Signal Group Video Call : తగ్గేదే లే.. వాట్సాప్‌కు పోటీగా.. సిగ్నల్ గ్రూప్ వీడియో కాల్ లిమిట్ పెంచింది..!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు పోటీగా మరో మెసేజింగ్ యాప్ సిగ్నల్ సరికొత్త అప్ డేట్ తీసుకొచ్చింది. ఇప్పటివరకూ ఉన్న గ్రూపు వీడియో కాల్ లిమిట్ 40 మంది యూజర్లకు పెంచేసింది సిగ్నల్.

Signal Increases Group Video Call Limit To 40 Users, Says It Could Allow More Users To Join In The Future
Signal Group Video Call : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు పోటీగా మరో మెసేజింగ్ యాప్ సిగ్నల్ సరికొత్త అప్ డేట్ తీసుకొచ్చింది. ఇప్పటివరకూ ఉన్న గ్రూపు వీడియో కాల్ లిమిట్ 40 మంది యూజర్లకు పెంచేసింది సిగ్నల్. ప్రైవసీకే పెద్దపీట వేసే మెసేజింగ్ యాప్.. తన ప్లాట్ ఫాంపై యూజర్ల సంఖ్యను పెంచుకుంటోంది. అన్ని కమ్యూనికేషన్‌లపై ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేసినట్టుగా ధ్రువీకరించింది. యూజర్ల ప్రైవసీ విషయంలో ఎంతమాత్రం రాజీ పడటం లేదు. గ్రూపు కాల్‌లోని కంటెంట్‌లను ఇతర పార్టిసిపెంట్‌లకు ఫార్వార్డ్ చేసే సర్వర్‌ల ద్వారా కాల్ వెళ్లేందుకు వీలుగా “Selective Forwarding” టెక్నాలజీని ఉపయోగించినట్లు సిగ్నల్ పేర్కొంది. ప్రస్తుతం సిగ్నల్ Android iOS వెర్షన్‌లకు అందుబాటులోకి వస్తోంది. గ్రూపు కాల్ లిమిట్ మాత్రమే సవరించామని, అధిక సర్వర్ CPU వినియోగం కారణంగా గతంలో యూజర్ల లిమిట్ పెంచలేకపోయామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
అయితే ఇప్పుడు ఎక్కువ మంది పాల్గొనేలా కొత్త సెలెక్టివ్ ఫార్వార్డింగ్ యూనిట్ (SFU)ని ప్రవేశపెట్టినట్టు సిగ్నల్ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. 9 నెలలుగా సిగ్నల్ గ్రూప్ కాల్‌లను అందజేస్తోందని 40 మంది పాల్గొనేవారి వరకు లిమిట్ అందిస్తోందని, భవిష్యత్తులో మరింత మంది యూజర్లకు గ్రూపు కాల్ లిమిట్ పెంచనున్నట్టు వెల్లడించింది. ఇటీవలే.. WhatsApp గ్రూపు కాల్‌కు అనేక కొత్త ఫీచర్లను జోడించింది. ఇప్పటికీ వీడియో కాల్‌లో 8 మంది సభ్యులకు మాత్రమే సపోర్టు ఇస్తుంది. మెసేజింగ్ యాప్ యూజర్‌లు గ్రూప్ కాల్‌ని మిస్ అయినా కూడా వాట్సాప్ గ్రూప్‌కి కాల్ చేయడానికి గ్రూప్ చాట్ విండో నుంచి యాడ్ చేసేందుకు అనుమతిస్తుంది. యూజర్లు ఇప్పుడు గ్రూప్ చాట్ ఐకాన్ దగ్గర ప్రత్యేక బటన్ ద్వారా యాడ్ కావొచ్చు. అయితే టెలిగ్రామ్, జూలైలో, 1000 మంది యూజర్లు గ్రూప్ వీడియో కాల్‌లో చేరే సామర్థ్యాన్ని యాడ్ చేసింది. వీడియో మెసేజ్‌లు పంపడానికి వీలుగా యూజర్లను అనుమతించింది. ఏదైనా వీడియో కాల్‌లో లైవ్ చేస్తున్నప్పుడు యూజర్లు వారి డివైజ్‌ల్లో ఒకరితో ఒకరు కాల్‌లలో స్క్రీన్‌లను షేర్ చేసుకునే వీలు కల్పిస్తుంది.
Meta (గతంలో Facebook) యాజమాన్యంలోని WhatsApp వివాదాస్పద సేవా నిబంధనల నేపథ్యంలో.. సిగ్నల్ భారతదేశంలో భారీగా ప్రజాదరణ పొందింది. కొద్ది కాలం పాటు.. దేశంలో యాప్ స్టోర్‌లో సిగ్నల్ నంబర్ వన్ యాప్‌గా నిలిచింది. సిగ్నల్ సర్వర్‌లకు వాయిస్ కాల్‌లను లైవ్ చేయడానికి యూజర్లకు అనుమతినిచ్చింది. యూజర్ల ప్రైవసీ కాంటాక్టుల వివరాలను హైడ్ చేసింది. సిగ్నల్ కాల్‌లు మెసేజ్ ఎన్‌క్రిప్షన్‌ను కలిగి ఉంటాయని సిగ్నల్ స్పష్టం చేసింది. యూజర్లు తమ మెటాడేటాను కూడా ఎన్‌క్రిప్ట్ చేస్తుందని చెబుతోంది. సిగ్నల్ సీల్డ్ ఫీచర్ ద్వారా యూజర్లు.. ఎవరు ఎవరికి మెసేజ్ పంపుతున్నారో గుర్తించలేరు. సిగ్నల్ డిఫాల్ట్‌గా అన్ని స్థానిక ఫైల్‌లను 4-సంఖ్యల పాస్‌ఫ్రేజ్‌తో హైడ్ చేస్తుంది. యూజర్ల డివైజ్‌లోనే ఎన్‌క్రిప్టెడ్ లోకల్ బ్యాకప్‌ను క్రియేట్ చేస్తుంది. సిగ్నల్ యాప్ ఇప్పుడు ఎన్‌క్రిప్టెడ్ గ్రూప్ కాల్‌లకు కూడా సపోర్ట్ చేస్తుందని సిగ్నల్ పేర్కొంది.
Read Also : Xiaomi 12 Features Leak : ట్రిపుల్ కెమెరాలతో Xiaomi 12 స్మార్ట్ ఫోన్ వస్తోంది.. ధర, ఫీచర్లు లీక్!