Samsung Galaxy S23 Series could offer 8K video recording support and other features
Samsung Galaxy S23 Series : సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్ వస్తోంది. అదే.. శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ (Samsung Galaxy S23 Series). శాంసంగ్ స్టోరేజ్ వెర్షన్, హైక్వాలిటీ వీడియోలను రికార్డ్ చేయగల సామర్థ్యంతో వస్తుంది. శాంసంగ్ 2023 ఫ్లాగ్‌షిప్ సిరీస్ ప్రతి ఏడాదిలో మాదిరిగానే ఫిబ్రవరిలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఫీచర్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. రాబోయే శాంసంగ్ (Samsung Galaxy S23)కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్‌లు మరెన్నో ఉన్నాయి.
టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ 8K రెజల్యూషన్‌లో వీడియోలను రికార్డ్ చేసే ఆప్షన్లను అందిస్తుందని పేర్కొంది. Ultra మోడల్‌కు మాత్రమే లిమిట్ కలిగి ఉంది. స్టాండర్డ్, ప్రో వేరియంట్ 4K 60fps సపోర్టును అందిస్తుంది. గత ఏడాదిలో శాంసంగ్ గెలాక్సీ S22 Ultra, 24fps వద్ద 8K వీడియో రికార్డింగ్ సామర్థ్యంతో వస్తుంది. అధిక రిజల్యూషన్ వీడియోలకు సపోర్టు అందిస్తుంది. శాంసంగ్ మెరుగైన స్టోరేజ్ ఆప్షన్‌లను అందిస్తుందని భావిస్తున్నారు. గెలాక్సీ S23 Ultra బేస్ 256GB ఇంటర్నల్ స్టోరేజీతో రావచ్చని లీక్‌లు సూచిస్తున్నాయి. కేవలం 128GB బేస్ స్టోరేజ్ మోడల్‌తో రానుంది.
శాంసంగ్ గెలాక్సీ S22 అల్ట్రాతో పోలిస్తే.. పెద్ద అప్‌గ్రేడ్‌తో రానుంది. కొత్త వెర్షన్ మెరుగైన రీడ్ అండ్ రైట్ స్పీడ్ కోసం లేటెస్ట్ UFS 4.0 స్టోరేజ్ వెర్షన్‌ను కూడా అందిస్తుందని చెప్పవచ్చు. రాబోయే Samsung Galaxy S23 సిరీస్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC ద్వారా పనిచేస్తుంది. శాంసంగ్ గెలాక్సీ S23 పాత వెర్షన్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్‌కు సపోర్టు అందించే అవకాశం ఉంది. కేవలం 25W వైర్డు ఛార్జింగ్, 10W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మాత్రమే సపోర్టు అందిస్తుందని లీక్స్ పేర్కొంది.
Samsung Galaxy S23 Series could offer 8K video recording support
80W ఫాస్ట్ ఛార్జర్‌తో వచ్చే 30వేల రేంజ్‌లో ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఉన్నాయి. శాంసంగ్ ఇప్పటికీ తక్కువ ఛార్జింగ్ స్పీడ్‌కు సపోర్టుతో ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్‌లను అందిస్తోంది. కంపెనీ బాక్స్‌లో స్పీడ్ ఛార్జర్‌ను అందించకుంటే.. కనీసం 65W సపోర్టుతో అందించాలి. ఫోన్ బ్యాటరీ యూనిట్‌ను త్వరగా టాప్ అప్ చేసేందుకు ఫాస్ట్ ఛార్జర్‌ను కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్‌లోని వేరియంట్ డివైజ్ కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్ కారణంగా చిన్న బ్యాటరీని అందించే అవకాశం ఉంది. దీని ముందున్న గెలాక్సీ S22, హుడ్ కింద 3,700mAh బ్యాటరీని అందిస్తుంది.
కొత్త లీక్‌ల ప్రకారం.. 3,900mAh యూనిట్‌తో రావచ్చు. ఈ బ్యాటరీ చాలా చిన్నదిగా ఉంటుంది. వేగంగా అయిపోతుంది. Galaxy S22 బ్యాటరీ చాలా త్వరగా అయిపోతుంది. ఎక్కడికి వెళ్లినా ప్రతిసారీ పవర్ బ్యాంక్‌ని తీసుకెళ్లాలి. కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ కావాలనుకునే యూజర్లు బ్యాటరీ సమస్యతో బాధపడాల్సి వస్తుంది. శాంసంగ్ ఫోన్‌లలోని సాఫ్ట్‌వేర్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ పరంగా కూడా ఎక్కువ బ్యాటరీ లైఫ్ అందించడంలో సాయపడుతుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..