కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు సిద్ధంగా ఉంది భయ్యా.. ఫీచర్లు కెవ్వుకేక..

ఈ ఫోన్‌ 12GB ర్యామ్‌తో వచ్చే అవకాశం ఉంది.

కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు సిద్ధంగా ఉంది భయ్యా.. ఫీచర్లు కెవ్వుకేక..

Updated On : May 2, 2025 / 8:43 PM IST

సోనీ కొత్త స్మార్ట్‌ఫోన్ Xperia 1 VII లాంచ్‌కు సిద్ధంగా ఉంది. ఇది గత సంవత్సరం వచ్చిన Xperia 1 VIకి తదుపరి వెర్షన్‌గా వస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ Snapdragon 8 Elite ప్రాసెసర్, 12GB RAM, Android 15తో రానుంది.

సోనీ XQ-FS54 మోడల్ నంబర్‌తో ఒక ఫోన్ Geekbench వెబ్‌సైట్లో సోనీ కొత్త స్మార్ట్‌ఫోన్ Xperia 1 VII పేరు నమోదు అయింది. ఇది Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో వస్తోంది. ఇందులో 8 కోర్లు ఉన్నాయి.

ఇందులో 2 కోర్లు 4.32GHz వేగంతో, మిగతా 6 కోర్లు 3.53GHz వేగంతో పనిచేస్తాయి. ఇది సోనీ నుంచి ఈ చిప్‌ వాడుతున్న తొలి ఫోన్. ఈ ఫోన్‌ 12GB ర్యామ్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇది Android 15తో రన్ అవుతుంది.

Xperia 1 VII స్పెసిఫికేషన్లు

6.5-inch డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది (Xperia 1 VI లాగే)
బెజెల్స్ ఉండే అవకాశం ఉంది
బ్యాక్‌సైడ్ మూడు కెమెరాలతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండొచ్చు
ఈ పై సెటప్ వర్టికల్ లైన్‌లో ఉండొచ్చు
ఇందులో ఒకటి పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండవచ్చు
దీని వల్ల జూమ్ మెరుగ్గా ఉంటుంది
అదనంగా ఆటోఫోకస్ LED ఫ్లాష్, ఇతర సెన్సార్లు ఉండే అవకాశం ఉంది

డిజైన్ వివరాలు
సైజు: 161.9 x 74.5 x 8.5 mm
ఫోన్‌ కుడి వైపు: పవర్ బటన్, వాల్యూమ్ బటన్‌లు, ప్రత్యేకంగా కెమెరా షట్టర్ బటన్ ఉండొచ్చు

మరిన్ని ఫీచర్లు
రెండు ఫ్రంట్ స్పీకర్లు
3.5mm హెడ్‌ఫోన్ జాక్
USB Type-C పోర్ట్ ఛార్జింగ్

సోనీ ఇంకా అధికారిక లాంచ్ తేదీ ప్రకటించలేదు. కానీ గత సంవత్సరం Xperia 1 VI 2024 మేలో విడుదల అయింది. Xperia 1 VII కూడా 2025 మేలో విడుదల అయ్యే అవకాశం ఉంది.