Samsung Galaxy Z Series : శాంసంగ్ గెలాక్సీ నుంచి మడతబెట్టే ఫోన్లు ఇవే.. జూలై 26నే Z సిరీస్ లాంచ్.. సేల్ డేట్ ఎప్పుడో తెలిసిందోచ్..!
Samsung Galaxy Z Series : శాంసంగ్ గెలాక్సీ Z Fold 5, గెలాక్సీ Z Flip 5 సిరీస్ Qualcomm సరికొత్త, వేగవంతమైన ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoCతో వచ్చే అవకాశం ఉంది.

Samsung Galaxy Z Fold 5, Galaxy Z Flip 5 India Sale Date Tipped Ahead of July 26 Launch
Samsung Galaxy Z Series : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఈ జూలై 26 వరకు ఆగండి.. ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి సరికొత్త ఫోల్డబుల్ ఫోన్లు రానున్నాయి. ఈ నెల 26న అధికారింగా గ్లోబల్ మార్కెట్లో రెండు శాంసంగ్ Z సిరీస్ మడతబెట్టే ఫోన్లు లాంచ్ కానున్నాయి. అందులో Samsung Galaxy Z Fold 5, Samsung Galaxy Z Flip 5 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది.
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ( Samsung Galaxy Tab S9), S9తో సహా సియోల్‌లో జరిగే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో అనేక ఇతర డివైజ్‌లను ప్రకటించే అవకాశం ఉంది. గెలాక్సీ వాచ్ 6 సిరీస్ లీక్స్ ఇప్పటికే ఫోల్డబుల్స్ అనేక కీలకమైన డిజైన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను సూచించాయి. ఇటీవలే నివేదికలో కలర్ ఆప్షన్లు, హ్యాండ్‌సెట్‌ల ధరపై కూడా సూచించింది. ఇప్పుడు, కొత్త నివేదిక భారత మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌ల సేల్ తేదీని సూచిస్తుంది.
గెలాక్సీ Z Fold 5, Galaxy Z Flip 5 ఆగస్ట్ 14 నుంచి భారత మార్కెట్లో విక్రయించనున్నట్టు (91Mobiles) హిందీ రిపోర్టు సూచించింది. ఈ ఫోన్‌లు ఇప్పటికే ప్రీ-రిజర్వేషన్‌లకు రూ. 1999 ధరకు దేశవ్యాప్తంగా Samsung.com, Amazon, Flipkart, Samsung ప్రత్యేకమైన రిటైల్ స్టోర్‌ల ద్వారా అందుబాటులో ఉన్నాయి. కంపెనీ బెనిఫిట్స్ కింద హ్యాండ్‌సెట్‌లను ముందుగా రిజర్వ్ చేసుకున్న వారికి రూ. 5000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. కొత్త నివేదిక ప్రకారం.. ఈ హ్యాండ్‌సెట్‌లు లాంచ్ అయిన వెంటనే జూలై 26 నుంచి ప్రీఆర్డర్ కోసం అందుబాటులో ఉంటాయి.

Samsung Galaxy Z Fold 5, Galaxy Z Flip 5 India Sale Date Tipped Ahead of July 26 Launch
శాంసంగ్ గెలాక్సీ Z Fold 5 మొత్తం 3 స్టోరేజ్ వేరియంట్‌లలో లాంచ్ అవుతుందని నివేదిక సూచించింది. బేస్ 256GB వేరియంట్ EUR 1,899 (సుమారు రూ. 1,72,400) వద్ద లిస్టు అయింది. అయితే, 512GB, 1TB వేరియంట్‌లను వరుసగా EUR 2,039 (దాదాపు రూ. 1,85,100), EUR 2,279 (రూ, 2,06,900) వద్ద మార్క్ చేయవచ్చు.
ఈ హ్యాండ్‌సెట్ గెలాక్సీ Z ఫోల్డ్ 4 సక్సెసర్ కాగా, బ్లాక్, బ్లూ, క్రీమ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. మరోవైపు నివేదిక ప్రకారం.. క్రీమ్, గ్రాఫైట్, లావెండర్, వాటర్ గ్రీన్ కలర్ వేరియంట్‌లలో (Galaxy Z Flip 4) అందించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మోడల్ 256GB వెర్షన్ ధర EUR 1,199 (సుమారు రూ. 1,08,900), అయితే 512GB ఆప్షన్ EUR 1,339 (దాదాపు రూ. 1,21,600) వద్ద లిస్టు అయింది.
గెలాక్సీ Z Fold 5, Galaxy Z Flip 5 రెండూ Snapdragon 8 Gen 2 SoCతో వస్తాయని భావిస్తున్నారు. గెలాక్సీ Z Fold 5 7.6-అంగుళాల ఫుల్-HD+(1,812, 2,176 పిక్సెల్‌లు) డైనమిక్ AMOLED ప్రధాన డిస్‌ప్లే, 6.2-అంగుళాల డైనమిక్ AMOLED కవర్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. Galaxy Z Flip 5 6.7-అంగుళాల ఫుల్-HD+ (1,080, 2,640 పిక్సెల్‌లు) డైనమిక్ AMOLED ప్రైమరీ ప్యానెల్, 3.4-అంగుళాల ఔటర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.