Online Festive Sale: గంటకు రూ.68కోట్ల స్మార్ట్ ఫోన్లు.. ఫస్ట్ వీక్‌లో రూ.32వేల కోట్లు..!

ఆన్‌లైన్ ఫెస్టివల్ సీజన్ అదిరిపోయింది. ఈ-కామర్స్ దిగ్గజాలకు పండుగ సీజన్ బాగా కలిసొచ్చింది. తొలి వారంలోనే వేలకోట్లలో సేల్స్ నిర్వహించినట్టు నివేదిక వెల్లడించింది.

Smartphones Online Festive Sale : ఆన్‌లైన్ ఫెస్టివల్ సీజన్ అదిరిపోయింది. ఈ-కామర్స్ దిగ్గజాలకు పండుగ సీజన్ బాగా కలిసొచ్చింది. ప్రముఖ కన్సెల్టింగ్‌ సంస్థ రెడ్‌సీర్‌ (RedSeer) నివేదిక ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్ (Flipkart), అమెజాన్‌ (Amazon)లు ఫెస్టివల్‌ సేల్స్‌ ప్రారంభించాయి. తొలి వారంలోనే వేలకోట్లలో సేల్స్ నిర్వహించినట్టు నివేదిక వెల్లడించింది. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 10 వరకు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహించింది. అక్టోబర్ 4 నుంచి గ్రేట్ ఇండియా ఫెస్టివల్‌ సేల్‌ను అమెజాన్ ప్రారంభించింది.

ఈ రెండింటి సేల్‌ నెల రోజుల పాటు అందుబాటులో ఉండనుంది. దసరా పండుగ సీజన్ లో ఈ రెండు కంపెనీల సేల్స్ వివరాలను రెడ్‌సీర్‌ నివేదిక విడుదల చేసింది. అందులో ఎక్ఛేంజ్‌ ఆఫర్లు, డిస్కౌంట్లు, భారీ కొనుగోళ్లు జరిపినట్టు తెలిపింది. మొదటి వారంలోనే రూ. 32 వేల కోట్లు (4.6 బిలియన్ డాలర్లు) సేల్స్ జరిగాయి. అలాగే ప్రతి గంటకు రూ. 68 కోట్ల స్మార్ట్‌ ఫోన్లు అమ్ముడైనట్లు నివేదిక వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన 32 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
Devaragattu Bunny Fight: బన్నీ ఉత్సవం.. చితక్కొట్టుకున్నారు!

ఈ ఏడాదిలో అమెజాన్‌ కంటే ఫ్లిప్‌కార్ట్ సేల్స్ అధికంగా జరిపినట్లు రెడ్ సీర్ వెల్లడించింది. పండుగ సేల్స్‌లో ఫ్లిప్‌ కార్ట్‌ మార్కెట్ వాటా 64 శాతానికి చేరింది. అమెజాన్‌ వాటా అంతకంటే చాలా తక్కువగా ఉందని వెల్లడించింది. కరోనా సమయంలో 2020 ఏడాదిలోనూ కొనుగోళ్లు భారీ తగ్గాయి. ఈ ఏడాది 2021లో మాత్రం అమ్మకాలు జోరుగా పెరిగాయి.

టైర్ -2, టైర్ -3 సిటీల నుంచిపెద్ద సంఖ్యలో కొత్త కస్టమర్లు కొనుగోళ్లు చేశారు. టైర్ -2 కస్టమర్లలో 61 శాతం కొత్త కస్టమర్లే ఉన్నారు. గతేడాది ప్రతి కస్టమర్ కొనుగోలుకు సగటు స్థూల వస్తువుల విలువ రూ.4980గా నమోదైంది. ఈ 2021 ఏడాదిలో రూ .5034 అమ్మకాలు పెరిగినట్లు రెడ్‌సీర్ నివేదిక వెల్లడించింది.
Big Boss 5: అడిగి మరీ ప్రపోజ్ చేయించుకున్న పింకీ.. అలకబూనిన సిరి

ట్రెండింగ్ వార్తలు