Bike Information: సరికొత్త రంగుల్లో సుజుకి యాక్సిస్, బర్గ్మాన్ స్కూటర్లు
సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియా, తన స్కూటర్ల శ్రేణిలో ఉన్న రెండు వాహనాలకు సరికొత్త హంగులు జోడించి మార్కెట్లోకి విడుదల చేసింది.

Suzuki Access 125 In Fibroin Grey Color
Bike Information: పండుగల సీజన్లో అమ్మకాలను అందిపుచ్చుకునేందుకు ద్విచక్ర వాహన కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా తమ పోర్ట్ ఫోలియోలను విస్తరిస్తూ, వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియా, తన స్కూటర్ల శ్రేణిలో ఉన్న రెండు వాహనాలకు సరికొత్త హంగులు జోడించి మార్కెట్లోకి విడుదల చేసింది. సుజుకి యాక్సిస్, సుజుకి బర్గ్ మాన్ లోను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్ది మార్కెట్లోకి వదిలింది. ఇప్పటికే భారత్ మార్కెట్లో ఉన్న ఈ రెండు స్కూటర్లు సంస్థ నుంచి ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. మరి ప్రస్తుతం విడుదల చేసిన రెండు స్కూటర్ల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ముందుగా ఈ రెండు వాహనాల్లో కొత్తగా జోడించిన అంశం ఏమిటంటే “కలర్”. సుజుకి యాక్సిస్, సుజుకి బర్గ్ మాన్ రెండు వాహనాలు రెండు సరికొత్త రంగుల్లో అందుబాటులోకి వచ్చాయి. యాక్సిస్ స్కూటర్లోని బ్లూ టూత్ వేరియంట్… “గ్లాసి గ్రే” కలర్ లో లభిస్తుండగా, స్టాండర్డ్ వేరియంట్ “మెటాలిక్ డార్క్ గ్రీనిష్ బ్లూ” కలర్ లో లభ్యమౌతుంది. బర్గ్ మాన్ స్కూటర్లోని స్టాండర్డ్, బ్లూ టూత్ వేరియంట్లు రెండునూ “గ్లాసి గ్రే”కలర్ లోనే లభ్యం అవుతున్నాయి. ఈ రెండు స్కూటర్లు 125 సీసీ ఇంజిన్ కెపాసిటీతోనే వస్తున్న విషయం తెలిసిందే. ఇంజిన్ పరంగా పెద్దగా మార్పులేమీ లేవు.
ఇక బర్గ్ మాన్ 125 స్కూటర్ మాత్రం డ్యూయల్ టోన్ సీట్, ఫుట్ బోర్డుతో సరికొత్తగా వస్తుంది. ఇక ద్విచక్ర వాహన చట్టం సరికొత్త మార్గదర్శకాల ప్రకారం, “సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్” ఫీచర్ ను ఈ రెండు స్కూటర్లలో సరికొత్తగా అమర్చింది సుజుకి. 125 సీసీ ఇంజిన్ కలిగి ఉన్న ఈరెండు స్కూటర్లు 8.6 బీహెచ్పీ పవర్, 10 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి. ఇవేకాక ప్రస్తుతం వస్తున్న హైటెక్ సొబగులన్నీ దాదాపు ఈరెండు స్కూటర్లలో ఉన్నాయి. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఆప్షనల్ గా వస్తున్న ఈ స్కూటర్లు ఇండియాలో సంస్థ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న వాహనాలు.
Also Read: Variety Juice Shop: సైకిల్ తొక్కితేనే జ్యూస్ వస్తుంది: వెరైటీ జ్యూస్ బార్