‌డేట్స్‌తో ఆండ్రాయిడ్ 14 ఆధారంగా వన్ యూఐ 6.1.1ని కలిగి ఉంది.
Read Also : Croma Republic Day Sale : ఇది కదా ఆఫర్ అంటే.. ఐఫోన్ 16 సగం ధరకే కొనేసుకోండి.. ఈ డోల్ అసలు మిస్ చేసుకోవద్దు!