Amazon Summer Appliances Carnival : ఏసీలు, రిఫ్రిజరేటర్, కూలర్లపై 50శాతం డిస్కౌంట్లు

ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సమ్మర్ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. అమెజాన్‌లో మార్చి 12 నుంచి సమ్మర్ అప్లియన్సెస్ కార్నివల్ సేల్ ప్రారంభం కానుంది. మూడు రోజులు (మార్చి 15) వరకు ఈ సమ్మర్ సేల్ అందుబాటులో ఉంటుంది.

Amazon Summer Appliances Carnival : ఏసీలు, రిఫ్రిజరేటర్, కూలర్లపై 50శాతం డిస్కౌంట్లు

Summer Appliances Discount Offers On Amazon

Updated On : March 15, 2021 / 4:13 PM IST

Summer appliances Discount Offers on Amazon : ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సమ్మర్ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. అమెజాన్‌లో మార్చి 12 నుంచి సమ్మర్ అప్లియన్సెస్ కార్నివల్ సేల్ ప్రారంభం కానుంది. మూడు రోజులు (మార్చి 15) వరకు ఈ సమ్మర్ సేల్ అందుబాటులో ఉంటుంది. అమెజాన్ వినియోగదారులు ఏసీలు, రిఫ్రిజేటర్లు, కూలర్లు సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై 50శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ పలు కంపెనీల అప్లియన్సెస్ పై డిస్కౌంట్లు అందిస్తోంది. అమెజాన్ ఏయే డివైజ్‌లపై డిస్కౌంట్లు అందిస్తుందో ఓసారి చూద్దాం..

– వోల్టాస్ 1.4 టన్ (5 స్టార్) ఇన్వెర్టర్ అడ్జెస్టబుల్ స్ప్లిట్ ఏసీ : దీనిపై 49శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అమెజాన్‌లో ధర రూ.34,990లకు అందుబాటులో ఉంది. ఈ డివైజ్ రెండు అడ్జెస్టబుల్ మోడ్ లలో వస్తోంది. అవసరాన్నిబట్టి కూలింగ్ మోడ్ ఎంచుకోవచ్చు. ఇందులో నాయిస్ లెవల్ 46 డిసిబెల్ మాత్రమే ఉంది.

– LG 1.5 టన్ 5 స్టార్ ఇన్వెర్టర్ స్ప్లిట్ ఏసీ : ఒరిజినల్ ధరపై 28శాతం డిస్కౌంట్ అందిస్తోంది.. రూ.40,490లకే పొందవచ్చు. ఇందులో 4 ఇన్ 1 కన్వర్టబుల్ కూలింగ్ మోడల్, హెచ్ డీ ఫిల్టర్లు కూడా ఉన్నాయి.

– డాయికిన్ 0.8 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఏసీ : దీనిపై 14శాతం డిస్కౌంట్ అందిస్తోంది. రూ.23,350లకే పొందవచ్చు. కూపర్ కండెన్షర్ కాయిల్, PM 2.5 ఫిల్టర్లు కూడా ఉన్నాయి.

– బ్లూ స్టార్ 0.75 టన్ 3 స్టార్ రేటింగ్ విండో ఏసీ : ఒరిజినల్ ధరపై 23శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అంటే. రూ.17,999లకే ఏసీ కొనుగొలు చేసుకోవచ్చు. యాంటీ బ్యాక్టిరీయల్ కోటింగ్ తో వస్తోంది.

– శాంసంగ్ 253L 3 స్టార్ ఇన్వర్టెర్ ఫారెస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజరేటర్ : 19శాతం డిస్కౌంట్ తో రూ.23,490లకే పొందవచ్చు. 253 లీటర్ల కేపాసిటీతో వస్తోంది. ఐస్ లెవల్ పెరిగితే.. ఆటో డీఫ్రోస్ట్ ఆప్షన్ అందుబాటులో
ఉంది.

– ఆటోమ్ బెర్గ్ రెనిసా ప్లస్ 1200ఎంఎం BLDC మోటార్, రిమోట్ సీలింగ్ ఫ్యాన్ : 19శాతం డిస్కౌంట్ తో రూ.3,643లకే అందుబాటులో ఉంది. ఈ సీలింగ్ ఫ్యాన్ రిమోట్ కంట్రోల్ తో వస్తోంది. బూస్ట్, స్లీప్, స్పీడ్ కంట్రోల్, టైమర్ మోడ్ అనేక ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయి.