Samsung One UI 7 update
Samsung One UI 7 : శాంసంగ్ లవర్స్‌కు బిగ్ అలర్ట్.. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ అధికారికంగా గెలాక్సీ S24 సిరీస్ కోసం ఆండ్రాయిడ్ 15-ఆధారిత వన్ యూఐ 7 అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. లేటెస్ట్ అప్‌డేట్‌లో కంపెనీ అధికారికంగా గెలాక్సీ S23 అల్ట్రా, గెలాక్సీ S23 ప్లస్, గెలాక్సీ S23, గెలాక్సీ S24 FE కోసం స్టేబుల్ వన్ యూఐ 7 అప్‌డేట్‌ను రిలీజ్ చేయడం ప్రారంభించింది.
అదనంగా, ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్ క్రమంగా గెలాక్సీ Z ఫ్లిప్ 5, శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5 అందుబాటులోకి వస్తోంది. అయితే, భారత మార్కెట్లో వన్ యూఐ 7 రిలీజ్ టైమ్‌లైన్ గురించి ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం ఈ కొత్త అప్‌డేట్ కొరియా యూజర్లకే పరిమితమైంది.
ఏప్రిల్ చివరినాటికి అందుబాటులోకి :
దక్షిణ కొరియాలోని బీటాయేతర యూజర్లందరూ One UI 7 అప్‌డేట్‌ను అందుకుంటున్నారని టిప్‌స్టర్ తరుణ్ వాట్స్ పేర్కొన్నారు. శాంసంగ్ యూజర్ల కోసం ఆండ్రాయిడ్ 15 గ్లోబల్ రోల్అవుట్ టైమ్‌లైన్‌పై అధికారిక సమాచారం లేనప్పటికీ, లీకైన డేటా ప్రకారం.. వన్ UI 7 అప్‌డేట్ ఏప్రిల్ చివరి నాటికి అందుబాటులోకి వస్తుంది. ఈ అప్‌డేట్ ఇప్పుడు S918NKSU6DYD9, S918NOKR6DYD9, S918NKSU6DYD9 అనే బిల్డ్ నంబర్ల కింద యూజర్లకు అందుబాటులో ఉంది.
ఈ కొత్త అప్‌డేట్ 5GB కన్నా ఎక్కువ. మీరు మీ ఫోన్‌లో కొంత స్టోరేజీ ఖాళీ చేయాల్సి ఉంటంది. మీరు బీటా ప్రోగ్రామ్‌లో రిజిస్టర్ చేసుకుంటే.. అప్‌డేట్ దాదాపు 1GB ఉంటుంది. నివేదికల ప్రకారం.. One UI 7 స్టేబుల్ అప్‌డేట్ మొదట వన్ UI 7 బీటా ప్రోగ్రామ్‌లో రిజిస్టర్ చేసుకున్న ఫోన్లకు అందుబాటులో ఉంది. అయితే, బీటా కాని యూజర్లు ఇప్పుడు ఏప్రిల్ 2025 సేఫ్టీ ప్యాచ్‌తో అప్‌డేట్ అందుకుంటున్నారు. అంటే.. ఈ కొత్త అప్‌డేట్ త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.
కొత్త ఫీచర్ల విషయానికి వస్తే.. :
One UI 7 అప్‌డేట్‌లో కొత్త ఐకాన్స్, ఎలిమెంట్స్, డిజైన్‌లు అలాగే కొన్ని కస్టమైజడ్ ఆప్షన్లు ఉంటాయి. యాక్సెసిబిలిటీని అప్‌గ్రేడ్ కోసం అప్‌డేట్‌లో (Now Bar) కూడా ఉంటుంది. రైటింగ్ టూల్స్, సర్కిల్ టు సెర్చ్ వంటి గెలాక్సీ ఏఐ ఫీచర్లు అప్‌గ్రేడ్ అవుతాయి. కొత్త అప్‌డేట్‌లో యూజర్ ఇంటర్‌ఫేస్‌లో మార్పులతో రియల్-టైమ్ డేటాను అందించే అదనపు టూల్స్ కూడా ఉంటాయి.