Samsung Galaxy Event : శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్.. ఈరోజే 2 ఫోల్డబుల్ ఫోన్లు లాంచ్.. లాంచ్ లైవ్ స్ట్రీమింగ్‌ ఎలా చూడాలంటే?

Samsung Galaxy Event : శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ జూలై 2025 ఈవెంట్ ప్రారంభం కానుంది. గెలాక్సీ Z ఫోల్డ్ 7, ఫ్లిప్ 7 ఫోన్లు లాంచ్ కానున్నాయి.

Samsung Galaxy Event

Samsung Galaxy Event : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ జూలై 2025 ఈవెంట్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ లాంచ్ ఈవెంట్ సందర్భంగా శాంసంగ్ అనేక కొత్త శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేయనుంది.

ఇంకా మరెన్నో ప్రొడక్టులను రిలీజ్ చేసే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఫ్లిప్ 7 మోడల్ అద్భుతమైన ఫీచర్లతో రానుంది. లీక్‌లు, పుకార్లను పరిశీలిస్తే.. రాబోయే శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 ఫోన్ అత్యంత సన్నని ఫోల్డబుల్‌గా రాబోతుంది. ఫ్లిప్ 7 కూడా అద్భుతమైన స్పెషిఫికేషన్లతో లాంచ్ కానుంది. ఈ ఈవెంట్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి? :
శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం.. ఈరోజు (జూలై 9) రాత్రి 7:30కి ప్రారంభం కానుంది. ఆసక్తిగల వినియోగదారులు శాంసంగ్ అధికారిక యూట్యూబ్ ఛానెల్, అధికారిక వెబ్‌సైట్, శాంసంగ్ ఇండియా న్యూస్‌రూమ్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. ప్రస్తుతానికి, ఈ ఈవెంట్‌లో 3 శాంసంగ్ గెలాక్సీ (గెలాక్సీ Z Fold 7, Z Flip 7, Z Flip 7 FE) ఫోన్లను లాంచ్ చేసే అవకాశం ఉంది.

Read Also : Samsung Galaxy A55 5G : అమెజాన్ బంపర్ ఆఫర్.. భారీగా తగ్గిన శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్.. ఏకంగా రూ.12వేలు డిస్కౌంట్..!

శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ వివరాలివే :
శాంసంగ్ ఈవెంట్‌లో మొత్తం 3 ఫోన్‌లను లాంచ్ చేసే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7లో 200MP ప్రైమరీ షూటర్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను తీసుకురావచ్చు. ఈ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ రెండు డిస్‌‌ప్లే ప్యానెల్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌తో అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. హై-ఆక్టేన్ పర్ఫార్మెన్స్ కోసం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రానుంది.

మరోవైపు.. హై కెపాసిటీ ర్యామ్, స్టోరేజీ సామర్థ్యంతో ఎక్సినోస్ 2500 ప్రాసెసర్‌తో శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 లాంచ్ కానుంది. ఈ శాంసంగ్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో రెండు అమోల్డ్ ప్యానెల్‌లను (లోపలి, బయటి) కలిగి ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ FE వేరియంట్ విషయానికొస్తే.. గెలాక్సీ Flip 7 లైట్ వెర్షన్‌గా రానుంది.