Android Wifi Boost : మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో Wifi సిగ్నల్ బూస్ట్ చేసుకోండిలా..!

Android Wifi Boost : మీ ఇంట్లో వైఫై కనెక్షన్ వాడుతున్నారా? మీ ఫోన్ వైఫై కనెక్షన్ చాలా స్లోగా ఉంటుందా? మీ స్మార్ట్ ఫోన్ వైఫైకి కనెక్ట్ చేసినప్పుడు నెట్ స్పీడ్ బూస్ట్ చేసుకోవచ్చు.

Android Wifi Boost : మీ ఇంట్లో ఇంటర్నెట్ ఉందా? వైఫై కనెక్షన్ వాడుతున్నారా? అయితే మీ ఫోన్ వైఫై కనెక్షన్ చాలా స్లోగా ఉంటుందా? మీ స్మార్ట్ ఫోన్ వైఫైకి కనెక్ట్ చేసినప్పుడు స్పీడ్ చాలా తక్కువగా ఉంటుందా? అయితే ఈ టిప్స్ ఓసారి ఫాలో అవ్వండి.. మీ ఫోన్ వైఫై బూస్ట్ అవుతుంది. ఇంటర్నెట్ వేగం కూడా బాగా పెరుగుతుంది. సాధారణంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను ఇంటర్నెట్ కనెక్ట్ చేసినప్పుడు సిగ్నల్స్ చాలా తక్కువగా వస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో వైఫై సిగ్నల్స్ ను చాలా సింపుల్ గా బూస్ట్ చేసుకోవచ్చు. మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ Wifi కి కనెక్ట్ చేసినప్పుడు సిగ్నల్ తక్కువగా వస్తుంటే మాత్రం మీరు కూడా ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి..

మీరు చేయాల్సిందిల్లా మీ ఇంట్లోని రూటర్ ఉంటే దాన్ని రీసెట్ చేయడమే.. ముందుగా రూటర్ కు పవర్ సప్లయ్ ఆపేయండి. ఆ తర్వాత దాని ప్లగ్ తొలగించండి.. కొన్ని నిమిషాల పాటు అన్ని ప్లగ్స్ తీసేయండి. కొద్ది సేపటి తర్వాత ప్లగ్స్ అన్ని కనెక్ట్ చేసి రూటర్ రీస్టార్ట్ చేయండి. మీరు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమింటంటే.. మీ ఇంట్లో రూటర్ సమీపంలోనే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఉండాలి. లేదంటే మీ ఫోన్ ను సిగ్నల్స్ చేరే క్రమంలో ఏదైనా వస్తువు అడ్డుగా ఉంటే సిగ్నల్స్ సరిగా చేరవు. దాంతో మీకు ఇంటర్నెట్ చాలా తక్కువగా వస్తుంటుంది.

Steps To Increase Wifi Range On Your Android Mobile And Boost Signals 

అందుకే రూటర్ కు మీ స్మార్ట్ ఫోన్ కు మధ్య దూరం చాలా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. మీరు రూటర్ రీస్టార్ చేసే సమయంలోనే మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కూడా ఓసారి స్విచ్ఛాప్ చేసి మళ్లీ ఆన్ చేయండి. ఆ తర్వాతే రూటర్ కు స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేయండి. ఇప్పుడు అంతకుముందు ఉన్న వైఫై స్పీడ్ కంటే చాలా స్పీడ్ గా ఉంటుంది ఇంటర్నెట్.. ఈ ఇంట్లో వైఫై ఇంటర్నెట్ స్పీడ్ సమస్య తగ్గిపోయినట్టే. ఓసారి చెక్ చేసుకోండి..

Read Also : Wifi Safety: వైఫై స్లో అయిందా.. ఇలా చేయండి

ట్రెండింగ్ వార్తలు