Sudesi App : కార్పొరేట్ యాప్‌లకు పోటీగా ఆటోడ్రైవర్ల సొంత యాప్..!

కార్పొరేట్ యాప్ లకు పోటీగా ఆటోడ్రైవర్లంతా కలిసి సొంత యాప్ లాంచ్ చేశారు. అదే.. సుదేశీ యాప్ (Sudeshi App).

Sudesi App : కార్పొరేట్ యాప్ లకు పోటీగా ఆటోడ్రైవర్లంతా కలిసి సొంత యాప్ లాంచ్ చేశారు. అదే.. సుదేశీ యాప్ (Sudesi App). తమిళనాడులోని తిరుచిలో దాదాపు 600 మంది ఆటోరిక్షా డ్రైవర్లు ఈ కొత్త యాప్ తీసుకొచ్చారు. కార్పొరేట్ యాప్ సంస్థలకు చెల్లించే కమీషన్ ఎక్కువగా ఉండటంతో తామే సొంతంగా యాప్ ప్రవేశపెట్టారు ఆటోడ్రైవర్లు. సాధారణంగా కార్పొరేట్ యాప్ లకు ఆటోరిక్షా డ్రైవర్లు 35శాతం నుంచి 40శాతం వరకు కమీషన్ చెల్లాంచాల్సి వస్తోంది. దాంతో వారు సంపాదించే మొత్తంలో ఏం మిగలడం లేదు. అందుకే ఈ సొంత యాప్ అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెబుతున్నారు. కొత్త యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో కూడా అందుబాటులో ఉందని అంటున్నారు.

ఈ కొత్త Sudesi App ద్వారా కస్టమర్లు వెహికల్ బుకింగ్ చేసుకోవడం చాలా సౌకర్యవంతంగా ఉంటుందని అంటున్నారు. ఈ కొత్త యాప్ కోసం ఆటోడ్రైవర్ల బృందం ఒక టెక్ కంపెనీని సంప్రదించగా Sudesi App రూపొందించారు. ఈ కొత్త యాప్ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే పనిచేసేలా డిజైన్ చేశారు. అలాగే బుకింగ్ క్యాన్సిల్ చేసినా ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 1.8 కిలోమీటరుకు రూ.25 ఛార్జ్ చేస్తారు. అలాగే ఒక కిలోమీటర్ కు రూ.12 వరకు అదనంగా ఛార్జ్ చేయడం జరుగుతుందని Sudesi App సభ్యుల్లో ఒకరైన క్రిష్ణ కుమార్ పేర్కొన్నారు.
Cashify : పాత ఫోన్లు, లాప్‌ట్యాప్‌లు అమ్మాలనుకుంటున్నారా? మీకో గుడ్ న్యూస్

అదే కార్పొరేట్ యాప్ ద్వారా అయితే బుకింగ్ అమౌంట్ నేరుగా చెల్లించదని, కమీషన్ పోనూ మాత్రమే మిగిలేది వస్తుందని ఆయన తెలిపారు. అదే ఈ కొత్త యాప్ ద్వారా బుకింగ్ చేసుకుంటే నేరుగా పేమెంట్ అవుతుందని, ఫీజు తిరిగి ఇచ్చేది ఉండదని తెలిపారు. ఆటో డ్రైవర్లు కేవలం రూ.10 మాత్రమే చెల్లించాలని, అలాగే ఈ యాప్ నిర్వహణకు రూ.100 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుతానికి ఈ యాప్ తిరుచిలోనే ఉండగా.. రాబోయే రోజుల్లో చెన్నై, కోయింబత్తూరు, మధురై సహా ప్రధాన నగరాల్లో కూడా విస్తరించాలని ఈ ఆటోడ్రైవర్ల బృందం ప్లాన్ చేస్తోంది. ఆటో డ్రైవర్లు సైన్ అప్ విషయంలో యాప్ చాలా భద్రతతో కూడినదిగా చెబుతున్నారు. ఇతర యాప్స్ తో పోలిస్తే.. వెయిటింగ్ లేదా క్యాన్సలేషన్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని అంటున్నారు.
Vajrapaat App : పిడుగులను ముందే పసిగట్టే కొత్త యాప్.. ‘వజ్రపాత్’ వచ్చేసింది..

ట్రెండింగ్ వార్తలు