Samsung Galaxy Z Series : వావ్.. శాంసంగ్ నుంచి మతిపోగొట్టే ఫీచర్లతో 2 మడతబెట్టే ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Samsung Galaxy Z Series : శాంసంగ్ రెండు ఫోల్డబుల్ ఫోన్లను తీసుకొస్తోంది. గెలాక్సీ Z ఫోల్డ్ 7, గెలాక్సీ Z ఫ్లిప్ 7 మోడళ్లను లాంచ్ చేయనుంది.

Samsung Galaxy Z Series

Samsung Galaxy Z Series : శాంసంగ్ కొత్త ఫోన్ కొంటున్నారా? సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నెక్స్ట్ (Samsung Galaxy Z Series) ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది.

Read Also : iPhone 16 Pro : ఐఫోన్ యూజర్లకు పండగే.. ఐఫోన్ 16ప్రోపై అద్భుతమైన డిస్కౌంట్.. ధర ఎంత తగ్గిందంటే?

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7, శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 రెండు మడతబెట్టే ఫోన్లను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. దీనిపై కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఈ రెండు ఫోల్డబుల్‌ ఫోన్లు జూలై 2025లో జరగబోయే శాంసంగ్ నెక్స్ట్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. పుకార్లు నిజమైతే.. శాంసంగ్ మొట్టమొదటి ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా రిలీజ్ చేయనుంది.

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7, శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 స్పెక్స్, ధర (అంచనా) :
శాంసంగ్ మడతబెట్టే ఫోన్ 8.2-అంగుళాల ఇన్నర్ అమోల్డ్ డిస్‌ప్లే, 6.5-అంగుళాల ఔటర్ అమోల్డ్ డిస్‌ప్లే ఉండొచ్చు. ఈ ఫోల్డబుల్ ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.

12GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజీతో వస్తుందని భావిస్తున్నారు. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. 200MP మెయిన్ బ్యాక్ కెమెరా ఉండొచ్చు.

12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 10MP టెలిఫోటో సెన్సార్ సపోర్టుతో పాటు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10MP, 4MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉండవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ 4,400mAh బ్యాటరీతో వస్తుంది.

ధర విషయానికి వస్తే.. భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌ దాదాపు రూ.1,64,999 ధర ఉంటుందని అంచనా.

శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 స్పెషిఫికేషన్లు, ధర (అంచనా) :
ఈ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ 4-అంగుళాల ఔటర్ డిస్‌ప్లే, 6.7-అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, శాంసంగ్ ఎక్సినోస్ 2500 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందవచ్చు.

ఈ మడతబెట్టే ఫోన్ 12GB ర్యామ్, 512GB వరకు స్టోరేజ్‌తో రానుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,000mAh బ్యాటరీని అందించనుంది.

Read Also : OnePlus 13 Price : వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రూ. 10వేలు తగ్గింపుతో వన్‌ప్లస్ 13 కొనేసుకోండి..!

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 లో 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ యూజర్లు 10MP సెల్ఫీ కెమెరాను చూడవచ్చు. ధర విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 ధర భారత మార్కెట్లో దాదాపు రూ.1,09,999గా ఉంటుందని అంచనా.