Samsung Galaxy A14 4G : భారత్‌కు శాంసంగ్ గెలాక్సీ A14 4G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్..!
Samsung Galaxy A14 4G : శాంసంగ్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. భారత మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ A14 4G ఫోన్ వచ్చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్‌కు ముందే ధర వివరాలు లీకయ్యాయి.

Samsung Galaxy A14 4G Tipped to Launch in India Soon; Price Leaked_ Report
Samsung Galaxy A14 4G Launch in India Soon : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) బడ్జెట్-ఫ్రెండ్లీ గెలాక్సీ A సిరీస్ రాబోతోంది. శాంసంగ్ గెలాక్సీ A14 4G త్వరలో బారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇటీవలి నివేదికలో శాంసంగ్ లాంచ్ టైమ్‌లైన్‌తో పాటు ఫోన్ ధర, స్టోరేజీ ఆప్షన్లను సూచించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఏడాది ప్రారంభంలో మలేషియాలో లాంచ్ అయింది. గ్లోబల్ స్పెసిఫికేషన్‌లు ఇప్పటికే రివీల్ అయ్యాయి.
ఈ హ్యాండ్‌సెట్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల (1,080×2,408 పిక్సెల్) PLS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. (Saminsider) నివేదిక ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ A14 4G కంపెనీ నుంచి బడ్జెట్-ఫ్రెండ్లీ ఆఫర్‌గా వచ్చే వారం భారత మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో రావచ్చు. 4GB RAM + 64GB స్టోరేజ్, 4GB RAM + 128GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ ధర వివరాలు లీకయ్యాయి. నివేదిక ప్రకారం.. శాంసంగ్ ఫోన్ బేస్ మోడల్ ధర రూ. 13,999 కాగా, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999కు అందుబాటులోకి రానుంది.
శాంసంగ్ గెలాక్సీ A14 4G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లపై ఎలాంటి వివరాలు రివీల్ చేయలేదు. ఈ ఫోన్ ఇప్పటికే మలేషియాలో లాంచ్ అయింది. శాంసంగ్ A14 ఫోన్ స్పెసిఫికేషన్‌లు అదే విధంగా ఉంటాయని భావిస్తున్నారు. మలేషియాలోని శాంసంగ్ గెలాక్సీ A14 4G 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల (1,080×2,408 పిక్సెల్) PLS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.

Samsung Galaxy A14 4G Tipped to Launch in India Soon; Price Leaked
ఈ హ్యాండ్‌సెట్ 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో MediaTek Helio G80 SoC ద్వారా పవర్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 13 ఆధారిత One UI 5.0 సపోర్టుతో అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో రన్ వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ A14 4G మోడల్ 50-MP ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది.
ప్రైమరీ కెమెరాతో పాటు 2-MP మాక్రో లెన్స్, 2MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. ముందు భాగంలో, డిస్ప్లే, టాప్ సెంటర్ పొజిషన్‌లో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌లో 13-MP సెల్ఫీ కెమెరాను అందిస్తుంది. ఈ ఫోన్‌లోని బ్యాటరీ సామర్థ్యం 15W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో రానుంది.
Read Also : Samsung Galaxy A34 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ A34 5G ఫోన్‌పై ఓ లుక్కేయండి..!