Samsung Galaxy S26 : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. కొత్త శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ ఫోన్లు వస్తున్నాయ్.. లాంచ్‌కు ముందే ఫుల్ ఫీచర్లు లీక్..!

Samsung Galaxy S26 : శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ ఫిబ్రవరిలో లాంచ్ కానుంది. శాంసంగ్ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు సంబంధించి లాంచ్ తేదీ, ధర, స్పెషిఫికేషన్ల వివరాలు రివీల్ అయ్యాయి..

Samsung Galaxy S26 : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. కొత్త శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ ఫోన్లు వస్తున్నాయ్.. లాంచ్‌కు ముందే ఫుల్ ఫీచర్లు లీక్..!

Samsung Galaxy S26 (Image Credit To Original Source)

Updated On : January 2, 2026 / 5:04 PM IST
  • ఫిబ్రవరిలో రానున్న శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ ఫోన్లు
  • లాంచ్ కు ముందుగానే కీలక ఫీచర్లు లీక్
  • 6.9-అంగుళాల క్యూహెచ్‌డీ, శాంసంగ్ M14 ఓఎల్ఈడీ ప్యానెల్స్

Samsung Galaxy S26 : శాంసంగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 2026లో శాంసంగ్ నుంచి సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లు రాబోతున్నాయి. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో గెలాక్సీ S26 సిరీస్ వచ్చే ఫిబ్రవరిలో లాంచ్ కానుంది. అయితే, లాంచ్‌కు ముందే ఫోన్ల గురించి పూర్తి వివరాలు లీక్ అయ్యాయి. డిజైన్ మార్పులు, కెమెరా అప్‌గ్రేడ్‌లలో అనేక ఫీచర్లు రివీల్ అయ్యాయి. ఈ లీక్‌లలో కొత్త ప్రీమియం గెలాక్సీ S26 సిరీస్‌కు సంబంధించి రివీల్ అయిన వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం..

శాంసంగ్ గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్, గెలాక్సీ S26 అల్ట్రా డిజైన్, స్పెసిఫికేషన్లు (అంచనా) :
శాంసంగ్ గెలాక్సీ S26 లైనప్ పూర్తి ఓవర్‌హాల్ కాకుండా గత ఏడాదిలో డిజైన్‌ మాదిరిగా కొన్ని అప్‌గ్రేడ్స్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. స్టాండర్డ్ గెలాక్సీ S26 మూడు లెన్స్‌లతో పిల్-ఆకారపు కెమెరా మాడ్యూల్‌ ఉండే అవకాశం ఉంది. అయితే, గెలాక్సీ S26 అల్ట్రా మెయిన్ కెమెరా ఐలాండ్ నుంచి కొన్ని లెన్స్‌ ఉండవచ్చు. 3 మోడళ్లూ ఫ్లాట్ రియర్ ప్యానెల్స్ ఫ్లాట్ మెటల్ ఫ్రేమ్‌లతో వస్తాయని భావిస్తున్నారు.

Samsung Galaxy S26

Samsung Galaxy S26 (Image Credit To Original Source)

శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్‌లో అన్ని ఫోన్లలో ఎంపిక చేసిన మార్కెట్‌లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో రావచ్చు. ఈ చిప్‌సెట్ 3nm ప్రాసెస్‌పై రన్ అవుతుంది.

సాఫ్ట్‌వేర్ పరంగా శాంసంగ్ ఈ ఫోన్‌లలో ఆండ్రాయిడ్ 8.5 ఆధారంగా వన్ యూఐ 16 ప్రీ-ఇన్‌స్టాల్ అయి ఉంటుంది. డిస్‌ప్లే సైజు కూడా అలానే ఉంటుందని అంచనా. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా 6.9-అంగుళాల క్యూహెచ్‌డీ శాంసంగ్ M14 ఓఎల్ఈడీ ప్యానెల్‌ ఉండవచ్చు.

Read Also : Most Powerful Phones : మొబైల్ లవర్స్ గెట్ రెడీ.. ఈ నెలలో రాబోయే టాప్ 5 పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. ఫీచర్లు చూస్తే ఫిదానే!

అయితే, స్టాండర్డ్ గెలాక్సీ S26 ఫోన్ 6.3-అంగుళాల క్యూహెచ్‌డీ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S26 ప్లస్ దాదాపు ఒకేలాంటి ఫీచర్లతో 6.7-అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్‌ ఉండొచ్చు. కెమెరా స్పెషిఫికేషన్లలో అల్ట్రా మోడల్ కూడా ఉండొచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రాలో 200MP ప్రైమరీ సెన్సార్‌తో క్వాడ్-కెమెరా సెటప్ ఉండొచ్చు. ఇందులో 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 12MP టెలిఫోటో లెన్స్ 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కూడా ఉండొచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S26 గెలాక్సీ S26 ప్లస్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ రెండు మోడళ్లలో 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ 3x ఆప్టికల్ జూమ్‌తో 12MP టెలిఫోటో కెమెరా ఉండవచ్చు.

భారత్‌లో గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్, గెలాక్సీ S26 అల్ట్రా లాంచ్ తేదీ, ధర (అంచనా) :

కొత్త లీక్ ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ ఫిబ్రవరి 25, 2026న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మార్చి ప్రారంభంలోనే సేల్స్ కూడా ఉండొచ్చు. గత ఏడాది ధరలను పరిశీలిస్తే.. భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S25 ధర రూ. 80,999 నుంచి ప్రారంభమైంది.

శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ ధర రూ. 99,999 వద్ద లాంచ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర రూ. 129,999కు పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ ధర కూడా ఇదే రేంజ్‌లో ఉంటుందని భావిస్తున్నారు.