Tech tip : అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ క్యాన్సిల్ చేయడం ఎలా?
మీకు అమెజాన్ ప్రైమ్ (Prime Video) మెంబర్‌షిప్ ఉందా? అయితే ప్రైమ్ మెంబర్‌షిప్ క్యాన్సిల్ చేద్దామనుకుంటున్నారా? అయితే ఈ టెక్ టిప్ ఫాలో అవ్వండి..

Tech Tip How To Cancel Your Amazon Prime Subscription
Tech tip : మీకు అమెజాన్ ప్రైమ్ (Prime Video) మెంబర్‌షిప్ ఉందా? అయితే ప్రైమ్ మెంబర్‌షిప్ క్యాన్సిల్ చేద్దామనుకుంటున్నారా? అయితే ఈ టెక్ టిప్ ఫాలో అవ్వండి.. అమెజాన్ ప్రైమ్ సర్వీసును సులభంగా రద్దు చేసుకోవచ్చు. ప్రస్తుత రోజుల్లో ఓటీటీ వినియోగం పెరిగిపోయింది. ప్రతిఒక్కరూ ఓటీటీ కంటెంట్ పైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్ వంటి OTT ప్లాట్‌ఫారమ్‌లు తమ సభ్యత్వాన్ని రద్దు చేయడానికి సులభమైన మార్గాన్ని అందిస్తున్నాయి.
ఈ ఫీచర్ కొన్ని ఓటీటీ యాప్స్‌లో వెంటనే కనిపిస్తుంది. కానీ, ప్రైమ్ యాప్‌లో క్యాన్సిలేషన్ ఆప్షన్ అందుబాటులో లేదు. దాంతో అమెజాన్ యూజర్లు గందరగోళానికి గురవుతారు. ఇందుకోసం కంపెనీ అధికారిక అమెజాన్ వెబ్ సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడే ప్రైమ్ వీడియో సభ్యత్వాన్ని రద్దు చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందిల్లా అక్కడ కనిపించే ఆప్షన్లను ఫాలో అయిపోవడమే..
మీ అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ఎలా రద్దు చేయాలంటే?
Method – 1 :
– ఈ ప్రక్రియ చాలా సులభం. కానీ, మీరు మీ అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను రద్దు చేసే ఆప్షన్ వెంటనే కనిపించకపోవచ్చు.
– మీ స్మార్ట్‌ఫోన్‌లో అమెజాన్ యాప్ ఓపెన్ చేయాలి. మీ స్క్రీన్ దిగువన ఉన్న హాంబర్గర్ మెనుపై Press చేయాలి.
– ఇప్పుడు, మీరు అకౌంట్‌పై Press చేసి.. క్రిందికి స్క్రోల్ చేయాలి.
– మీరు ప్రైమ్ మెంబర్‌షిప్‌ను Manage అనే ఆప్షన్ ఎంచుకుని దానిపై Tap చేయండి.
– ఇప్పుడు, స్క్రీన్ పైన కనిపించే Manage membership ఆప్షన్ మళ్లీ Tap చేయండి.
– మేనేజ్‌మెంట్ విభాగంలో ఉన్న Membership ఆప్షన్ Tap చేయండి.
– మీరు కేవలం End membership ఆప్షన్ Tap చేయండి.
– ఈ క్రమంలో cancellation గురించి అమెజాన్ మిమ్మల్ని 2-3 సార్లు అలర్ట్ చేస్తుంది.
– క్రిందికి స్క్రోల్ చేసి.. Cancel చేసేందుకు Continue ఆప్షన్ Tap చేయండి.
– కొంత సమయం తర్వాత మీ సభ్యత్వం ముగుస్తుందని యాప్ మెసేజ్ చూపిస్తుంది.
– మీరు మొదటి ఆప్షన్ ఎంచుకోండి. మీరు మీ మనీ తిరిగి పొందాలనుకుంటే.. ఇప్పుడే End now బటన్ Tap చేయండి. మీకు ఎంత రిఫండ్ అవుతుందో యాప్ చూపిస్తుంది.

Tech Tip How To Cancel Your Amazon Prime Subscription
Note : ఒకవేళ మీరు మీ Amazon మెంబర్‌షిప్ రద్దుపై నిర్ణయాన్ని మార్చుకుంటే.. మీరు keep my membership ఆప్షన్ Tap చేయండి. ఇప్పుడు కాదు.. తర్వాత నిర్ణయం తీసుకోవాలనుకుంటే.. అప్పటివరకూ remind me later ఆప్షన్ Tap చేయండి.
Method – 2 :
– అమెజాన్ యాప్‌లో మీకు క్యాన్సిలేషన్ ఆప్షన్ కనిపించకపోతే.. Googleలో ఎండ్ ప్రైమ్ మెంబర్‌షిప్ (End prime membership) అని టైప్ చేయవచ్చు. అప్పుడు మీరు రెండవ లింక్‌పై క్లిక్ చేయాలి (End your Amazon Prime membership).
– ఇప్పుడు.. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌పై క్లిక్ చేయాలి.
– ఆపై మెంబర్‌షిప్‌ని మేనేజ్ చేయండి. మిగిలిన ప్రాసెస్ పూర్తి చేయాలంటే పై మెథడ్ మాదిరిగానే అనుసరించాలి.
Read Also : Amazon Prime Video : అమెజాన్ కొత్త ప్రైమ్ స్టోర్ సర్వీసు.. ఇచ్చట మూవీలు అద్దెకు ఇవ్వబడును..!