Samsung Galaxy A05 : భారీ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ ఎ05 ఫోన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Samsung Galaxy A05 : శాంసంగ్ అభిమానుల కోసం సరికొత్త గెలాక్సీ ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉంది. ధర, ఫీచర్ల వివరాలను ఓసారి లుక్కేయండి.

Samsung Galaxy A05 : భారీ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ ఎ05 ఫోన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Samsung Galaxy A05 With MediaTek Helio G85 SoC, 5,000mAh Battery Launched in India_ Price, Specifications

Samsung Galaxy A05 : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లోకి నవంబర్ 28 (మంగళవారం) శాంసంగ్ గెలాక్సీ ఎ05 ఫోన్ లాంచ్ అయింది. ఈ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హెలియో జీ85 ఎస్ఓసీపై రన్ అవుతుంది. గరిష్టంగా 6జీబీ ర్యామ్, 128జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది.

శాంసంగ్ ర్యామ్ ప్లస్ ఫీచర్‌తో, అందుబాటులో ఉన్న మెమరీని 6జీబీ వరకు విస్తరించవచ్చు. గెలాక్సీ ఎ05 గత ఏడాదిలో గెలాక్సీ ఎ04కి అప్‌గ్రేడ్ వెర్షన్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 13లో రన్ అవుతుంది. శాంసంగ్ ఫోన్‌కి రెండు జనరేషన్ల ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, నాలుగు ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తోంది. 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎ05 ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ ఎ05 ఫోన్ బేస్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,999కు సొంతం చేసుకోవచ్చు. టాప్-ఆఫ్-ది-లైన్ 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 12,499కు సొంతం చేసుకోవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ బ్లాక్, లైట్ గ్రీన్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

Read Also :  Apple iPhone 12 : ఆపిల్ ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ.39వేలు మాత్రమే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

కొత్త శాంసంగ్ గెలాక్సీ ఎ-సిరీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వెబ్‌సైట్, ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా గెలాక్సీ ఎ05 కొనుగోలు చేస్తే రూ. 1,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది. ఈఎంఐ ఆప్షన్లలో నెలకు రూ. 875 నుంచి ప్రారంభమవుతాయి. వినియోగదారులు శాంసంగ్ ఫైనాన్స్ ప్లస్ ఉపయోగించి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎ05 స్పెసిఫికేషన్స్ :
డ్యూయల్-సిమ్ (నానో) గెలాక్సీ ఎ05 ఆండ్రాయిడ్ 13-ఆధారిత వన్ యూఐ స్కిన్‌పై రన్ అవుతుంది. శాంసంగ్ హ్యాండ్‌సెట్ నాలుగు ఏళ్ల భద్రతా అప్‌డేట్స్, రెండు జనరేషన్స్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లను అందించనుంది. 6.7-అంగుళాల హెచ్‌డీ+ (720×1,600 పిక్సెల్‌లు) పీఎల్ఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో జీ85 ఎస్ఓసీ ద్వారా ఆధారితమైనది. దాంతో పాటు గరిష్టంగా 6జీబీ ర్యామ్, 128జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీ అందిస్తుంది.

Samsung Galaxy A05 With MediaTek Helio G85 SoC, 5,000mAh Battery Launched in India_ Price, Specifications

Samsung Galaxy A05 Battery Launched 

ఆప్టిక్స్ విషయానికి వస్తే..
గెలాక్సీ ఎ05 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో ఎఫ్/1.8 ఎపర్చరు లెన్స్, 2ఎంపీ కెమెరాతో ఎఫ్/2.4 ఎపర్చరు లెన్స్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 8ఎంపీ కెమెరా కూడా ఉంది. ఇంకా, మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా 128జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీని 1TB వరకు విస్తరించుకోవచ్చు. గెలాక్సీ ఎ05లోని కనెక్టివిటీ ఆప్షన్లలో 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్, బీడౌ, గెలీలియో, 3.5ఎమ్.ఎమ్ హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

బోర్డులోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్, ఇతర సెన్సార్ ఉన్నాయి. ఇంకా, అథెంటికేషన్ కోసం ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు సపోర్టు ఇస్తుంది. శాంసంగ్ కొత్త బడ్జెట్ హ్యాండ్‌సెట్‌లో 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. ఈ ఫోన్ 168.8×78.2×8.8ఎమ్ఎమ్ పరిమాణం, 195 గ్రాముల బరువు ఉంటుంది.

Read Also :  iQoo 11 5G Discount : కొత్త ఫోన్ కొంటున్నారా? ఐక్యూ 11 5జీపై అదిరే డిస్కౌంట్.. ఫ్రీగా వివో TWS ఇయర్‌బడ్స్ పొందొచ్చు!