PAN-Aadhaar : ఇంకా మీ పాన్ – ఆధార్ లింక్ చేయలేదా? ఈ తేదీలోగా వెంటనే చేసేయండి..!

PAN-Aadhaar : మీ పాన్ - ఆధార్ కార్డులను లింక్ చేశారా? లేదంటే వెంటనే లింక్ చేయండి.. ఎందుకంటే గడువు తేదీ ముగుస్తోంది. మార్చి 31లోగా ఆధార్- పాన్ కార్డులను తప్పనిసరిగా లింక్ చేయాలి.

PAN-Aadhaar : మీ పాన్ – ఆధార్ కార్డులను లింక్ చేశారా? లేదంటే వెంటనే లింక్ చేయండి.. ఎందుకంటే గడువు తేదీ ముగుస్తోంది. మార్చి 31లోగా ఆధార్- పాన్ కార్డులను తప్పనిసరిగా లింక్ చేయాల్సి ఉంటుంది. అంటే.. ఒకరోజు సమయం మాత్రమే ఉంది. ఆ తర్వాత మీకు పాన్ కార్డు నిరూపయోగమయ్యే ఛాన్స్ ఉంది.. జూలై 1, 2017 నాటికి పాన్ నంబర్ జారీ అయిన వారి పేరు మీద ఆధార్ నంబర్ ఉన్న ప్రతి ఒక్కరూ మార్చి 31లోగా రెండింటిని లింక్ చేయాల్సి ఉంటుంది. పాన్ ఆధార్ లింక్ చేయాలంటే ఆదాయపు పన్ను ఫైలింగ్ వెబ్ సైట్లోకి కూడా వెళ్లవచ్చు.

పాన్ ఆధార్ లింక్ గడువు దగ్గర పడిన నేపథ్యంలో ఇంటర్నెట్ సర్వీసు లేకుండానే ఆఫ్ లైన్‌లోనూ మీ పాన్ (పర్మినెంట్ అకౌంట్ నంబర్) ఆధార్ నంబర్‌ను లింక్ చేసుకోవచ్చు. ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం ఈ ఫెసిలిటీని తీసుకొచ్చారు. ఫీచర్ ఫోన్ ద్వారా పాన్ ఆధార్ కార్డులను అనుసంధానం చేయడానికి ఇంటర్నెట్ అవసరం లేదు. మీరు చేయాల్సిందిల్లా.. మీ పాన్ ఆధార్ నంబర్ పంపడటమే.. ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే పాన్ ఆధార్ లింక్ చేయడానికి ఈ కింది విధంగా ప్రయత్నించండి.

SMS ద్వారా పాన్ ఆధార్ లింక్ చేయండిలా..
1. మీ స్మార్ట్‌ఫోన్‌లో Text Message యాప్‌ను ఓపెన్ చేయండి.
2. మీ ఆధార్ పాన్ నంబర్‌ను (UIDPAN) ఫార్మాట్‌లో టైప్ చేయండి
3. మీరు మెసేజ్‌లో ఎంటర్ చేసిన నంబర్‌ను మళ్లీ చెక్ చేయండి.
4. ఆ తర్వాత ఆ మెసేజ్‌ను మీ ఫీచర్ ఫోన్ నుంచి 567678 లేదా 56161కి పంపండి.
5. అంతే.. మీ పాన్ ఆధార్ లింక్ అయినట్టే..
ఆధార్ పాన్ కార్డు లింక్ చేయడం ద్వారా ప్రభుత్వం అందించే అన్ని పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఆర్థిక బిల్లు ప్రకారం.. గడువు తేదీలోగా ఈ రెండు కార్డులను లింక్ చేయని ఎవరైనా రూ. 1,000 వరకు ఆలస్య రుసుము కింద చెల్లించాల్సి ఉంటుంది.

Still Not Linked Pan And Aadhaar Number Here’s How To Do So Through A Message

ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌లో పాన్ ఆధార్‌ను ఇలా లింక్ చేయాలి :

1. ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌కి వెళ్లండి
2. వెబ్‌సైట్‌లో ఇప్పటికే రిజిస్ట్రర్ చేయకుంటే ఇప్పుడు రిజిస్టర్ చేసుకోండి.
3. ఇదివరకే రిజిస్టర్ అయితే.. ఇక్కడ మీ పాన్ యూజర్ ఐడీ అవుతుంది.
4. లాగిన్ కోసం యూజర్ ID, పాస్‌వర్డ్ , పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి.
5. మార్చి 31లోపు మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలి.. ఒక ప్రాంప్ట్ పాప్-అప్ విండో కనిపిస్తుంది.
6. ఒకవేళ మీకు రాకుంటే.. మెనులోని ‘Profile Settings’కి వెళ్లండి.. ‘Link Aadhaar’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
7. పాన్ వివరాల ప్రకారం.. మీ పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలు నమోదు చేయండి.
8. మీ ఆధార్ కార్డ్‌లో స్క్రీన్‌పై చూపించిన పాన్ వివరాలను ధృవీకరించండి.
9 అన్ని వివరాలు సరిగా ఉండేలా చూసుకోండి.
10. మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, ‘Link Now’ బటన్‌పై క్లిక్ చేయండి.
11. మీ ఆధార్‌ను మీ పాన్‌కి లింక్ అయినట్టుగా పాప్-అప్ మెసేజ్ వస్తుంది.

Read Also : Aadhaar PAN Link : గడువు పొడిగించకపోతే మార్కెట్ మీద భారీ ప్రభావం పడుతుంది-సెబీకి లేఖ

ట్రెండింగ్ వార్తలు