SAMSUNG GALAXY F41 ఫోన్లను భారత్ లో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎఫ్ సిరస్ లో భాగంగా ఎఫ్ 41 మోడల్ ను వచ్చే నెలలో మార్కెట్ లో విడుదల చేయనుంది. దీని ధర రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
64 MP కెమెరా సెటప్‌తో పాటు, 32 MP సెల్ఫీ కెమెరా ఇస్తున్నారని సమాచారం. శాంసంగ్ octa-core Exynos 9611 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. గెలాక్సీ ఎం31 తరహాలోనే ఇందులో కూడా 6.4 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉండనుంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ యూఐ 2.0 ఓఎస్‌తో ఇది పని చేయనుందని సమాచారం.
6,000 mAh బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6 GB RAM/128 GB ఇంటర్నల్ మెమరీ వేరియంట్‌లో ఈ మోడల్‌ని మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
https://10tv.in/infinix-note-7-with-48mp-quad-rear-cameras-infinix-note-7-with-48mp-quad-rear-cameras/