Spark Go: డైనమిక్ పోర్ట్‌తో కేవలం రూ.6699లకే 90hz DOT ఇన్ డిస్‌ప్లేలో స్పార్క్ గో 2024

స్పార్క్ గో 2024 డిసెంబర్ 7, 2023 నుండి సమీపంలోని రిటైల్ అవుట్‌లెట్‌లు, అమెజాన్ లో అందుబాటులో ఉంటుంది.

Spark Go: డైనమిక్ పోర్ట్‌తో కేవలం రూ.6699లకే 90hz DOT ఇన్ డిస్‌ప్లేలో స్పార్క్ గో 2024

Updated On : December 12, 2023 / 9:19 PM IST

గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ టెక్నో తమ నూతన స్పార్క్ గో 2024ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 6,699 నుండి ప్రారంభమవుతుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. స్పార్క్ గో సిరీస్ 2020లో ఆవిష్కరించిన నాటి నుంచి ఇది మొత్తం గేమ్-ఛేంజర్‌గా మారింది. దీనిని భారతీయ అభిరుచులకు తగినట్లుగా రూపొందించారు. స్పార్క్ గో 2024లో 3GB RAM+64GB ROM వేరియంట్ కేవలం INR 6699తో వస్తుంది!

టెక్నో మొబైల్ ఇండియా సీఈఓ అరిజీత్ తలపత్రా మాట్లాడుతూ.. “విప్లవాత్మకమైన స్పార్క్ గో 2024 విడుదల దేశం అంతటా సాంకేతికతను ప్రోత్సహించే మా విస్తృత మిషన్‌లో కీలకమైన పురోగతి. డిజిటల్ విభజనను తగ్గించడంలో మా అచంచలమైన నిబద్ధత, అధునాతన సాంకేతికతను ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చూడాలనే మా అంకితభావం. స్పార్క్ గో 2024 ప్రతి భారతీయునికి సాధికారత కల్పించాలనే మా అన్వేషణకు నిదర్శనంగా నిలుస్తుంది” అని అన్నారు.

స్పార్క్ గో 2024 డిసెంబర్ 7, 2023 నుండి సమీపంలోని రిటైల్ అవుట్‌లెట్‌లు, అమెజాన్ లో అందుబాటులో ఉంటుంది.