2025లో ఇలాంటి స్మార్ట్‌ఫోన్ల తయారీపై కంపెనీల పోటీ.. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్?

సన్నగా.. 5.5 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉంటుంది.

2025లో ఇలాంటి స్మార్ట్‌ఫోన్ల తయారీపై కంపెనీల పోటీ.. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్?

Updated On : May 9, 2025 / 7:12 PM IST

అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయడానికి కంపెనీలు పోటీ పడుతున్నాయి. 2025లో ఇదే ట్రెండ్‌ కనపడుతోంది. ఆపిల్, శాంసంగ్ ఈ రేసులో ముందున్నాయి. ఈ ఏడాది ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ ఫోన్‌ను విడుదల కావచ్చు. ఇక శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్‌ విడుదల కానుంది.

ఈ రెండు ఫోన్‌లు చాలా స్లిమ్‌గా ఉంటాయి. అయినప్పటికీ హై-ఎండ్ ఫీచర్‌లతో వస్తున్నాయి. ఈ సన్నని ఫోన్‌లు స్టైలిష్‌గానూ కనిపిస్తాయి. కానీ కొన్ని సమస్యలు ఉండవచ్చు. చిన్న బ్యాటరీలు (చాలా తక్కువ బ్యాటరీ లైఫ్ ఉంటాయి), పాత స్టైల్‌లో కెమెరాలు ఉండే అవకాశముంది.

Also Read: అవును.. నా బౌలింగ్ స్పీడ్ తగ్గింది.. అయినప్పటికీ..: మయాంక్ యాదవ్

ఐఫోన్ 17 ఎయిర్, గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ పోలికలేంటి?
డిజైన్‌
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ చాలా సన్నగా 5.84 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉంటుంది. టైటానియం ఫ్రేమ్ తో తయారు చేస్తున్నారు. స్క్రాచ్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ ఉంది. బరువు సుమారు 162 గ్రాములు. చాలా తేలికగా ఉంటుంది.

ఐఫోన్ 17 ఎయిర్ ఇంకా సన్నగా 5.5 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉంటుంది. అల్యూమినియంతో తయారు చేసే అవకాశం ఉంది. సిమ్ ట్రేని తీసివేసి పూర్తిగా eSIM మాత్రమే ఉంటుంది. క్లీన్, సింపుల్ డిజైన్‌పై దృష్టి పెడుతుంది.

డిస్ప్లే
గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ డిస్ప్లే 6.7-అంగుళాల AMOLED స్క్రీన్ తో రానుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది.

ఐఫోన్ 17 ఎయిర్ డిస్ప్లే 6.6-అంగుళాల OLED స్క్రీన్ తో ఉంటుంది. అధిక రిఫ్రెష్ రేట్ తో ప్రోమోషన్ టెక్నాలజీతో రానుంది.

బ్యాటరీ
గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ బ్యాటరీ సామర్థ్యం 3,900mAh. 25W ఫాస్ట్ ఛార్జింగ్. 15W వైర్‌లెస్ ఛార్జింగ్.

ఐఫోన్ 17 ఎయిర్ బ్యాటరీ సామర్థ్యం 3,900mAh కంటే తక్కువ ఉండొచ్చు. కొత్త A19 చిప్ తో రానుంది. ఇతర ఐఫోన్‌లలాగే బ్యాటరీ లైఫ్ అధిక సమయం ఉండొచ్చు. 20W వైర్డ్ ఛార్జింగ్, MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్ ఉండే అవకాశం ఉంది.

ధర, లాంచ్ వివరాలు
గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ లాంచ్ తేదీ: మే 13
ధర: సుమారు రూ.99,999 నుంచి రూ.1,29,999 మధ్య

ఐఫోన్ 17 ఎయిర్ లాంచ్ తేదీ: సెప్టెంబర్‌లో లాంచ్‌ కావచ్చు
ధర: దాదాపు రూ.89,900