Samsung Galaxy S24 Price : ఆఫర్ అదిరింది బ్రో.. ఈ శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఇలాంటి డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!
Samsung Galaxy S24 Price : శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ భారీగా తగ్గింది. ఇప్పుడు కేవలం డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?
Samsung Galaxy S24 Price
Samsung Galaxy S24 Price : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. సౌత్ కొరియన్ దిగ్గజం లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ S24 ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ లాంచ్ (Samsung Galaxy S24 Price) ధర రూ. 74,999కు పొందవచ్చు. అయితే, ఇప్పుడు భారీ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ తక్కువ ధరకు ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ధర, ఆఫర్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ ధర ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ.47,999కి అందుబాటులోకి వచ్చింది. కానీ, ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ నుంచి కొనుగోలు చేస్తే.. మీకు రూ.2,398 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఫోన్ అసలు ధర కేవలం రూ. 45,601కి తగ్గింపు పొందవచ్చు. అంటే.. దాదాపు రూ. 30వేలు తగ్గింపు పొందవచ్చు. ప్రస్తుతానికి మార్కెట్లో అత్యంత విలువైన ఫ్లాగ్‌షిప్ ఫోన్ అంటే ఇదే అని చెప్పొచ్చు.
డిజైన్, బిల్డ్ క్వాలిటీ :
శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ ప్రీమియం డిజైన్ కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో వస్తుంది. ఫ్రంట్, బ్యాక్ రెండు వైపులా అద్భుతంగా ఉంటుంది. ఈ శాంసంగ్ ఫోన్ ఫ్రేమ్ ఆర్మర్ అల్యూమినియం 2తో తయారైంది. ఈ శాంసంగ్ ఫోన్ IP68 రేటింగ్‌తో వస్తుంది. వాటర్, డస్ట్ రెండింటి నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ బరువు కేవలం 167 గ్రాములు ఉంటుంది.
డిస్ప్లే :
డిస్‍ప్లే విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ 6.2-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2X డిస్‌ప్లే అందిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+కు సపోర్టు ఇస్తుంది. బ్రైట్‌నెస్ 2600 నిట్స్ (పీక్) వరకు పెరుగుతుంది. డిస్‌ప్లే రిజల్యూషన్ 1080×2340 పిక్సెల్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది.
కెమెరాలు :
కెమెరాల విషయానికి వస్తే.. శాంసంగ్ కెమెరా క్వాలిటీపరంగా అద్భుతంగా ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ S24 ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.
50MP మెయిన్ కెమెరా (OIS సపోర్టు)
10MP టెలిఫోటో లెన్స్ (3x ఆప్టికల్ జూమ్)
12MP అల్ట్రా-వైడ్ లెన్స్ (120° వ్యూ యాంగిల్)
ఈ ఫోన్ వీడియో రికార్డింగ్ కోసం 8K@30fps, 4K@60fpsకు సపోర్టు ఇస్తుంది. ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. HDR10+కు సపోర్టు ఇస్తుంది.
బ్యాటరీ, ఛార్జింగ్ :
శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ రెండింటికీ సపోర్టుగా 4000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇందులో 4.5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. ఇతర ఫోన్లతో కూడా ఛార్జ్ చేయొచ్చు.
