Samsung Galaxy S25 Ultra : ఇలాంటి డీల్ మళ్లీ రాదు.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ శాంసంగ్ అల్ట్రా ఫోన్‌పై కిర్రాక్ డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!
Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ చౌకైన ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ఖతర్నాక్ డీల్ అసలు మిస్ చేయొద్దు..
Samsung Galaxy S25 Ultra
Samsung Galaxy S25 Ultra : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ అతి త్వరలో లాంచ్ కానుంది. అంతకన్నా ముందే శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర ప్రస్తుతం అతి తక్కువ ధరకే లభిస్తోంది.
అసలు ధర రూ. 1,29,999 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy S25 Ultra) క్వాడ్ కెమెరా, అమోల్డ్ స్క్రీన్, షార్ప్ డిజైన్ ఎస్ పెన్ సపోర్ట్‌తో ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. మీరు శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ రూ. 1,06,000 లోపు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ లాంచ్ ధర నుంచి రూ.20వేలకు పైగా ధర తగ్గింది. ఇప్పుడు రూ.1,09,986 వద్ద లిస్ట్ అయింది. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంకు లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ కార్డ్ ద్వారా రూ.4వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ధర రూ.1,06,000 కన్నా తక్కువ ధరకు పొందవచ్చు.
కస్టమర్లు నెలకు రూ.3,867 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు మీ బ్యాంక్ కార్డ్ ప్రకారం వర్తిస్తాయి. కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ పాత ఫోన్‌పై రూ.60,200 వరకు వాల్యూను పొందవచ్చు. కానీ, వర్కింగ్ కండిషన్లు, ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. అదనంగా చెల్లిస్తే ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఇతర యాడ్-ఆన్‌లను కూడా అందిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా స్పెషిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ 6.9-అంగుళాల అమోల్డ్ ప్యానెల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌తో వస్తుంది. 16GB ర్యామ్, 1TB వరకు స్టోరేజీతో వస్తుంది. 5,000mAh బ్యాటరీ 45W ఛార్జింగ్‌తో వస్తుంది.
ఈ శాంసంగ్ ఫోన్ వన్ యూఐ8పై రన్ అవుతుంది. ఫొటోగ్రఫీ పరంగా ఈ శాంసంగ్ ఫోన్ 200MP మెయిన్, 50MP అల్ట్రావైడ్, 50MP పెరిస్కోప్ 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటోను అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.
