Samsung Neo QLED TV : శాంసంగ్ నుంచి కొత్త ప్రీమియం నియో QLED TV స్మార్ట్‌టీవీ వచ్చేసింది.. ఫీచర్లు, ధర ఎంతంటే?
Samsung Neo QLED TV : సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి కొత్త ప్రీమియం QLED TV నియో స్మార్ట్‌టీవీ వచ్చేసింది. కొత్త 98-అంగుళాల సైజుతో లాంచ్ చేసింది. ఇందులో ధర ఎంతంటే?

Samsung Neo QLED TVs launched in India with 8K and 4K resolution_ Price and features
Samsung Neo QLED TV : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) ఎట్టకేలకు భారత మార్కెట్లో ప్రీమియం (Neo QLED TV)లను ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో CES 2023లో ప్రదర్శించింది. కంపెనీ వివిధ సైజుల్లో సరికొత్త 8K TV మోడల్‌లను ఆవిష్కరించింది. ఈ ఏడాదిలో కొత్త 98-అంగుళాల సైజుతో ప్రవేశపెట్టింది. 4K రిజల్యూషన్‌కు సపోర్టుతో 98-అంగుళాల టీవీలను విక్రయించవచ్చు. కానీ, హై రిజల్యూషన్‌లో కాదు.. కొత్త ఆఫర్‌తో యూజర్లు పవర్‌ఫుల్ కలర్లు క్లియర్ ఫొటో క్వాలిటీతో స్క్రీన్‌ను పొందవచ్చునని శాంసంగ్ పేర్కొంది. కొత్త Neo QLED మోడల్‌లు Quantum MiniLED-లైట్ ప్యానెల్‌లను అందిస్తాయి. థర్డ్-పార్టీ అప్లియన్సెస్ (IoT) డివైజ్‌లను కంట్రోల్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
భారత్‌లో శాంసంగ్ Neo QLED 8K TV ధర ఎంతంటే? :
కొత్తగా ప్రారంభమైన Neo QLED 8K TVలు వివిధ సైజుల్లో వస్తాయి. QN990C (98-అంగుళాల), QN900C (85-అంగుళాల), QN800C (75, 65-అంగుళాల), QN700C (65-అంగుళాల) ధర రూ. 3,14,990 నుంచి ప్రారంభమవుతుంది. శాంసంగ్ కంపెనీ QN95C (65, 55-అంగుళాల), QN90C (85-, 75, 65, 55, 50-అంగుళాల), QN85C (65, 55-అంగుళాల)లో శాంసంగ్ నియో QLED 4K టీవీల కొత్త సెట్‌ను కూడా ఆవిష్కరించింది.
శాంసంగ్ నియో టీవీల ధర రూ. 1,41,990 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ టీవీలలో అన్ని శాంసంగ్ రిటైల్ స్టోర్‌లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ స్టోర్‌లు, శాంసంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్, శాంసంగ్ షాప్‌తో సహా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటాయి. మే 25లోపు కొత్త టీవీలను కొనుగోలు చేసే యూజర్లు ఎంపిక చేసిన Neo QLED 8K టీవీలతో రూ.99,990 విలువైన శాంసంగ్ Soundbar HW-Q990ని Neo QLED 4K టీవీలతో రూ. 44,990 విలువైన Samsung Soundbar HW-Q800ని పొందవచ్చు.
శాంసంగ్ కొత్త 2023 Neo QLED 8K TVs స్పెసిఫికేషన్‌లివే :
ఈ లేటెస్ట్ టీవీలు శాంసంగ్ ఇన్ఫినిటీ స్క్రీన్ & ఇన్ఫినిటీ వన్ డిజైన్‌తో వస్తాయి. ప్రాథమికంగా అల్ట్రా స్లిమ్ ప్రొఫైల్‌ని పొందవచ్చు. కొత్తగా ప్రారంభించిన Samsung Neo QLED TV Samsung అధునాతన న్యూరల్ క్వాంటం ప్రాసెసర్‌తో ఆధారితమైనది. గత మోడళ్ల మాదిరిగానే చిప్ 14-బిట్ ప్రాసెసింగ్, AI అప్‌స్కేలింగ్‌తో క్వాంటమ్ మినీ LED-లైట్ టీవీకి సపోర్టు ఇస్తుంది. శాంసంగ్ కొత్త ఆటో HDR రీమాస్టరింగ్‌తో వస్తుంది. స్టాండర్డ్ డైనమిక్ రేంజ్ (SDR) కంటెంట్‌పై రియల్-టైమ్ హై డైనమిక్ రేంజ్ (HDR)ను పొందవచ్చు. అలాగే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగిస్తుందని కంపెనీ తెలిపింది. SDR కంటెంట్‌ను సంపూర్ణంగా ఇమ్మర్షన్‌గా మార్చడంలో సాయపడుతుందని శాంసంగ్ పేర్కొంది.

Samsung Neo QLED TVs launched in India with 8K and 4K resolution_ Price and features
ఆసక్తికరంగా, శాంసంగ్ నుంచి కొత్త QLED TV మోడల్‌లు కూడా ఇంటర్నల్ Zigbee, మ్యాటర్ థ్రెడ్ వన్-చిప్ మాడ్యూల్‌ను కలిగి ఉన్నాయి. శాంసంగ్ డివైజ్‌లను కంట్రోల్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. థర్డ్-పార్టీ స్మార్ట్ హోమ్ డివైజ్‌లను మెరుగైన సౌకర్యవంతగా అనుమతిస్తుంది. 2023 నియో QLED టీవీ మోడల్‌లు శాంసంగ్ ఎకో-ప్యాకేజింగ్‌లో కనిష్ట ప్రింట్‌లతో వస్తాయని చెప్పింది. టెక్ దిగ్గజం ప్రీమియం టీవీతో పాటు సౌరశక్తితో నడిచే రిమోట్ కంట్రోల్‌ను కూడా అందిస్తుంది. రిమోట్ రీసైకిల్ చేసిన ఓషన్-బౌండ్ ప్లాస్టిక్‌తో తయారైందని శాంసంగ్ తెలిపింది.
శాంసంగ్ యూజర్లు అత్యధిక 8K కంటెంట్ ఎక్స్‌పీరియన్స్ పొందడానికి కస్టమైజ్ చేసిన సిఫార్సులతో (Samsung TV Plus)లో 100 ఉచిత టీవీ ఛానెల్‌లకు కూడా యాక్సెస్‌ను పొందవచ్చు. శాంసంగ్ నియో QLED 8K టీవీలు మోషన్ ఎక్స్‌లరేటర్ టర్బో ప్రోతో విజువల్స్, హై-స్పీడ్ గేమింగ్ బ్లేజింగ్-ఫాస్ట్ స్పీడ్‌లను అందిస్తుంది. గేమ్ మోషన్ ప్లస్ మోడ్, సున్నితమైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ 144Hz వరకు సపోర్ట్ కూడా అందిస్తుంది.